స్లెడ్జింగ్ చేయడంలో తానేం తక్కువ కాదంటున్నాడు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో కమిన్స్‌కు మాటకు మాటతోనే బదులిచ్చిన ఈ యువ వికెట్ కీపర్ తాజాగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆ జట్టు కెప్టెన్ టీమ్‌పైన్‌కు అదే తరహాలో బుద్ది చెప్పాడు. ఇక మూడో రోజు ఆటలో టీమ్ పైన్ తన నోటి దురుసు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పదే పదే సూటి పోటి మాటలతో అతని ఏకాగ్రతను దెబ్బతీయాలనే ప్రయత్నం చేశాడు.