ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టులో అతిగా ప్రవర్తించిన స్పిన్నర్ నాథన్ లియోన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) జరిమాన విధించింది. నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులోనే స్లెడ్జింగ్ తారా స్థాయికి చేరింది. ప్రొటీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆటగాళ్లు క్రీడా స్పూర్తి మరిచి ప్రవర్తించారు. లియోన్ వేసిన 12 ఓవర్లో మార్కర్‌తో సమన్వయ లోపంతో ఏబీ డివిలియర్స్ రనౌట్ అయ్యాడు. ఆనందంలో మునిగిపోయిన లియోన్ బంతిని ఏబీ పైకి విసరడంతో చాతికి తగిలింది. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో నాథన్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. అయితే బంతి కావాలని విసరలేదని నాథన్ క్షమాపణలు కోరాడు.
Published Tue, Mar 6 2018 1:27 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement