ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.
ముక్కోణపు వన్డే సిరీస్
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఆదివారం ఆట మొదలు పెట్టిన 9 నిమిషాలకే భారీ వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. దీంతో ఇరు జట్ల ఖాతాలో చెరో 2 పాయింట్లు చేరాయి. ప్రస్తుతం 12 పాయింట్లతో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉండగా... ఆసీస్ (11 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది. వెస్టిండీస్ (8) పాయింట్లతో ఉంది. కరీబియన్లు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.