సాక్షి, స్పోర్ట్స్: ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్, ఎగతాళిలు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భాగమేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో స్లెడ్జింగ్ తారస్థాయికి చేరి ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకునే వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ ఇవన్నీ ఆటలో భాగమేనని బీరు తాగి కలిసిపోవాలని ఇద్దరి ఆటగాళ్లకు సూచించాడు.
నాలుగో రోజు టీ విరామానికి ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న సమయంలో వార్నర్-డికాక్ పరస్పరం దూషించుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే దారిలో ఉన్న మెట్ల వద్దే వార్నర్ ఆవేశంగా డి కాక్ వైపు దూసుకుపోయే ప్రయత్నం చేయడం కెమెరాల్లో రికార్డయింది. సహచరుడు ఖాజా పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వార్నర్ మాత్రం తగ్గలేదు. కొద్ది దూరంలోనే ఉన్న డి కాక్ కూడా ఆ సమయంలో ఏదో అంటూ తమ జట్టు గది వైపు వెళ్లిపోయాడు. ఈ వ్యవహరమంతా బయటకు రావడంతో చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై షేన్ వార్న్ ట్విటర్ వేదికగా స్పందించాడు.
‘‘ఆటగాళ్ల మధ్య ఎగతాళిలు, చీదరింపులు, స్లెడ్జింగ్‌లు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భాగమే. ఇరు జట్లు ఆటగాళ్లు ఇంతటితో వదిలేయండి. ఒకరికొకరు మర్యాదగా నడుచుకోవడం మంచిది. ఎవరైనా వ్యక్తిగత విషయాలు ప్రస్తావించొద్దు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడం మానేసి బీరు తాగుతూ కలిసిపోండి’’ అని వార్న్ ట్వీట్ చేశాడు.
ఇక దక్షిణాఫ్రికా ఆటగాళ్ల పట్ల వార్నర్ ఎన్నోసార్లు తన హద్దులు దాటి ప్రవర్తించాడని, అందుకే అతని రియాక్షన్ పట్ల మేం ఆశ్చర్య పడలేదని, ఒకరిపై కామెంట్ చేసేముందు తీసుకోవడానికి కూడా సిద్దంగా ఉండాలని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ట్వీట్ చేశాడు. డర్బన్‌లో నీచమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయని, ఆటగాళ్లు వ్యక్తిగతంగా దూషించుకోవడం అంత మంచిది కాదని గిల్‌క్రిస్ట్ ట్వీట్ చేశాడు.
Chat, banter, sledging has always been apart of any series between SA & Oz. Both sides always give it out. Respect is the key & I hope nothing personal was said to any player towards anyone from either side. Have a beer together afterwards & get on with it - stop the whinging !
— Shane Warne (@ShaneWarne) 5 March 2018
Comments
Please login to add a commentAdd a comment