‘స్లెడ్జింగ్’ లేకుంటే ఆటను ఆస్వాదించలేం..
స్లెడ్జింగ్ ఆటలోని ఒక భాగమేనని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్రసెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
సాక్షి, హైదరాబాద్: స్లెడ్జింగ్ ఆటలోని ఒక భాగమేనని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్రసెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. స్లెడ్జింగ్ లేకుంటే ఆటను ఆస్వాదించలేమని, ఆటగాళ్లు హద్దులు దాటనంత వరకే స్లెడ్జింగ్ బాగుంటుందని ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్ల బ్యాటింగ్, బౌలింగ్ శైలీలను అనుకరిస్తూ స్లెడ్జింగ్‌కు పాల్పడాలి తప్ప వ్యక్తిగత దూషణలకు దిగకూడదని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఇక కోహ్లి దూకుడతనం గురించి స్పందిస్తూ అది తన సహజశైలి అని గేమ్‌ను అస్వాదించడంలో అతను దూకుడుగా ప్రవర్తిస్తాడని సెహ్వాగ్ ఈ యువ కెప్టెన్‌ను వెనుకేసుకొచ్చాడు. మ్యాచ్ గెలిచినప్పుడే దూకుడుగా ప్రవర్తిస్తాడని, ఎవరైన తనపై స్లెడ్జింగ్ పాల్పడితే తిరిగి సమాధానం చెబుతాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. దీన్ని స్లెడ్జింగ్‌గా పరిగణించవద్దని కూడా సూచించాడు.
ఈ సంవత్సరం మొదట్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల మధ్య స్లెడ్జింగ్ తారాస్తాయికి చేరిన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ కోహ్లి, ఆసీస్ కెప్టెన్ స్మిత్‌లు పరస్పరం వ్యక్తిగత దూషణల వరకు వెళ్లారు. ఇక మరోసారి భారత్‌తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారత గడ్డపై అడుగుపెట్టనుంది. దీంతో స్లెడ్జింగ్‌పై సర్వత్రా చర్చనెలకొనగా.. సెహ్వాగ్ వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ఇక శ్రీలంక పర్యటన అనంతరం భారత్ ఆసీస్‌తో 5 వన్డేల ఆడనుంది. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 17న చెన్నైలో జరగనుంది.