11 ఓవర్లు ముగిసేసరికి 44 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన ఇంగ్లండ్‌ను స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఆదుకున్నాడు. భారీ స్కోరుతో ఆదిత్య జట్టును బెంబేత్తించిన ప్రత్యర్థికి తన ఫామ్‌ను కొనసాగిస్తూ కొరకరాని కొయ్యగా మారాడు. 119 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బిల్లింగ్స్‌తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బెయిర్ స్టో తాజా సెంచరీతో పలురికార్డులు సాధించాడు. 2016 అనంతరం టీమిండియాపై అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు.
అయితే, 55 వ ఓవర్ మొదటి బంతికి షమీ బౌలింగ్‌లో బెయిర్ స్టో (140 బంతుల్లో 106; ఫోర్లు 14, సిక్సర్లు 2) కోహ్లికి ఫస్ట్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జట్టును కష్ట సమయంలో ఆదుకున్న అతడికి సహచర ఆటగాళ్లు స్టాండింగ్ ఓవెషన్ ఇచ్చారు.
సెంచరీల వరద
గత రెండు టెస్టు మ్యాచుల్లోనూ బెయిర్ స్టో పరుగుల వరద పారించాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 మరియు 136 పరుగులు చేశాడు. అదే న్యూజిలాండ్‌తో హెడింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో 162 మరియు 71 పరుగులతో చెలరేగిపోయాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌తో మ్యాచులోనూ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బెయిర్ స్టోకి టెస్టుల్లో ఇది 11వ సెంచరీ కావడం విశేషం. వరుసగా మూడు టెస్టుల్లో 100 పరుగులు చేసిన ఇంగ్లండ్ 15 వ ఆటగాడిగా బెయిర్ స్టో రికార్డు నెలకొల్పాడు.
క్లార్క్ తర్వాత బెయిర్ స్టో!
ఐదో స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బెయిర్ స్టో నిలిచాడు. 2012లో ఆస్ట్రేలియా ఆటగాడు మైకేల్ క్లార్క్ ఐదు సెంచరీలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment