అజింక్యా రహానే
సాక్షి, స్పోర్ట్స్ : మైదానంలో స్లెడ్జింగ్ చేయడం, డ్రైవింగ్ చేస్తుండగా హారన్ కొట్టడం ఇష్టం ఉండదని టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే తెలిపాడు. మహారాష్ట్ర మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్(ఎమ్‌వీడీ), టాటా గ్రూప్ సంయుక్తంగా రోడ్డు భద్రత, శబ్ద కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా మార్చి 24న ముంబై వాంఖడే మైదానంలో రోడ్ సేఫ్టీ ఎలెవన్-నో హాంకింగ్ ఎలెవన్ అనే జట్ల పేరుతో ఓ టీ20 మ్యాచ్ నిర్వహిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో రహానేతో పాటు యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా పలువురు దేశవాళీ కిక్రెటర్లు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా రహానె మాట్లాడుతూ.. మైదానంలో స్లెడ్జింగ్ చేయడం ఇష్టం ఉండదని, అలాగే డ్రైవింగ్ చేసే సమయంలో అనవసరంగా కారు హారన్ మోగించడం కూడా తనకు ఇష్టం ఉండదని తెలిపాడు. ముంబై వంటి మెట్రో నగరాల్లో శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద సమస్యగా మారిందని చెప్పుకొచ్చాడు. క్రికెట్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment