first test match
-
భారత్ ‘స్పిన్ బాల్’...ఆపై జైస్వాల్...
‘బజ్‌బాల్’... దూకుడైన ఆటకు మారుపేరు అంటూ ఇంగ్లండ్ జట్టు గత కొంత కాలంగా ప్రచారం చేసింది. అయితే భారత్‌లో ఇది సాధ్యమా అనే సందేహాలు వినిపించాయి. ఇంగ్లండ్ ఆశించినట్లుగా ఆ ధాటి పని చేసింది... అయితే అది తొలి ఎనిమిది ఓవర్ల వరకే... ఆ తర్వాత భారత ‘స్పిన్ బాల్’ దెబ్బకు లెక్క మారిపోయింది... వరుసగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివర్లో స్టోక్స్ ఆదుకోవడంతో కాస్త కోలుకుంది. అక్కడక్కడ ఇంగ్లండ్ కాస్త మెరుగైన స్థితిలోనే నిలిచినా చివరకు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆపై మన గడ్డపై ‘బజ్‌బాల్’ ఎలా ఆడాలో భారత ఓపెనర్లు చూపించారు. యశస్వి ధాటికి ఆరంభంలో స్కోరు ఆరుకు పైగా రన్‌రేట్‌తో సాగింది. తొలి రోజే ప్రత్యర్థి స్కోరులో దాదాపు సగం స్కోరును జట్టు అందుకుంది... మొత్తంగా అన్ని విధాలా మొదటి రోజు మనదిగా ముగిసింది. సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ మొదటి రోజు పైచేయిని ప్రదర్శించింది. టాస్ ఓడిపోవడం మినహా దాదాపు మిగతా రోజంతా టీమిండియాకే అనుకూలంగా సాగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (88 బంతుల్లో 70; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా... బెయిర్‌స్టో (58 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. స్పిన్నర్లు అశ్విన్ జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టగా...అక్షర్ పటేల్ ఖాతాలో 2 వికెట్లు చేరాయి. పేసర్ బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు సాధించింది. యశస్వి జైస్వాల్ (70 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... రోహిత్ శర్మ (27 బంతుల్లో 24; 3 ఫోర్లు) రాణించాడు. ప్రస్తుతం భారత్ మరో 127 పరుగులు వెనుకబడి ఉండగా... క్రీజ్‌లో యశస్వితో పాటు గిల్ (43 బంతుల్లో 14 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నాడు. నేడు రెండో రోజూ పూర్తిగా బ్యాటింగ్ చేసి టీమిండియా భారీ స్కోరు సాధిస్తే మ్యాచ్ చేతుల్లోకి వచ్చి నట్లే. ఓపెనర్ల శుభారంభం... బుమ్రా, సిరాజ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ క్రాలీ (40 బంతుల్లో 20; 3 ఫోర్లు), డకెట్ (39 బంతుల్లో 35; 7 ఫోర్లు) వేగంగా పరుగులు రాబట్టారు. 8 ఓవర్లలో వీరు 41 పరుగులు జత చేశారు. తర్వాతి ఓవర్ జడేజా మెయిడిన్‌గా వేయడంతో దూకుడుకు అడ్డుకట్ట పడింది. అశ్విన్ , జడేజా చెలరేగడంతో 5 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఈ దశలో రూట్ (60 బంతుల్లో 29; 1 ఫోర్), బెయిర్‌స్టో కలిసి 61 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే 4 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. అక్షర్ అద్భుత బంతితో బెయిర్‌స్టోను బౌల్డ్ చేయగా, రూట్ స్వయంకృతంతో వెనుదిరిగాడు. 137/6తో ఇన్నింగ్స్ ముగిసేందుకు ఇంగ్లండ్ చేరువైంది. అయితే స్టోక్స్ తన విలువను చూపించాడు. ఈ స్థితిలో స్టోక్స్ స్కోరు 8 పరుగులు మాత్రమే. కానీ టెయిలెండర్ల సహాయంతో అతను చెలరేగిపోయాడు. జట్టు సాధించిన తర్వాతి 109 పరుగుల్లో 62 అతని బ్యాట్ నుంచే రాగా... హార్లీ (24 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) తన కెప్టెన్ కు అండగా నిలిచాడు. జడేజా ఓవర్లో స్టోక్స్ వరుస బంతుల్లో కొట్టిన రెండు సిక్సర్లు, అతని ఓవర్లోనే బాదిన మూడు ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. చివరకు చక్కటి బంతితో స్టోక్స్ ఆటను బుమ్రా కట్టించాడు. తొలి రెండు సెషన్లలో వందకు పైగా పరుగులు సాధించి ఇంగ్లండ్ మెరుగ్గానే ఆడినా... చివరకు వచ్చేసరికి ఆ జట్టు ఆశించిన భారీ స్కోరు మాత్రం సాధ్యం కాలేదు. మెరుపు ఆరంభం... వుడ్స్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌తో మొదలు పెట్టిన యశస్వి, అరంగేట్ర బౌలర్ హార్లీ తొలి టెస్టు బంతిని సిక్సర్ బాది స్వాగతం పలికాడు. మరోవైపు రోహిత్ అండగా నిలవడంతో 6.3 ఓవర్లలోనే టీమిండియా స్కోరు 50 పరుగులకు చేరింది. అనంతరం 47 బంతుల్లోనే యశస్వి అర్ధసెంచరీ పూర్తయింది. అయితే జట్టుకు అంతా అనుకూలంగా ఉండి టెస్టులో ఇంకా ఎంతో సమయం మిగిలి ఉన్నా... అనవసరంగా అత్యుత్సాహానికి పోయి చెత్త షాట్ ఆడిన రోహిత్ వికెట్ పారేసుకున్నాడు. అనంతరం గిల్ బాగా జాగ్రత్త ప్రదర్శించడంతో వేగం తగ్గింది. అయినా చివరకు 5.17 రన్‌రేట్‌తో భారత్ రోజును ముగించింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 20; డకెట్ (ఎల్బీ) (బి) అశ్విన్ 35; పోప్ (సి) రోహిత్ (బి) జడేజా 1; రూట్ (సి) బుమ్రా (బి) జడేజా 29; బెయిర్‌స్టో (బి) అక్షర్ 37; స్టోక్స్ (బి) బుమ్రా 70; ఫోక్స్ (సి) భరత్ (బి) అక్షర్ 4; రేహన్ (సి) భరత్ (బి) బుమ్రా 13; హార్లీ (బి) జడేజా 23; వుడ్ (బి)అశ్విన్ 11; లీచ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (64.3 ఓవర్లలో ఆలౌట్) 246. వికెట్ల పతనం: 1–55, 2–58, 3–60, 4–121, 5–125, 6–137, 7–155, 8–193, 9–234, 10–246. బౌలింగ్: బుమ్రా 8.3–1–28–2, సిరాజ్ 4–0–28–0, జడేజా 18–4–88–3, అశ్విన్ 21–1–68–3, అక్షర్ 13–1–33–2. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (బ్యాటింగ్) 76; రోహిత్ (సి) స్టోక్స్ (బి) లీచ్ 24; గిల్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (23 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119. వికెట్ల పతనం: 1–80. బౌలింగ్: వుడ్ 2–0–9–0, హార్లీ 9–0 –63–0, లీచ్ 9–2–24–1, రేహన్ 3–0–22–0. -
భారత్ - ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్
-
India vs England test: 18 నుంచి టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 25 నుంచి 29 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఈనెల 18 నుంచి ఆన్లైన్లో విక్రయిస్తారు. పేటీఎం ఇన్సైడర్ యాప్‌లో, www.insider.in వెబ్సైట్లో రాత్రి 7 గంటల నుంచి టికెట్లు లభిస్తాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఆదివారం ప్రకటించారు. మిగిలిన టికెట్లను ఈనెల 22 నుంచి ఆఫ్‌లైన్‌లో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో విక్రయిస్తామని ఆయన వివరించారు. టికెట్ల ధరలను ఒక్కో రోజుకు రూ. 200, రూ. 499, రూ. 750, రూ. 1250, రూ. 3000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 4000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)గా నిర్ణయించారు. ఐదు రోజుల సీజన్ టికెట్ల ధరలను రూ. 600, రూ. 1500, రూ. 2250, రూ. 3750, రూ. 12000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 16000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)లుగా నిర్ణయించారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి 22వ తేదీ నుంచి జింఖానా మైదానంలో టికెట్లను రీడీమ్ చేసుకోవాలి. -
AUS Vs SA 1st Test: ఉగ్రరూపం దాల్చిన పేసర్లు.. రెండు రోజుల్లోనే ఖేల్ ఖతం
గబ్బా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగినప్పటికీ.. సఫారీలతో పోలిస్తే ఆస్ట్రేలియా కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో విజయం సాధించగలిగింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (96 బంతుల్లో 92; 13 ఫోర్లు, సిక్స్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆట తొలి రోజు 15 వికెట్లు నేలకూలిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఓవర్‌నైట్ స్కోర్ 145/5 వద్ద రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 73 పరుగులు జోడించి 218 పరుగుల వద్ద ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ 8 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. సఫారీ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్ 3, నోర్జే 2, ఎంగిడి ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. పాట్ కమిన్స్ (5/42), మిచెల్ స్టార్క్ (2/26), స్కాట్ బోలాండ్ (2/14), నాథన్ లయోన్ (1/17) ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ను సఫారీ ఏస్ పేసర్ రబాడ వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (2), డేవిడ్ వార్నర్ (3), స్టీవ్ స్మిత్ (6), ట్రవిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైప్పటికీ 19 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడంతో ఆసీస్ గెలుపొందింది. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. సఫారీ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. -
శ్రీలంకపై ప్రకృతి ప్రకోపం.. వర్ష బీభత్సం ధాటికి అతలాకుతలమైన క్రికెట్ స్టేడియం
ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయి కొట్టిమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకపై ప్రకృతి సైతం పగబట్టింది. ఇవాళ (జూన్ 30) ఉదయం కురిసిన భారీ వర్షం దెబ్బకు లంకలోని చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్ష బీభత్సం ధాటికి కొన్ని ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. వర్ష ప్రభావం శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌పై కూడా చూపింది. There's more cleaning up to do off the field than on it this morning... if anyone can get this ground ready for play it's the Galle team #SLvAUSpic.twitter.com/iklKta7xfM— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) June 30, 2022 వర్షం ధాటికి ఈ మ్యాచ్‌కు వేదిక అయిన గాలే స్టేడియం అతలాకుతలమైంది. తొలి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభానికి రెండు గంటల ముందు ప్రారంభమైన గాలివాన దెబ్బకు ఓ స్టాండ్ రూఫ్ కూలిపోవడంతో పాటు స్టేడియం మొత్తం చిత్తడిచిత్తడిగా మారిపోయింది. ఫలితంగా రెండో రోజు ఆట దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈదురుగాలుల ధాటికి రూఫ్ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే, వర్షం పూర్తిగా ఆగిపోయాక లంచ్ తర్వాత ఆట ప్రారంభమైంది. 98/3 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద ప్రారంభమైన రెండు రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. రెండు రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసి 101 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ఓవర్‌నైట్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా (71), కెమరూన్ గ్రీన్ (77) అర్ధసెంచరీతో రాణించారు. అలెక్స్ క్యారీ (45) పర్వాలేదనిపించాడు. కమిన్స్ (26), లయన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌటైంది. నాథన్ లయన్ 5 వికెట్లతో చెలరేగాడు. చదవండి: IND Vs ENG: ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సై! ప్రాక్టీసు వీడియో! -
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ అజేయ శతకం.. బాధలో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
ఆంటిగ్వా : మంగళవారం వెస్టిండీస్‌తో (మార్చి 8) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (109) అజేయ శతకంతో చెలరేగాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో బరిలోకి దిగిన బెయిర్‌స్టో.. బెన్ స్టోక్స్(36), బెన్ ఫోక్స్(42), క్రిస్ వోక్స్ (24 నాటౌట్)ల సహకారంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో ఎనిమిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 216 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో 17 ఫోర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇదిలా ఉంటే, బెయిర్‌స్టో సెంచరీతో చెలరేగడం చూసిన అతని మాజీ ఐపీఎల్ జట్టు (సన్‌రైజర్స్ హైదరాబాద్) అభిమానులు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఇలాంటి ఆటగాడిని వదులుకున్నందుకు ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్‌పై మండిపడుతున్నారు. ఈ ఏడాది మెగా వేలంలో పస లేని ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నారని సన్‌రైజర్స్ యాజమాన్యంపై ఫైరవుతున్నారు. కాగా, ఎస్ఆర్హెచ్ వదిలించుకున్న బెయిర్‌స్టోను మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 6 .75 కోట్లకు దక్కించుకుంది. బెయిర్‌స్టో తాజా శతకంతో ఓవైపు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ బాధపడుతుండగా, మరోవైపు పంజాబ్ కింగ్స్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా, ఇంగ్లండ్ స్టార్ ప్లేయరైన బెయిర్‌స్టోకు ఐపీఎల్లో ఘనమైన రికార్డే ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో అతను 28 మ్యాచ్‌ల్లో 142 స్ట్రయిక్ రేట్‌తో పాటు 41.52 సగటున 1038 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. సీజన్ మొత్తానికి దూరం కానున్న స్టార్ బౌలర్..! -
PAK Vs AUS: వార్నర్ ఏమాత్రం తగ్గట్లేదుగా.. ఈసారి భల్లే భల్లే డ్యాన్స్‌తో..!
గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో రెట్టింపు హుషారుగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. రావల్పిండి వేదికగా పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో తనలోని డ్యాన్సింగ్ టాలెంట్‌ను మరోసారి బయటపెట్టాడు. ఇదే టెస్ట్ సందర్భంగా పుష్ప సినిమాలోని 'తగ్గేదేలే' డైలాగ్‌ను ఇమిటేట్ చేసిన అతను.. టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు మైదానంలో భాంగ్రా నృత్యం (పంజాబీ డ్యాన్స్) చేసి అందరినీ ఎంటర్టైన్ చేశాడు. 30 సెకెన్లకు పైగా అదిరేటి స్టెప్పులేసిన వార్నర్.. మైదానంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరలవుతోంది. The crowd and the camera love @davidwarner31 🕺🏼#BoysReadyHain I #PAKvAUS pic.twitter.com/UWQYAjTLsk — Pakistan Cricket (@TheRealPCB) March 8, 2022 కాగా, వార్నర్‌కు ఇలా డ్యాన్సులేయడం, తెలుగు సినిమాల్లోని డైలాగ్‌లను ఇమిటేట్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో అతను తెలుగు హీరోల ముఖాలను తన ముఖంతో మార్ఫింగ్ చేసి పాపులర్ డైలాగులను అప్పజెప్పాడు. అతనితో పాటు అతని భార్య, పిల్లలు కూడా పోటీపడి మరీ డ్యాన్స్‌లు చేసి, అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇదిలా ఉంటే, 35 ఏళ్ల డేవిడ్ వార్నర్‌ను ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. డీసీ వార్నర్‌ను రూ. 6.25 కోట్లకు సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్.. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 150 మ్యాచ్‌లు ఆడి 41 సగటుతో 5449 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ? -
రోహిత్ శర్మకు ఏమైంది.. ? ట్విట్టర్ అకౌంట్ నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు
Fans Feel Rohit Sharma Twitter Account Has Been Hacked: వరుస సిరీస్ విజయాలతో పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సోషల్‌మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హిట్‌మ్యాన్‌ను అనుసరించేవారు ట్విట్టర్లో 20.2 మిలియన్లు, ఇన్‌స్టాలో 22.6 మిలియన్ల మంది ఉన్నారు. ఇన్‌స్టా అకౌంట్‌ను వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసేందుకు మాత్రమే ఉపయోగించే హిట్‌మ్యాన్.. ట్విట్టర్లో మాత్రం క్రికెట్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంటాడు. Rohit sharma Account hacked maybe 🙄...weirds tweets ho re h bas 😂 #RohitSharma #hack pic.twitter.com/u1xzz9a80n — gungun♡ (@thoughtfulkid_) March 1, 2022 కాగా, ఇవాళ (మార్చి 1న) రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్లు అతని అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ‘నాకు కాయిన్ టాస్ అంటే ఇష్టం. ముఖ్యంగా అవి నా కడుపులోకి ఎప్పుడైతే చేరతాయో..’ అంటూ రోహిత్ అకౌంట్ నుంచి పలు అర్ధం పర్ధం లేని ట్వీట్లు వచ్చాయి. ఇవి చూసిన అభిమానులు రోహిత్ భాయ్‌కి ఏమైంది..? అర్ధం పర్ధం లేని ట్వీట్లతో తికమకపెడుతున్నాడంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పుడూ ఇలాంటి ట్వీట్లు చేయని రోహిత్ కొత్తగా పిచ్చి పిచ్చి మెసేజ్‌లు చేస్తుండటంతో అతని అకౌంట్ హ్యాక్ అయ్యిందేమోనన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. Is that rohit sharma Twitter got hacked ??? @ImRo45 pic.twitter.com/sfVDnIeqM1 — Mr Unknown (@MrUnknown812) March 1, 2022 ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత విరాట్ కోహ్లి నుంచి టీ20 పగ్గాలు చేపట్టిన రోహిత్.. తదనంతర పరిణామాల్లో టీమిండియా ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నియమించబడిన విషయం తెలిసిందే. రోహిత్.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక వరుసగా మూడు టీ20 సిరీస్‌లు, ఓ వన్డే సిరీస్ (విండీస్‌పై)ను క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు పొట్టి క్రికెట్లో వరుసగా 12 విజయాలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ ద్వారా రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టబోతున్నాడు. It's got to be hacked because his last two tweets were from TweetDeck while the rest are from an iPhone. pic.twitter.com/jTVVFGzH19 — Ishika (@IshikaMullick) March 1, 2022 చదవండి: కెప్టెన్సీ విషయంలో నాన్చుడేంది.. అర్థం కాని ఆర్సీబీ వైఖరి -
కాన్వే అద్భుత శతకం.. తొలి రోజు ఆటలో న్యూజిలాండ్‌దే పైచేయి
బే ఓవల్: నూతన సంవత్సరం(2022) తొలి రోజున ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే(227 బంతుల్లో 122; 16 ఫోర్లు, సిక్స్) అద్భుత శతకంతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో ఆతిధ్య న్యూజిలాండ్‌దే పైచేయిగా నిలిచింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో పర్యాటక బంగ్లా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా బౌలర్ షోరిఫుల్ ఇస్లాం కివీస్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ టామ్ లాథమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి షోరిఫుల్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో న్యూజిలాండ్ ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. Devon Conway! A single to go to a 100 in his first Test in New Zealand. A special way to start 2022. Follow play LIVE with @sparknzsport. #NZvBAN pic.twitter.com/BHVNhjgmLE — BLACKCAPS (@BLACKCAPS) January 1, 2022 వన్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగిన కాన్వే.. మరో ఓపెనర్ విల్ యంగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 138 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోర్ 139 పరుగుల వద్ద ఉండగా విల్ యంగ్(52) రనౌట్ కావడంతో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన రాస్ టేలర్(31), టామ్ బ్లండెల్(11) నామమాత్రపు స్కోర్లు చేసి ఔట్ కాగా, కాన్వే శతక్కొట్టిన అనంతరం వెనుదిరిగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ 2, ఎబాదత్ హుసేన్, మొమినుల్ హాక్ తలో వికెట్ పడగొట్టగా.. విల్ యంగ్ రనౌటయ్యాడు. కాగా, గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో గాయపడి కాన్వే.. 7 వారాల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. అనంతరం గాయం నుంచి కోలుకుని ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. చదవండి: గాయం నుంచి తిరిగొచ్చాడు.. 2022లో తొలి సెంచరీ బాదాడు -
Ind Vs Nz 1st Test : తొలి టెస్టు డ్రా
-
WI Vs Pak: పాకిస్తాన్ 217 ఆలౌట్
కింగ్స్టన్: వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. ఫవాద్ ఆలమ్ (56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... అష్రఫ్ (44; 8 ఫోర్లు), బాబర్ ఆజమ్ (30; 4 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో సీల్స్, హోల్డర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ కడపటి వార్తలు అందే సమయానికి 38 ఓవర్లలో 5 వికెట్లకు 100 పరుగులు చేసింది. చదవండి: Ind Vs Eng: రెండో రోజు బౌలర్లదే... -
తొలి టెస్ట్ సమయంలో ప్రేక్షకుల చెవుల్లో ఆ ఎర్రటి పరికరాలేంటి..?
నాటింగ్హమ్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులు చెవులకు ఎర్రటి పరికరాలను ధరించి కనిపించారు. ముఖ్యంగా ఇంగ్లండ్ మద్దతుదారులు ఈ ఎర్రటి పరికరాలను ధరించి, అటూ ఇటూ తిరుగుతూ సందడి చేశారు. ఇంతకి వారు పెట్టుకున్న మెషిన్లు ఏంటో తెలుసా? అవి ఎందుకు ధరిస్తారు? వాటి వల్ల ఉపయోగం ఏంటంటే.. స్టేడియంలో కూర్చొని మ్యాచ్‌లు చూసే వారికి ఆన్ ఫీల్డ్ ఏం జరుగుతుందో సరిగ్గా అర్దం కాదు. ఫోర్లు, సిక్సులు కొట్టినప్పుడు బంతి కనపడుతుంది కానీ టెస్ట్‌ల్లో బౌండరీలు, సిక్సర్లు అరుదుగా వస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రేక్షకులు తమ చెవులకు చిన్న రేడియోలను పెట్టుకుంటారు. లోకల్ రేడియో స్టేషన్లో క్రికెట్ కామెంట్రీని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వింటుంటారు. టీవీ ప్రసారాలు అందించే స్కై స్పోర్ట్స్ నెట్వర్కే ఈ రేడియో ప్రసారాలనూ అందిస్తుంది. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులకు పిచ్ మధ్యలో ఏం జరుగుతుందో కామెంట్రీ రూపంలో వినే అవకాశం లభిస్తుంది. అయితే ఇందుకు ఫోన్లో రేడియో ఆన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే అందుకోసం రేడియో ప్రసారాలను సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా స్కై స్పోర్ట్స్ అందించే ఈ స్పెషల్ గాడ్జెట్స్ ద్వారా మాత్రమే లైవ్ కామెంట్రీ వినే అవకాశం ఉంటుంది. అందుకే ప్రేక్షకులు అలా చెవులకు రేడియోలు పెట్టుకొని కనపడ్డారు. ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌లో భారత జట్టు విజయానికి చేరువుగా వచ్చినా.. వర్షం కారణంగా చివరి రోజు ఒక్క బంతి పడకుండా ఆట రద్దయ్యింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
Ind vs Eng: ఇక టెస్టు క్రికెట్ సమయం
నాటింగ్‌హామ్: భారత ద్వితీయ శ్రేణి జట్టు ఇటీవల శ్రీలంకతో సిరీస్ ఆడినా స్టార్లు లేని ఆ జట్టు మ్యాచ్‌లు సగటు క్రికెట్ అభిమానులకు పెద్దగా ఆసక్తిని కలిగించలేదు. కొంత విరామం తర్వాత ఇప్పుడు సీనియర్ క్రికెటర్లు కీలక మ్యాచ్ కోసం బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరిగే తొలి టెస్టులో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే మానసికంగా పైచేయి సాధించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. కేఎల్ రాహుల్‌కు చాన్స్... కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన లైనప్‌ను చూస్తే తొలి టెస్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. గాయపడిన శుబ్‌మన్ గిల్ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్లో ఆడిన 36 టెస్టుల్లో 5 సార్లు మినహా అన్ని సందర్భాల్లో రాహుల్ స్పెషలిస్ట్ ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. తాజా ఫామ్‌ను పరిగణనలోకి తీసు కున్నా రాహుల్‌కే తొలి అవకాశం ఉంటుంది. రోహి త్ తనదైన శైలిలో దూకుడుగా ఆడగలడు. అయితే 3, 4, 5 స్థానాల బ్యాట్స్‌మెన్‌లో నిలకడ లోపించడం భారత్‌ను కొంత బలహీనంగా మారుస్తోంది. కోహ్లి కూడా భారీ స్కోరు సాధించడంలో విఫలమవుతుండగా... పుజారా, రహానే చెప్పుకోదగ్గ స్కోరు సాధించి చాలా కాలమైంది. వీరు రాణిస్తేనే భారత బ్యాటింగ్ పటిష్టంగా మారుతుంది. ముగ్గురు పేసర్లు బుమ్రా, ఇషాంత్, షమీలతో పాటు అశ్విన్ ఖాయం కాగా... జడేజాను కాకుండా నాలు గో పేసర్‌గా శార్దుల్‌ను తీసుకుంటారా చూడాలి. స్యామ్ కరన్ కీలకం... ప్రతిష్టాత్మక సిరీస్‌కు బెన్ స్టోక్స్‌లాంటి స్టార్ ఆటగాడు దూరం కావడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ. అయితే యువ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ ఆ స్థానంలో తన వంతు పాత్ర పోషించనున్నాడు. అండర్సన్, బ్రాడ్‌లాంటి సీనియర్లతో పాటు రాబిన్సన్ మూడో పేసర్‌గా ఆడవచ్చు. ఇటీవల భారత పర్యటనకు వెళ్లి ఘోరమైన ప్రదర్శన కనబర్చిన బ్యాట్స్‌మెన్ బర్న్స్, సిబ్లీ, క్రాలీలకు సొంతగడ్డపైనైనా రాణించి ఆకట్టుకునేందుకు ఇది సరైన అవకాశం. ప్రధాన బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా తీవ్ర ఒత్తిడిలో ఉన్న రూట్‌కు కూడా ఈ సిరీస్ కీలకం కానుంది. పిచ్, వాతావరణం ఆరంభంలో సీమ్ బౌలింగ్‌కు అనుకూలిస్తూ ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగే సాధారణ ఇంగ్లండ్ తరహా పిచ్. కొంత పచ్చిక ఉన్నా, టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, జడేజా/శార్దుల్, షమీ, ఇషాంత్, బుమ్రా. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, సిబ్లీ, క్రాలీ, బెయిర్‌స్టో, బట్లర్, స్యామ్ కరన్, రాబిన్సన్, బ్రాడ్, లీచ్, అండర్సన్. -
భారత మహిళల అసమాన పోరాటం
బ్రిస్టల్: ఓటమిని తప్పించుకోవాలంటే రోజంతా ఆడాల్సిన స్థితిలో భారత మహిళా క్రికెటర్లు అద్భుత పోరాటపటిమ కనబరిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నారు. లోయర్ ఆర్డర్లో స్నేహ్ రాణా (154 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు), శిఖా పాండే (50 బంతుల్లో 18; 3 ఫోర్లు), తానియా భాటియా (88 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు) మొండి పట్టుదలతో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్నారు. భారత్‌ను ‘డ్రా’తో గట్టెక్కించారు. కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న స్నేహ్, తానియా అజేయంగా తొమ్మిదో వికెట్‌కు 104 పరుగులు జోడించడం విశేషం. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 83/1తో మ్యాచ్ చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు ఆట ముగిసే సమయానికి 121 ఓవర్లలో 8 వికెట్లకు 344 పరుగులు చేసింది. టీ విరామానికి భారత్ 8 వికెట్లకు 243 పరుగులతో కష్టాల్లో ఉంది. అయితే చివరి సెషన్ అంతా స్నేహ్, తానియా వికెట్ చేజార్చుకోకుండా ఆడటంతో ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. అంతకుముందు షఫాలీ వర్మ (83 బంతుల్లో 63; 11 ఫోర్లు, సిక్స్), దీప్తి శర్మ (168 బంతుల్లో 54; 8 ఫోర్లు), పూనమ్ రౌత్ (104 బంతుల్లో 39; 5 ఫోర్లు) కూడా ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. కెప్టెన్ మిథాలీ రాజ్ (4), హర్మన్‌ప్రీత్ కౌర్ (8) మాత్రం మళ్లీ నిరాశపరిచారు. ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈనెల 27న మొదలవుతుంది. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 396/9 డిక్లేర్డ్; భారత్ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: 344/8 (121 ఓవర్లలో). -
ఇక్కడ 320 మంచి స్కోరు: రహానే
వెల్లింగ్టన్: తొలిటెస్టుకు ఆతిథ్యమిస్తున్న బేసిన్ రిజర్వ్ మైదానం పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 320 పరుగులైన ఉత్తమ స్కోరే అని భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. ‘కివీస్ సొంతగడ్డపై జరిగే ఈ టెస్టు సిరీస్‌లో న్యూజిలాండే ఫేవరెట్. ఎందుకంటే ఇక్కడి ట్రాక్‌పై వారి బౌలర్లకు, బ్యాట్స్‌మెన్‌కు ఉన్న అవగాహన ఇంకెవరికీ ఉండదు. కివీస్ మైదానాలన్నీ భిన్నంగా ఉంటాయి. అయితే ఓ జట్టుగా అవి ఎలా ఉంటాయోనన్న విషయాల్ని మేం వెంటనే పసిగడితేనే మ్యాచ్‌పై పట్టు సాధించగలం’ అని అన్నాడు. లార్డ్స్ (2014), అడిలైడ్ (2018) టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులలోపు చేసి చారిత్రక టెస్టు విజయాల్ని సాధించామని ఇప్పుడు ఇక్కడా అదే ఫార్ములాను నమ్ముకున్నామని రహానే చెప్పాడు. గతంలో ఇంగ్లండ్‌లో 295 పరుగులు, ఆసీస్‌లో 250 పరుగులు చేసినా భారత్ గెలిచింది. ‘ముందుగా బ్యాటింగ్ చేస్తే తాజా మైండ్‌సెట్‌తో సానుకూల దృక్పథంతో పరుగులు సాధించే వీలవుతుంది. పైగా విదేశీ గడ్డపై 320, 330 పరుగుల స్కోర్లే ఉత్తమ స్కోర్ల వుతాయి. మేం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో సాధించిన టెస్టు విజయాలకు ఆ స్కోర్లే పట్టుచిక్కేలా చేశాయి’ అని వైస్ కెప్టెన్ అన్నాడు. వెల్లింగ్టన్లోని బెసిన్ రిజర్వ్ వేదికపై రహానేకు తీపి గుర్తులున్నాయి. 2014లో ఇక్కడ టెస్టు కెరీర్లో తను తొలి సెంచరీ నమోదు చేశాడు. -
‘టెస్టు’ సమయం
ఉపఖండం బయట ఇతర దేశాల్లో పోలిస్తే న్యూజిలాండ్‌లోనే భారత జట్టు తక్కువ సంఖ్యలో టెస్టు క్రికెట్ ఆడింది. 1967 నుంచి 2014 వరకు 9 టెస్టు సిరీస్‌లలో పాల్గొంటే ఆడిన మ్యాచ్‌లు 23 మాత్రమే! గత ఏడాది కివీస్ పర్యటనలో కూడా టెస్టులు ఆడాల్సి ఉండగా... తెల్లవారుజామున భారత అభిమానులు టెస్టులు చూడరంటూ ప్రసారకర్తలు తెచ్చిన ఒత్తిడితో షెడ్యూల్ నుంచి టెస్టులను తొలగించి వన్డేలు, టి20లకే పరిమితం చేశారు. ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగం కావడంతో తప్పనిసరిగా ఆడాల్సిన స్థితిలో భారత జట్టు ఐదు రోజుల ఫార్మాట్‌కు సన్నద్ధమైంది. స్వింగ్‌కు బాగా అనుకూలించే కివీస్ పిచ్‌లపై టీమిండియాకు ఎర్రబంతితో అతి పెద్ద సవాల్ ఎదురవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు రేపటితో తెర లేవనుంది. వెల్లింగ్టన్: టి20, వన్డే సిరీస్‌లను సమంగా పంచుకున్న తర్వాత భారత్, న్యూజిలాండ్ ఇప్పుడు సాంప్రదాయ ఫార్మాట్‌కు సై అంటున్నాయి. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపటి నుంచి (శుక్రవారం) తొలి మ్యాచ్ జరుగుతుంది. సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాల తర్వాత భారత జట్టు మళ్లీ టెస్టు బరిలోకి దిగుతుండగా... ఇటీవలే ఆస్ట్రేలియా చేతిలో క్లీన్‌స్వీప్‌నకు గురైన కివీస్ స్వదేశంలో తమ రాత మార్చుకోవాలని పట్టుదలగా ఉంది. కోహ్లి నాయకత్వంలో న్యూజిలాండ్ గడ్డపై భారత్ టెస్టులు ఆడుతుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. విహారికి చోటు! టీమిండియా తమ ఆఖరి టెస్టును కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై ఆడింది. అక్కడితో పోలిస్తే వాతావరణం, పిచ్ పరిస్థితులు న్యూజిలాండ్‌లో పూర్తిగా భిన్నం కాబట్టి స్వల్ప మార్పులు ఖాయం. రోహిత్ శర్మ గాయంతో దూరం కావడంతో మయాంక్‌కు తోడుగా పృథ్వీ షా ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖాయమైంది. బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ ఇదే సంకేతాన్నిచ్చింది. కాబట్టి శుబ్‌మన్ గిల్ టెస్టు అరంగేట్రం కోసం కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. అయితే ప్రతికూల వాతావరణంలో కివీస్ పేసర్లను సమర్థంగా ఎదుర్కొని ఓపెనర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. జట్టుకు శుభారంభం దక్కకపోతే ఆ తర్వాత అది మ్యాచ్‌పై ప్రభావం చూపించవచ్చు. సొంతగడ్డపై టీమ్ మేనేజ్మెంట్ ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌నే ఆడించేది. కానీ కివీస్లాంటి చోట లోతైన బ్యాటింగ్ అవసరం కాబట్టి ఆరో స్థానంలో కూడా రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌ను ఆడించక తప్పని పరిస్థితి. అందుకోసం ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి సిద్ధంగా ఉన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కఠిన పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి అతను సాధించిన సెంచరీ కూడా విహారికి అనుకూలంగా మారింది. బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లకే మొగ్గు చూపవచ్చు. గత రెండున్నరేళ్లలో ఇదే వ్యూహంతో విదేశాల్లో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేశామంటూ కోహ్లి వ్యాఖ్యానించడం అతని ఆలోచనను స్పష్టం చేసింది. గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. కాబట్టి అతనితో పాటు షమీ, బుమ్రాలు పేస్ భారం మోస్తారు. స్పిన్నర్‌గా మాత్రం ఒకరికే చోటు ఉంది. అశ్విన్ లేదా జడేజాలలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిరం. 2013 నుంచి విదేశాల్లో ఇద్దరి రికార్డు దాదాపు ఒకేలా ఉంది. కీపర్‌గా సందేహం లేకుండా వృద్ధిమాన్ సాహానే ఉంటాడు కాబట్టి రిషభ్ పంత్‌కు నిరాశ తప్పదు. 2014లో ఇక్కడ టెస్టులు ఆడిన అనుభవం ప్రస్తుత జట్టులో కోహ్లి, పుజారా, రహానే, జడేజా, ఇషాంత్, షమీలకు ఉంది. కాబట్టి పరిస్థితులు పూర్తిగా కొత్త కాదు. ఆస్ట్రేలియాలో గెలిచినట్లుగా న్యూజిలాండ్‌లోనూ సిరీస్ విజయం సాధిస్తే నాయకుడిగా కోహ్లి ఘనతల్లో మరొకటి చేరుతుంది. ► న్యూజిలాండ్ గడ్డపై 9 టెస్టు సిరీస్‌లు ఆడిన భారత్ 2 గెలిచి, 5 ఓడింది. మరో 2 డ్రాగా ముగిశాయి. 2014 సిరీస్‌లో న్యూజిలాండ్ 1–0తో గెలిచింది. ► భారత్ గెలిచిన టెస్టుల సంఖ్య. మొత్తం 23 ఆడగా... కివీస్ 8 మ్యాచ్‌లలో విజయం సాధించింది. మిగిలిన 10 ‘డ్రా’గా ముగిశాయి. ► 30 భారత్‌లో 2016లో జరిగిన సిరీస్‌లో చివరిసారి ఈ రెండు జట్లు తలపడగా... భారత్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది వాగ్నర్ అవుట్! తొలి టెస్టుకు ముందే కివీస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేస్ బౌలర్ నీల్ వాగ్నర్ వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. భార్య ప్రసవం కారణంగా వాగ్నర్ వెల్లింగ్టన్కు రావడం లేదని కివీస్ బోర్డు ప్రకటించింది. గత కొన్నేళ్లలో బౌల్ట్, సౌతీలతో పోలిస్తే వాగ్నర్ అత్యంత ప్రమాదకర కివీస్ బౌలర్‌గా మారాడు. కీలకమైన మ్యాచ్‌కు ముందు అతను దూరం కావడం జట్టుపై ప్రభావం చూపడం ఖాయం. ఇది సీనియర్లు బౌల్ట్, సౌతీలకు అదనపు భారం కానుంది. వాగ్నర్ స్థానంలో హెన్రీని తీసుకున్నారు. అయితే పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అయిన హెన్రీ టెస్టు రికార్డు మరీ పేలవంగా ఉంది. సొంతగడ్డపైనే 6 టెస్టులో 12 వికెట్లు తీయగా సగటు 50కు పైగా ఉంది! అయితే మ్యాచ్ ముందు రోజు పిచ్‌ను బట్టి చూస్తే కివీస్ నలుగురు పేసర్లతో దిగాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. కైలీ జేమీసన్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయవచ్చు. ఏకైక స్పిన్నర్ ఎజాజ్ పటేల్‌కు తుది జట్టులో స్థానం కష్టమే. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఇటీవల న్యూజిలాండ్ బ్యాటింగ్ విఫలమైంది. ఇప్పుడు దానిని చక్కబెట్టుకునేందుకు ఆ జట్టుకు అవకాశం వచ్చింది. లాథమ్, బ్లన్‌డెల్ ఓపెనర్లుగా శుభారంభం ఇవ్వగల సమర్థులు. మూడు, నాలుగు స్థానాల్లో విలియమ్సన్, రాస్ టేలర్‌ల అనుభవమే జట్టుకు కీలకం. వీరిద్దరు తమ స్థాయికి తగినట్లుగా ఆడితే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. వికెట్ కీపర్ వాట్లింగ్ బ్యాట్స్‌మన్‌గా కూడా తన సత్తా ఏమిటో ఇటీవలే ఇంగ్లండ్‌పై అద్భుత డబుల్ సెంచరీతో చూపించాడు. చివరి వన్డేలో భారత్ ఓటమికి కారణమైన గ్రాండ్‌హోమ్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటగలడు. మొత్తంగా కివీస్ బ్యాటింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. భారత పేస్ త్రయాన్ని వీరు సమర్థంగా ఎదుర్కోగలిగితే ఆపై జట్టును ఆపడం కోహ్లి బృందానికి కష్టం కావచ్చు. తుది జట్ల వివరాలు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే, విహారి, అశ్విన్/రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), లాథమ్, బ్లన్‌డెల్, రాస్ టేలర్, నికోల్స్, వాట్లింగ్, గ్రాండ్‌హోమ్, సౌతీ, జేమీసన్, బౌల్ట్, హెన్రీ. పిచ్, వాతావరణం బేసిన్ రిజర్వ్ మైదానం పిచ్‌పై బుధవారం 15–18 మిల్లీ మీటర్ల మందం పచ్చిక కనిపించింది. మ్యాచ్ రోజు కూడా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. కాబట్టి పేసర్లకు బాగా అనుకూలం. పైగా ఇది ఓపెన్ గ్రౌండ్ కావడం వల్ల 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు స్వింగ్‌ను శాసిస్తాయి. బ్యాట్స్‌మెన్ ఆరంభ పరీక్షను అధిగమించాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకోవచ్చు. వర్షం సమస్య లేదు. మరో మూడేళ్లు ఇంతే జోరుగా... గత ఎనిమిదేళ్లుగా నేను మ్యాచ్‌లతో పాటు ప్రయాణాలు, ప్రాక్టీస్‌లు కలుపుకుంటే సంవత్సరంలో దాదాపు 300 రోజులు క్రికెట్ ఆడుతున్నాను. అయినా ఎక్కడా దూకుడు, తీవ్రత తగ్గదు. ఇక కెప్టెన్‌గా అదనపు ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం ఖాయం. ఇదే జోరులో నేను అన్ని ఫార్మాట్లలో కనీసం వచ్చే మూడేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడగలను. మరిన్ని కఠిన సవాళ్లకు సిద్ధంగా ఉన్నా. శరీరం అలసిపోవడం సహజమే కానీ అప్పుడప్పుడు తీసుకునే విరామాల వల్ల నేను మళ్లీ కోలుకోగలుగుతున్నా. గతంలో చెప్పినట్లు నా దృష్టిలో టెస్టు ఫార్మాటే అన్నింటికంటే అత్యుత్తమం. ఐసీసీ టోర్నీలపరంగా చూస్తే ఇప్పుడు జరుగుతున్న టెస్టు చాంపియన్‌షిప్‌కే నేను అగ్రస్థానం ఇస్తా. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ వెల్లింగ్టన్లో ఇండియన్ హై కమిషన్ ఇచ్చిన విందులో... -
బంగ్లాదేశ్ 233 ఆలౌట్
రావల్పిండి: పాకిస్తాన్‌తో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో బంగ్లాదేశ్ పేలవ ప్రదర్శన కనబర్చింది. పాక్ బౌలింగ్ ధాటికి బంగ్లా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 82.5 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలింది. మొహమ్మద్ మిథున్ (140 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించగా... నజ్ముల్ హుస్సేన్ (44), లిటన్ దాస్ (33), కెప్టెన్ మోమినుల్ హక్ (30) కొద్దిగా ప్రతిఘటించగలిగారు. పేసర్ షాహిన్ అఫ్రిది (4/53) మెరుపు బౌలింగ్‌తో చెలరేగాడు. హారిస్ సొహైల్, అబ్బాస్ చెరో 2 వికెట్లు తీశారు. వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేయడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు. -
భారత్, విండీస్ తొలి టెస్టు మ్యాచ్ ఫోటోలు
-
కాచుకో... విండీస్
కరీబియన్ పర్యటనలో భారత జట్టు చివరిదైన టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. జట్లకు ఏమోగానీ... ఇది టీమిండియా కెప్టెన్ కోహ్లి అరుదైన రికార్డులకు వేదికగా మారే వీలుంది. వన్డే ప్రపంచ కప్ వైఫల్యం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మన జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. భారత యువ ఓపెనర్లకు పరీక్షగా, స్పెషలిస్ట్ ఆటగాళ్లకు ప్రత్యేకంగా మారనున్న ఈ సిరీస్‌లో తమదైన ముద్ర వేసేది ఎవరో? నార్త్‌సౌండ్ (అంటిగ్వా): ఆసక్తి రేపుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో టీమిండియా ప్రయాణానికి నేటితో తెరలేవనునంది. కరీబియన్ దీవుల పర్యటనలో భాగంగా వెస్టిండీస్, భారత్ తొలి టెస్టు గురువారం ప్రారంభం కానుంది. 8 నెలల విరామం అనంతరం సంప్రదాయ ఫార్మాట్ బరిలో దిగుతున్న కోహ్లి సేనకు తుది జట్టు కూర్పు ఎలా అనే ఆలోచన తప్ప... గాయాలు, ఫామ్ లేమి వంటి ఇబ్బందులు లేవు. టి20, వన్డే సిరీస్‌లు కోల్పోయిన ప్రత్యర్థి వెస్టిండీస్ టెస్టుల్లోనైనా ప్రతాపం చూపాలని భావిస్తోంది. ఈ సిరీస్ కూడా ఓడితే ఆ జట్టు సొంతగడ్డపై తొలిసారిగా భారత్‌కు మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు కోల్పోయిన దారుణ రికార్డు మూటగట్టుకుంటుంది. బలాబలాలరీత్యా టీమిండియానే ఫేవరెట్ అయినప్పటికీ, విండీస్‌ను తక్కువ అంచనా వేయలేం. కోహ్లి ఓటు 5+1+5కేనా? టెస్టుల్లో విజయానికి కెప్టెన్ కోహ్లి నమ్మే సూత్రం ఐదుగురు బ్యాట్స్‌మెన్, కీపర్, ఐదుగురు బౌలర్లు. మరీ ముఖ్యంగా విదేశాల్లో అతడు దీనిని ఎక్కువగా ఆచరిస్తాడు. ఈ లెక్కన చూస్తే మాత్రం ఆరో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌కు అవకాశం లేనట్లే. ప్రాధాన్య ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌కు చోటు ఖాయం. రెండో ఓపెనర్‌గా రాహుల్‌కు తెలుగు ఆటగాడు హనుమ విహారి పోటీ ఇస్తున్నాడు. వన్‌డౌన్‌లో పుజారా, నాలుగో స్థానంలో కోహ్లితో దుర్బేధ్యంగా ఉంది. ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా త్రయం పేస్ బాధ్యతలు మోస్తారు. మరో పేసర్ ఉమేశ్ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. ఇద్దరు స్పిన్నర్ల వ్యూహానికి కట్టుబడితే అశ్విన్–జడేజా ద్వయం బరిలో దిగుతుంది. హార్దిక్ పాండ్యా దూరమైనందున లోయరార్డర్లో వీరిద్దరూ బ్యాట్‌తోనూ రాణించాల్సి ఉంటుంది. రహానే–రోహిత్ మధ్య కుర్చీలాట... టీమిండియాకు కొన్నాళ్లుగా వన్డేల్లో నాలుగో స్థానం ఎంత సమస్యగా మారిందో టెస్టుల్లో ఐదో స్థానం అంతే ఇబ్బంది కలిగిస్తోంది. వైస్ కెప్టెన్ హోదాలో ఓ బాధ్యత ఉన్న అజింక్య రహానే విఫలమవుతుండటమే దీనికి కారణం. రహానే సెంచరీ చేసి రెండేళ్లు దాటింది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రంజీలు, ఇంగ్లండ్ కౌంటీల్లో తనను తాను పరీక్షించుకున్నా రహానే సాధించిందేమీ లేదు. ఇప్పుడు రోహిత్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్నాడు. వన్డే ప్రపంచ కప్ తర్వాత రోహిత్ స్థాయి పెరిగింది. టెస్టుల్లో వరుసగా అవకాశాలు ఇవ్వాలనే స్థితికి అది చేరింది. మరి... ఐదో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ రహానేలలో కెప్టెన్ మొగ్గు ఎవరివైపు ఉంటుందో చూడాలి. విండీస్ ఎలా ఆడుతుందో? ఈ ఏడాది మొదట్లో తమ దేశంలో పర్యటించిన ఇంగ్లండ్‌ను తొలి టెస్టులో 381 పరుగులతో; రెండోదాంట్లో 10 వికెట్లతో విండీస్ ఓడించింది. స్వదేశంలో కరీబియన్లు ప్రమాదకారులు అని చెప్పడానికి ఇదే సంకేతం. ఈ సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు పేసర్ రోచ్ నుంచి సవాలు తప్పదు. స్పిన్ ఆల్‌రౌండర్ చేజ్ సైతం గట్టి పిండమే. కెప్టెన్ హోల్డర్ ఆల్‌రౌండ్ పాటవం విండీస్‌కు సానుకూలాంశం. ఓపెనర్ బ్రాత్‌వైట్, హోప్, హెట్‌మైర్‌లతో బ్యాటింగ్‌లో జట్టు బలంగా ఉంది. మహాకాయుడు కార్న్‌వాల్ అరంగేట్రం చేయనున్నాడు. గెలిస్తే 120 పాయింట్లు... రెండు మ్యాచ్‌ల సిరీసే కాబట్టి... డబ్ల్యూటీసీలో భాగంగా ఒక్కో టెస్టు విజయానికి 60 పాయింట్లు దక్కుతాయి. రెండూ గెలిస్తే 120 పాయింట్లతో పట్టికలో ప్రస్తుతానికి భారత్ టాప్‌లోకి చేరుతుంది. న్యూజిలాండ్‌పై తొలి టెస్టు నెగ్గిన శ్రీలంక 60; యాషెస్‌లో మొదటి టెస్టు గెలిచి, రెండో టెస్టును డ్రాగా ముగించిన ఆస్ట్రేలియా 32 పాయింట్లతో ఉన్నాయి. తుది జట్లు (అంచనా) భారత్: రాహుల్/విహారి, మయాంక్, పుజారా, కోహ్లి (కెప్టెన్), రహానే/రోహిత్, పంత్/సాహా, జడేజా, అశ్విన్,షమీ, బుమ్రా, ఇషాంత్. వెస్టిండీస్:బ్రాత్‌వైట్, కాంప్‌బెల్, హోప్, డారెన్ బ్రేవో, హెట్‌మైర్, చేజ్, డౌరిచ్, హోల్డర్ (కెప్టెన్), కార్న్‌వాల్/కీమో పాల్, రోచ్, గాబ్రియెల్. పిచ్, వాతావరణం ఇక్కడి సర్ వివియన్ రిచర్డ్స్ మైదానంలో రెండేళ్లుగా విండీస్ పేసర్లు, ప్రత్యేకంగా రోచ్ చెలరేగుతున్నాడు. 2018లో ఐదు వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను 43 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలకంగా నిలిచాడు. ఈ జనవరిలో ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. పిచ్ స్వభావ రీత్యా పేసర్లకు ఈసారీ పండుగే. ఇంగ్లండ్‌తో టెస్టు అనంతరం ఈ పిచ్‌కు ఒక డీ మెరిట్ పాయింట్‌తో పాటు, బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. అంటిగ్వాలో వాతావరణం మబ్బులు పట్టి ఉంది. మూడో రోజు నుంచి జల్లులు పడతాయి. 1: కోహ్లి మరొక్క సెంచరీ చేస్తే అత్యధిక శతకాలు బాదిన కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (19) సరసన చేరతాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 109 టెస్టుల్లో 25 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. 26: కోహ్లి నేతృత్వంలో ఆడిన 46 టెస్టుల్లో భారత్ గెలిచిన టెస్టుల సంఖ్య. మరోటి నెగ్గితే మాజీ కెప్టెన్ ధోని (60 మ్యాచ్‌ల్లో 27) అత్యధిక విజయాల రికార్డును అతడు సమం చేస్తాడు. కోహ్లి సేన జలకాలాట ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం రెండు రోజుల విరామం లభించడంతో కోహ్లి సేన పూర్తిగా సేదదీరింది. కెప్టెన్ సహా ఆటగాళ్లు అంటిగ్వా బీచ్‌లో సందడి చేశారు. ‘కుర్రాళ్లతో ఓ అద్భుతమైన రోజు’ అంటూ మయాంక్, బుమ్రా, ఇషాంత్, పంత్, రహానే, రోహిత్, రాహుల్‌లతో ఉన్న ఫొటోను కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. -
ఇంగ్లండ్ లయన్స్ 303/5
వాయనాడ్: భారత్ ‘ఎ’తో గురువారం ప్రారం భమైన తొలి అనధికారిక టెస్టులో ఇంగ్లండ్ లయన్స్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. బెన్ డకెట్ (80), స్యామ్ హెయిన్ (61) అర్ధ సెంచరీలు సాధించగా... విలియం జాక్స్ (40 బ్యాటింగ్), స్టీవెన్ ములానీ (39 బ్యాటింగ్) రాణించారు. భారత ‘ఎ’ బౌలర్లలో నితిన్ సైని 2 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు ఇరు జట్ల మధ్య ఈ నెల 13నుంచి మైసూరులో జరిగే రెండో అనధికారిక టెస్టులో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టుకు లోకేశ్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో కూడా రాహుల్ జట్టులో ఉన్నా... అంకిత్ బావ్నే నాయకత్వంలో జట్టు బరిలోకి దిగింది. -
అద్వితీయం...
...టీమిండియా గెలిచింది! ముందు రోజే ఊరించిన విజయం ఓ దశలో అందీ అందనట్టుగా మారినా, ఆరు వికెట్లు తీయడానికి ఆపసోపాలు పడినా, ఒక్కో భాగస్వామ్యం బలపడుతూ గుబులు రేపినా, తమకే సొంతమైన పోరాటంతో ఆస్ట్రేలియా చుక్కలు చూపినా... చిక్కుముడులన్నీ విప్పుకొంటూ కోహ్లి సేన అద్వితీయ విజయం సాధించింది. అడిలైడ్ టెస్టుతో పాటు కంగారూ గడ్డపై తొలిసారిగా ‘సిరీస్ ఆరంభ మ్యాచ్’ను నెగ్గిన ఘనతనూ తమ ఖాతాలో వేసుకుంది. ఆసీస్ గడ్డపై మెల్బోర్న్ తర్వాత మరో మైదానంలో రెండో టెస్టు విజయాన్ని సొంతం చేసుకుంది. అడిలైడ్: తక్కువ రన్‌రేట్, మోస్తరు స్కోర్లతో, పెద్దగా మెరుపుల్లేకుండా, ఐదు రోజులూ సాదాసీదాగానే సాగిన అడిలైడ్ టెస్టు కాస్తంత ఉత్కంఠభరితంగానే ముగిసింది. భారత బౌలింగ్‌కు ఎదురొడ్డిన ఆస్ట్రేలియా లోయరార్డర్ మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నంత పనిచేసింది. కానీ, పట్టువిడవని ప్రయత్నంతో టీమిండియా నెగ్గుకొచ్చింది. 323 పరుగుల లక్ష్యానికి గాను చేతిలో ఉన్న 6 వికెట్లతో చివరి రోజు 219 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆతిథ్య జట్టు 291 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి టెస్టును కోహ్లి సేన 31 పరుగులతో కైవసం చేసుకుంది. అయితే, దీని వెనుక కొంత డ్రామా నడిచింది. ఓవర్‌నైట్ స్కోరు 104/4తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కంగారూలు చివరి ఆరు వికెట్లకు ఏకంగా 176 పరుగులు జోడించి ఆందోళన కలిగించారు. షాన్ మార్‡్ష (166 బంతుల్లో 60; 5 ఫోర్లు) అర్ధ శతకానికి తోడు కెప్టెన్ టిమ్ పైన్ (73 బంతుల్లో 41; 4 ఫోర్లు), కమిన్స్ (121 బంతుల్లో 28; 3 ఫోర్లు), స్టార్క్ (44 బంతుల్లో 28; 2 ఫోర్లు), నాథన్ లయన్ (47 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు) పోరాటంతో ఆటను ఆసక్తి కరంగా మార్చారు. షమీ (3/65), బుమ్రా (3/68), అశ్విన్ (3/92) కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి కథ ముగించారు. టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీతో విశేషంగా రాణించిన పుజారాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. రెండో టెస్టు ఈ నెల 14 నుంచి పెర్త్‌లో ప్రారంభమవుతుంది. ఎక్కడ నుంచి ఎక్కడకు... 41, 31, 41, 31, 32 చివరి ఐదు వికెట్లకు ఆసీస్ భాగస్వామ్యాలివి. దీనినిబట్టే సోమవారం మ్యాచ్ ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. ఆదివారమే నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్ ఔటైనా లోయరార్డర్ మొండితనంతో ఆ జట్టు తీవ్ర పోటీ ఇవ్వగలిగింది. క్రితం రోజు స్కోరుకు మూడు పరుగులే జత చేసిన ట్రావిడ్ హెడ్ (14)ను ఇషాంత్ ఆరంభంలోనే వెనక్కు పంపాడు. పైన్ అండగా మార్‡్ష ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అశ్విన్ బౌలింగ్‌లో బౌండరీతో 146 బంతుల్లో అర్ధ శతకం అందుకున్నాడు. సాధికారికంగా ఆడుతూ క్రమంగా బలపడుతున్న ఈ జోడీ సవాల్‌గా మారేలా కనిపించింది. అయితే, లంచ్‌కు ముందు మార్‡్షను, విరామం తర్వాత రెండో ఓవర్లోనే పైన్‌ను ఔట్ చేసి బుమ్రా ముప్పు తప్పించాడు. అప్పటికి పరిస్థితి 187/7. దాదాపు రెండు సెషన్ల ఆట మిగిలే ఉంది. దీంతో కంగారూల పనైపోయినట్లేనని అంతా భావించారు. కానీ, కమిన్స్, స్టార్క్ 16 ఓవర్ల పాటు పోరాడారు. కమిన్స్ క్రీజులో పాతుకుపోగా, స్టార్క్ పరుగులు చేశాడు. ఈ దశలో స్టార్క్‌ను ఔట్ చేసి షమీ బ్రేక్ ఇచ్చాడు. ఏకంగా 121 బంతులు ఆడిన కమిన్స్... బుమ్రా బౌలింగ్‌లో స్లిప్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చాడు. అడపాదడపా పరుగులు చేస్తూ వచ్చిన లయన్ ఉత్కంఠను ఇం కాస్త పెంచాడు. మధ్యలో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికినా నోబాల్ కావడంతో లయన్ ఊపిరి పీల్చుకున్నాడు. హాజల్‌వుడ్ (13) సహకారంతో అతడు లక్ష్యాన్ని క్రమంగా 30ల్లోకి తెచ్చాడు. టీమిండియా ఆటగాళ్లు కొంత ఒత్తిడికి గురయ్యారు. ఈ స్థితిలో అశ్విన్ బౌలింగ్‌లో హాజల్‌వుడ్ స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో కోహ్లి సేన సంబరాల్లో మునిగిపోయింది. ఒకే టెస్టులో అత్యధికంగా 11 క్యాచ్‌లు పట్టిన తొలి భారతీయ వికెట్ కీపర్‌గా, ఓవరాల్‌గా మూడో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. గతంలో రసెల్ (ఇంగ్లండ్; 1995లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బర్గ్‌లో)... డివిలియర్స్ (దక్షిణాఫ్రికా; 2013లో పాక్‌పై జొహన్నెస్‌బర్గ్)లో ఈ ఘనత సాధించారు. భారత్ తరఫున వృద్ధిమాన్ సాహా (10 క్యాచ్‌లు; కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై 2018లో) రికార్డును పంత్ తిరగరాశాడు. ఒక్క విజయం సరిపోదు! కమిన్స్‌ను ఔట్ చేశాక మ్యాచ్ మా వైపు తిరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో, ఒత్తిడి సమయంలోనూ ప్రశాంతంగా మంచు గడ్డలా ఉన్నానని నేను చెప్పను. కానీ దానిని బయటకు కనపడనీయకుండా చూడాలి. విజయానికి ఒక మంచి బంతి సరిపోతుందని తెలుసు. గతంలో ప్రత్యర్థిపై ఒత్తిడిని కొనసాగించలేకపోయేవాళ్లం. గెలిచే అర్హత మా జట్టుకే ఉంది. ఆస్ట్రేలియాను ఓడించాలంటే ఎంతో పట్టుదల కూడా ప్రదర్శించాలి. వారు అంత సులభంగా లొంగరని, లోయర్ ఆర్డర్ గట్టి పోటీనిస్తుందని తెలుసు. నాలుగేళ్ల క్రితం 48 పరుగులతో ఓటమి వైపు నిలిస్తే ఇప్పుడు 31 పరుగులతో విజయం మా వైపు నిలబడింది. ఐదు రోజుల పాటు శారీరకంగా, మానసికంగా కూడా చాలా శ్రమించాం. అదే ఫలితం రూపంలోకనిపించింది కాబట్టి ఈ గెలుపు ప్రత్యేకమైంది. నలుగురు బౌలర్లతోనే ఆడి కూకాబుర్రా బంతితో 20 వికెట్లు తీయడం చాలా గర్వంగా ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ మా పేసర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ కట్టడి చేయాలనే కోరుకున్నాం. ఎందుకంటే అతిగా ఆలోచించి అటాకింగ్ కోసం ప్రయత్నిస్తే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించేస్తారు. తొలి ఇన్నింగ్స్‌లో తొందరపడ్డా రెండో ఇన్నింగ్స్‌లో తగిన సమయం తీసుకొని మేం బ్యాటింగ్ చేశాం. పరిస్థితిని బట్టి చూస్తే రాహుల్ చేసిన 44 పరుగులు కూడా విలువైనవే. తొలి రోజు కొంత వెనుకబడిన సమయంలో పుజారా ఆదుకున్నాడు. ఆ తర్వాత మేం మరో అవకాశం ఇవ్వలేదు. రెండు జట్ల మధ్య పుజారానే ప్రధాన తేడా అనడంలో సందేహం లేదు. రహానే కూడా బాగా ఆడాడు. మా మిడిలార్డర్, లోయరార్డర్ ఇంకా మెరుగ్గా ఆడితే బాగుండేది. పెర్త్ టెస్టులో ఈ విషయంపై దృష్టి పెడతాం. అయితే తొలి మ్యాచ్‌లో నెగ్గి 1–0తో ముందంజ వేయడం చాలా సంతోషకర విషయం. గతంలోనైతే మేం బాగా ఆడాం కానీ ఓడిపోయాం అని తరచుగా వినేవాళ్లం. ఇప్పుడు కనీసం ఆ మాట గురించి కూడా ఆలోచించడం లేదు. బాగా ఆడి కూడా ఓడిపోవడం అంటే అర్థమే లేదు. ప్రతీ మ్యాచ్ గెలవడమే మా లక్ష్యం. ఈ టెస్టులో గెలిస్తే మేం గెలవాలి లేదా డ్రా కావాలే తప్ప ఓటమి అన్న ఆలోచనే రాలేదు. సిరీస్‌లో ఇదే ఆలోచనా ధోరణి కొనసాగాలని కోరుకుంటున్నా. ఈ గెలుపు చాలా ఆనందాన్నిచ్చింది. అయితే ఒక్క విజయంతోనే సంతృప్తి పడం. ఈ జోరును కొనసాగించడం అవసరం. తొలిసారి ఆసీస్ గడ్డపై ఆధిక్యం అందుకోవడం జట్టులో అమిత విశ్వాసం నింపింది. – విరాట్ కోహ్లి ►టాస్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు ఇప్పటివరకు ఒక్క టెస్టులోనూ ఓడిపోలేదు. కోహ్లి కెప్టెన్సీలో భారత్ మొత్తం 43 టెస్టులు ఆడగా... ఇందులో 20 టెస్టుల్లో కోహ్లి టాస్ గెలిచాడు. 17 టెస్టుల్లో భారత్‌కు విజయం దక్కగా... మరో మూడు ‘డ్రా’గా ముగిశాయి. ►ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై విజయం అందుకున్న తొలి ఆసియా, భారత కెప్టెన్ కోహ్లి. ఒకే ఏడాది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు విజయాలు సాధించిన తొలి ఆసియా జట్టుగా కూడా భారత్ గుర్తింపు పొందింది. ►సొంతగడ్డపై సీజన్ తొలి టెస్టులోనే ఓడిపోవడం ఆస్ట్రేలియాకిది మూడోసారి. 1988లో వెస్టిండీస్ (బ్రిస్బేన్‌లో) చేతిలో... 2016లో దక్షిణాఫ్రికా (పెర్త్) చేతిలో... 2018లో భారత్ (అడిలైడ్) చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ►ఆసియా వెలుపల ఒకే ఏడాది భారత్ మూడు టెస్టుల్లో గెలుపొందడం ఇది రెండోసారి. 1968లో న్యూజిలాండ్‌లో భారత్ మూడు టెస్టుల్లో విజయం సాధించింది. ►ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఆరు టెస్టుల్లో గెలిచింది. పెర్త్ (2008), సిడ్నీ (1978) మైదానాల్లో ఒక్కో విజయం దక్కగా.. మెల్బోర్న్ (1977–78; 1981), అడిలైడ్ (2003, 2018)లలో రెండేసి విజయాలు లభించాయి. ►పాకిస్తాన్ తర్వాత (1979లో మెల్బోర్న్ టెస్టు) ఆస్ట్రేలియాతో వారి గడ్డపై జరిగిన సిరీస్‌లో తొలి టెస్టులోనే గెలిచిన రెండో ఆసియా జట్టు భారత్. ►సిరీస్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది. ప్రతీ దశలో భారత్ ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ పుజారా, రెండో ఇన్నింగ్స్‌లో రహానే కీలక ఇన్నింగ్స్‌లు ఆడితే నలుగురు బౌలర్లు తమ వంతు పాత్ర పోషించారు. 2003 మ్యాచ్ జ్ఞాపకాలను ఈ టెస్టు తట్టిలేపింది. – సచిన్ టెండూల్కర్ ►ఆసీస్ లోయర్ ఆర్డర్ పట్టుదల ప్రదర్శించింది. అయితే ఈ క్షణం భారత్‌కు చిరస్మరణీయం. బౌలర్లు సత్తా చాటారు. ఈ విజ యాన్ని ఆస్వాదిస్తూ పెర్త్ టెస్టులోనూ జోరు కొనసాగించాలి. –వీవీఎస్ లక్ష్మణ్ ►టెస్టు క్రికెట్, అందులోని డ్రామా అంటే నాకు చాలా ఇష్టం. ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పోరాడటం నచ్చింది. టెస్టు క్రికెట్లో అదే అందం. అద్భుతమైన మ్యాచ్. విరాట్ కోహ్లి, అతని సహచరులకు అభినందనలు. – షేన్ వార్న్ ►భారత జట్టుకు అభినందనలు. విరాట్ బృందం అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సమష్టి ప్రదర్శనను మున్ముందు కొనసాగించాలి. 2003–04 అడిలైడ్, 2007–08 పెర్త్ టెస్టులలాగే ఈ విజయం కూడా ప్రత్యేకం. 11 క్యాచ్‌లు అందుకున్న పంత్‌కు ప్రత్యేక అభినందనలు. – వినోద్ రాయ్, సీఓఏ చీఫ్ -
హ్యాట్సాఫ్ పుజారా...
టెస్టు క్రికెట్ ఎలా ఆడాలో, ఎంతటి ఓపికతో ఇన్నింగ్స్‌ను నిర్మించాలో చతేశ్వర్ పుజారా మళ్లీ చేసి చూపించాడు. 40 డిగ్రీల వేడి వాతావరణంలో ప్రత్యర్థి బౌలర్లు అలసిపోయే వరకు, బంతి మెత్త బడిపోయే వరకు పట్టుదలగా నిలవడం... ఆ తర్వాత పరుగులు రాబట్టి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడం ఎలాగో ‘చింటూ’కు తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో. కోహ్లి కెప్టెనయ్యాక దూకుడు అనే మాటకు అర్థమే మారిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా పట్టించుకోకుండా ధాటిగా ఆడటమే విజ యానికి బాటలు వేస్తుందనే నమ్మకం జట్టులో పాతుకుపోయింది. ఇలాంటి స్థితిలో పుజారాను కూడా పదే పదే పక్కన పెట్టేందుకు భారత టీమ్ మేనేజ్మెంట్ ఏమాత్రం సంకోచించలేదు. రెండేళ్ల క్రితమైతే వెస్టిండీస్‌లో కేవలం ‘స్ట్రయిక్‌రేట్’ పేరు తో పుజారాను కాదని రోహిత్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటన తొలి టెస్టులోనూ అతడిని ఆడించలేదు. కానీ టెస్టు జట్టులో పుజారా తన విలువను మరోసారి ప్రదర్శించాడు. సరిగ్గా మూడు నెలల క్రితం ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్‌లో జరిగిన నాలుగో టెస్టు తరహాలోనే పుజారా మళ్లీ ఒక్కడే నిలిచి జట్టును ఆదుకున్నాడు. నాటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 273 పరుగులు చేయగా పుజారా132 నాటౌట్. తర్వాతి అత్యధిక స్కోరు 46 పరుగులు మాత్రమే. చివరి రెండు వికెట్లకు 78 పరుగులు జోడిస్తే పుజారా అందులో 54 పరుగులు చేశాడు. ఇప్పుడు అడిలైడ్ టెస్టులో ఎనిమిది, తొమ్మిది వికెట్లకు కలిపి 61 పరుగులు జత చేస్తే వాటిలో పుజారా 51 పరుగులు చేశాడంటే టెయిలెండర్లతో కలిసి కూడా ఇన్నింగ్స్‌ను నడిపించగల సామర్థ్యం పుజారాకు ఉందని అర్థమవుతుంది. రెండో ఓవర్ చివరి బంతికి రాహుల్ వెనుదిరిగిన తర్వాత పుజారా క్రీజ్‌లోకి వచ్చాడు. లంచ్ వరకు అతి జాగ్రత్తగా అతని ఇన్నింగ్స్ సాగింది. మరో ఎండ్‌లో రోహిత్ ధాటిని ప్రదర్శిస్తున్నా తనకే సొంతమైన శైలిలోనే అతను ఆడాడు. నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకోవాల్సిన తరుణంలో అభేద్యమైన డిఫెన్స్‌నే నమ్ముకోవడంతో తొలి సెషన్ ముగిసేసరికి 62 బంతుల్లో 11 పరుగులే చేయగలిగాడు. లంచ్ తర్వాత కూడా ఇదే ఆట సాగడంతో ఒక దశలో వరుసగా 29 బంతుల పాటు పుజారా సింగిల్ కూడా తీయలేదు! ఆరో వికెట్‌గా పంత్ వెనుదిరిగే సమయానికి భారత్ స్కోరు 127 కాగా పుజారా 119 బంతుల్లో చేసింది 35 పరుగులే. ఈ దశలో తమ చేతుల్లోకి ఆట వచ్చేసిందని ఆస్ట్రేలియా భావించింది. కానీ పుజారా ఆలోచనలు వేరేలా ఉన్నాయి. అదే పట్టుదలతో రెండో సెషన్ కూడా ముగించిన అతను కొద్దిసేపటి తర్వాత 153వ బంతికి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు అశ్విన్ ఔటయ్యే సమయానికి పుజారా స్కోరు 72 పరుగులు కాగా... టెయిలెండర్లతో కలిసి సెంచరీ అసాధ్యమని అనిపించింది. కానీ ఇషాంత్, షమీ అతనికి అండగా నిలిచారు. 89 పరుగుల వద్దనుంచి పుజారాలో కొత్త ఆట కనిపించింది. హాజల్‌వుడ్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో హుక్ షాట్‌తో సిక్సర్, పుల్ షాట్‌తో ఫోర్ రాబట్టి అతను 99కి చేరుకున్నాడు. సెంచరీకి చేరువైన దశలో అతనినుంచి ఇలాంటి ఆట అనూహ్యంగా అనిపించింది. తర్వాతి ఓవర్లో రెండు పరుగులు తీయడంతో అతని అద్భుత సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కూడా స్టార్క్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాదడం విశేషం. తర్వాతి ఓవర్ కోసం స్ట్రయికింగ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ కావడంతో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌కు ముగింపు లభించింది. ఇన్నింగ్స్ ఆసాంతం పుజారా ఆట చూస్తే అతడిని ఔట్ చేయడానికి రనౌట్ తప్ప మరో మార్గం లేదనిపించింది. టెస్టు జట్టులో అందరూ దూకుడుగా ఆడేవారు ఉండాల్సిన అవసరం లేదని పుజారా అమూల్య ఇన్నింగ్స్‌ను చూస్తే ఎవరైనా చెప్పగలరు. సిరీస్ తొలి రోజే భారత్ పరువు పోకుండా అతని ఆట కాపాడింది. మ్యాచ్ గమనం ఎలా సాగినా ఆసీస్ గడ్డపై చతేశ్వర్ తొలి సెంచరీ మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. అదృష్టం కలిసొచ్చి... 89 పరుగుల వద్ద హాజల్‌వుడ్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడబోయి పుజారా పైన్‌కు క్యాచ్ ఇచ్చాడు. చిన్న శబ్దం రావడంతో బౌలర్, కీపర్ అన్యమనస్కంగా అప్పీల్ చేశారు గానీ ఇతర సహచరులెవరూ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆసీస్ రివ్యూ చేయలేదు. తర్వాతి రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకిందని తేలింది. ఫలితంగా బతికిపోయిన పుజారా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. -
ఒక్కడే... ఒక వైపు
‘ఒక్కడు’ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడం... అనవసర షాట్లతో ప్రధాన వికెట్లు టపటపా కూలడం... అందివచ్చిన అనుకూలతలను కాలదన్నుకోవడం... కాస్తోకూస్తో పోరాటంతో రోజును ముగించి పరువు దక్కించుకోవడం...! దశాబ్దాలుగా విదేశాల్లో టీమిండియా తీరే ఇది. అదే పాత కథను ఆస్ట్రేలియాలో మరోసారి అచ్చుగుద్దినట్లు దించేసింది. కాకపోతే... ఈసారి కథానాయకుడు మారాడు. ఇటీవలి కాలంలో ఆ ‘ఒక్కడు’గా నిలుస్తున్న విరాట్ కోహ్లి స్థానంలోకి అద్వితీయ శతకంతో చతేశ్వర్ పుజారా వచ్చాడు. కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి... ఆట ఆసాంతం తానే అయి అహో అనిపించాడు. 41/4తో ఉన్న జట్టును కష్టాల గట్టు దాటించాడు. తొలి టెస్టు మొదటి రోజే ప్రత్యర్థి పట్టు బిగించకుండా చూశాడు. మనది పైచేయి కాకున్నా... స్వల్ప స్కోరుకే పరిమితం అవకుండా కాపాడాడు. అడిలైడ్: అనుకున్నంత సులువేం కాదని టీమిండియాకు అర్థమయ్యేలా ప్రారంభమైంది ఆస్ట్రేలియా పర్యటన. పరుగులు సులువుగా వచ్చే పిచ్‌పై కాసేపు ఓపిక పట్టలేక పోయిన బ్యాట్స్‌మెన్... ప్రత్యర్థి బౌలర్లకు వికెట్లు బహుమతిగా ఇచ్చేశారు. కానీ, చెక్కుచెదరని ఏకాగ్రత, సహనంతో ఆడిన చతేశ్వర్ పుజారా (246 బంతుల్లో 123; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్లో 16వ సెంచరీతో ముప్పు తప్పించాడు. దీంతో గురువారం ఇక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ 250/9తో రోజును ముగించి ఫర్వాలేదనిపించింది. రోహిత్‌శర్మ (61 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్ పంత్ (38 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), రవిచంద్రన్ అశ్విన్ (76 బంతుల్లో 25; 1 ఫోర్) పుజారాకు సహకారం అందించారు. ఏడో వికెట్‌కు పుజారా, అశ్విన్ జత చేసిన 62 పరుగులే భారత ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. లంచ్ విరామం అనంతరం కాసేపు సయమనం చూపిన రోహిత్... ఇన్నింగ్స్ గాడిన పడుతున్న దశలో ఔటయ్యాడు. ఉన్నంతసేపు ఇబ్బంది లేకుండా ఆడిన వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను లయన్ చక్కటి బంతితో ఔట్ చేశాడు. ఈ స్థితిలో పుజారా, అశ్విన్ ఆదుకున్నారు. అశ్విన్‌ను కమిన్స్, ఇషాంత్ (4)ను స్టార్క్ డగౌట్ చేర్చారు. షమీ (6 బ్యాటింగ్)తో పుజారా 9వ వికెట్‌కు 40 పరుగులు జోడించి గౌరవప్రదమైన స్కోరు అందించాడు.ఆసీస్ బౌలర్లలో కమిన్స్ (2/49), హాజల్‌వుడ్ (2/52), స్టార్క్ (2/63), లయన్ (2/83)లకు రెండేసి వికెట్లు దక్కాయి. మన ఇన్నింగ్స్ దాదాపు ముగిసినందున, శుక్రవారం కంగారూ బ్యాట్స్‌మెన్‌ను బౌలర్లు ఎంతమేరకు నిలువరిస్తారో చూడాలి. టాప్–4 టపటపా ఆసీస్ నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొనేంత ఫామ్‌లో లేని ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) అందుకుతగ్గ స్కోరుకే ఔటయ్యారు. హాజల్‌వుడ్ బంతిని డ్రైవ్ చేయబోయి రాహుల్, స్టార్క్ బౌలింగ్‌ను కాచుకోలేక విజయ్ పెవిలియన్ చేరారు. కమిన్స్ ఓవర్లో గల్లీలో ఉస్మాన్ ఖాజా పట్టిన కళ్లుచెదిరే క్యాచ్ కెప్టెన్ కోహ్లి (3) ఇన్నింగ్స్ ముగించింది. లయన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడంతో పాటు కుదరుకున్నట్లు కనిపించిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే (13) దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి మూల్యం చెల్లించుకున్నాడు. వాస్తవానికి ఈ బంతులేవీ వికెట్ తీసేంత గొప్పవి కాకున్నా బ్యాట్స్‌మెన్ దృక్పథం లోపంతోనే ఔటయ్యారు. 41/4తో నిలిచిన జట్టు కనీసం వందైనా దాటుతుందా అనే అనుమానాలు తలెత్తిన ఈ స్థితిలో పుజారాకు జత కలిసిన రోహిత్ దూకుడే జవాబు అన్నట్లు కనిపించాడు. టీ మిండియా 56/4తో లంచ్‌కు వెళ్లింది. రోహిత్.. మరీ ఇలానా? క్రీజులో కుదురుకుని, కొన్ని పరుగులూ చేసి, బౌలర్లు కూడా ప్రభావవంతంగా లేని సమయంలో అనవసరంగా ఔటైన రోహిత్‌శర్మ... తన టెస్టు స్థాయిపై విమర్శలు కొనితెచ్చుకున్నాడు. ఆఫ్ స్పిన్ సైతం వేయగల యువ బ్యాట్స్‌మన్ హనుమ విహారిని కాదని మరీ స్థానం దక్కించుకున్న అతడు ఈసారి కొంత మెరుగ్గానే కనిపించాడు. హిట్టింగ్తో స్కోరు పెంచుతాడనే ఉద్దేశంలో తీసుకున్నందుకు తను న్యాయం చేస్తున్నట్లే కనిపించాడు. కమిన్స్ ఓవర్లో కళ్లుచెదిరే సిక్స్‌తో ఔరా అనిపించాడు. లయన్నూ అదే తరహాలో శిక్షించబోయి... లాంగాన్‌లో మార్కస్ హారిస్ పొరపాటుతో ఆరు పరుగులు పొందాడు. తనను తాను నియంత్రించుకోకుండా, మరుసటి బంతికే అదే తరహాలో భారీ షాట్‌కు యత్నించి హారిస్‌కే క్యాచ్ ఇచ్చాడు. ‘నా అత్యుత్తమ ఐదు ఇన్నింగ్స్‌లో ఇది ఒకటి. మా బ్యాట్స్‌మెన్ మరింత మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేది. అయితే తొలి రెండు సెషన్లలో ఆస్ట్రేలియా చాలా బాగా బౌలింగ్ చేసింది. తేలికైన బంతులు పడే వరకు క్రీజ్‌లో ఓపిగ్గా నిలబడాలని నాకు తెలుసు. బయటికి కనిపిస్తున్న విధంగా పిచ్ బ్యాటింగ్‌కు మరీ అనుకూలంగా ఏమీ లేదు. 250 మంచి స్కోరే. ఎందుకంటే టర్న్ కూడా కనిపిస్తోంది కాబట్టి బ్యాటింగ్ సులభం కాదు. అశ్విన్ దీనిని ఉపయోగించుకోగలడు. సిక్సర్లు కొట్టడాన్ని కూడా సాధన చేస్తున్నా కాబట్టి నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. కొన్ని సార్లు విదేశాల్లో నేను విఫలమైనా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఈ సిరీస్‌కు సరైన సన్నద్ధతతో వచ్చాను. రెండో ఇన్నింగ్స్‌లో అందరం బాగా ఆడతామనే నమ్మకముంది’ – పుజారా -
జింబాబ్వే చారిత్రక విజయం
సిల్హెట్: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ప్రతీ సిరీస్‌కు ముందు సమస్యలతో సతమతమవుతున్న జింబాబ్వే క్రికెట్ జట్టులో కొత్త ఉత్సాహం నింపే క్షణమిది! వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌నకు దురదృష్టవశాత్తూ అర్హత సాధించలేకపోయి గత ఎనిమిది నెలలుగా మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జట్టుకు ఊరటనిచ్చే సందర్భమిది! దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ జట్టుకు టెస్టుల్లో తొలి గెలుపు దక్కింది. మంగళవారం నాలుగో రోజే ముగిసిన తొలి టెస్టులో జింబాబ్వే 151 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులకే ఆలౌటైంది. ఇమ్రుల్ కైస్ (43), ఆరిఫుల్ హఖ్ (38) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. 17 ఏళ్ల తర్వాత జింబాబ్వేకు విదేశాల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. ఆఖరి సారిగా 2001లో కూడా బంగ్లాదేశ్‌నే చిట్టగాంగ్‌లో జింబాబ్వే ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 26/0తో ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు శుభారంభమే లభించింది. కైస్, దాస్ (23) తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత జింబాబ్వే బౌలర్లు బ్రండన్ మవుటా (4/21), సికందర్ రజా (3/41) దెబ్బకు బంగ్లాదేశ్ కుప్పకూలింది. 86 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 8 వికెట్లు చేజార్చుకుంది. మొదటి టెస్టు ఆడుతున్న ఆరిఫుల్ కొద్ది సేపు పోరాడి చివరి వికెట్‌గా ఔట్ కావడంతో జింబాబ్వే సంబరాల్లో మునిగి పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు చేసిన జింబాబ్వే బ్యాట్స్‌మన్ సీన్ విలియమ్స్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ విజయాన్ని జట్టు సభ్యులు తనకిచ్చిన దీపావళి కానుకగా జింబాబ్వే కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ అభివర్ణించాడు. సిరీస్‌లో జింబాబ్వే 1–0తో ఆధిక్యంలో నిలవగా, ఈ నెల 11 నుంచి ఢాకాలో రెండో టెస్టు జరుగుతుంది. -
బిగిసింది పట్టు...
ఎదురుగా గుండెలు గుభేల్మనేలా కొండంత స్కోరు... కనీసం ఇద్దరు మూడంకెల స్కోరు చేస్తేనే దీటైన సమాధానం ఇవ్వగల పరిస్థితి! కానీ, వెస్టిండీస్... షమీ పేస్‌ను ఎదుర్కొనలేక, అశ్విన్ త్రయం స్పిన్‌కు తాళలేక చేతులెత్తేసింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టే వరుస కట్టారు! వెరసి... రాజ్‌కోట్ టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. అంతకుముందు కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా శతకాలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. మిగిలి ఉన్న మూడు రోజుల ఆటలో ఎంత పోరాడినా నిలవడం ప్రత్యర్థికి కష్టమే! భారత్ శనివారమే మ్యాచ్‌ను ముగించినా ఆశ్చర్యం లేదు. రాజ్‌కోట్: ఏమాత్రం సవాలు విసరని బౌలింగ్‌ను ముందుగా బ్యాట్స్‌మెన్ ఆటాడుకున్నారు... అనంతరం అంతంతమాత్రం అనుభవం ఉన్న ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను బౌలర్లు కుప్పకూల్చారు! మొత్తమ్మీద సొంతగడ్డపై తమజట్టు ఎంత పటిష్టమైనదో చూపుతూ టీమిండియా రాజ్‌కోట్ టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తోంది. అద్భుత శతకంతో మొదటి రోజు యువ ఓపెనర్ పృథ్వీ షా వేసిన బలమైన పునాదిని శుక్రవారం రెండో రోజు విరాట్ కోహ్లి (230 బంతుల్లో 139; 10 ఫోర్లు), రవీంద్ర జడేజా (132 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరింత బలపరిచారు. వీరికి వికెట్ కీపర్ రిషభ్ పంత్ (84 బంతుల్లో 92; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడు తోడవడంతో తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 649/9 వద్ద డిక్లేర్ చేసింది. బిషూ నాలుగు, లూయిస్ రెండు వికెట్లు పడగొట్టగా... గ్రాబియెల్, ఛేజ్, బ్రాత్‌వైట్‌లకు ఒక్కో వికెట్ దక్కాయి. అనంతరం బ్యాటింగ్ దిగిన విండీస్... పేసర్ షమీ (2/11) ధాటికి, అశ్విన్ (1/32), జడేజా (1/9), కుల్దీప్ యాదవ్ (1/19)ల మాయకు కుదేలైంది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి విండీస్ 94/6తో నిలిచింది. రోస్టన్ ఛేజ్ (27 బ్యాటింగ్), కీమో పాల్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరుకు ఇంకా 555 పరుగులు వెనుకబడి ఉన్న ఆ జట్టు కనీసం ఫాలోఆన్‌ను తప్పించుకోవడమూ కష్టమే. నిలిచేవారేరి? ఆడేవారేరి? భీకరంగా సాగిన భారత బ్యాటింగ్‌కు పూర్తి భిన్నంగా నడిచింది పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్. ఏ బ్యాట్స్‌మన్ కూడా పట్టుమని 10 ఓవర్లు నిలిచేలా కనిపించలేదు. జట్టులో సీనియర్, కీలక బ్యాట్స్‌మన్, ఈ టెస్టుకు కెప్టెన్ అయిన ఓపెనర్ బ్రాత్‌వైట్ (2)... షమీ రెండో ఓవర్లోనే బౌల్డయ్యాడు. నోబాల్ అనే అనుమానంతో పలుమార్లు పరిశీలించినా, చివరకు థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. షమీ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ కీరన్ పావెల్ (1) వికెట్ల ముందు దొరికిపోయాడు. షై హోప్ (10), హేట్‌మైర్ (10) నిలదొక్కుకోవడానికి చూసినా అది అతి కొద్దిసేపే. అశ్విన్... హోప్ వికెట్లను గిరాటేశాడు. అతడి తదుపరి ఓవర్లోనే మిడాన్‌లోకి బంతిని కొట్టి పరుగుకు యత్నించిన హేట్‌మైర్... జడేజా డైరెక్ట్ హిట్‌కు రనౌటయ్యాడు. స్లిప్‌లో రహానే క్యాచ్‌తో సునీల్ ఆంబ్రిస్ (12)ను జడేజా వెనక్కుపంపాడు. వికెట్ కీపర్ డౌరిచ్ (10)ను కుల్దీప్ బలిగొన్నాడు. దీంతో విండీస్ 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఛేజ్కు జత కలిసిన కీమో పాల్... సిక్స్, ఫోర్‌తో దూకుడు చూపాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. మూడో సెషన్లో 29 ఓవర్లను ఎదుర్కొన్న వెస్టిండీస్ 94 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఔటైనందున శనివారం ఆ జట్టు లోయరార్డర్‌ను పడగొట్టడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదు. తద్వారా భారీ ఆధిక్యం దక్కడం ఖాయం. అయితే, కోహ్లి ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడిస్తాడో? లేక రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగుతాడో చూడాలి. ఆ ముగ్గురూ ఆడుతూ పాడుతూ... ఓవర్‌నైట్ స్కోరు 364/4తో శుక్రవారం కొనసాగిన టీమిండియా స్కోరు కోహ్లి, పంత్ జోరైన బ్యాటింగ్‌తో చకచకా ముందుకు సాగింది. కోహ్లి అడపాదడపా షాట్లు కొట్టగా... రిషభ్ సహజ శైలిలో ఆడాడు. కీమో పాల్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్‌తో అర్ధ శతకం అందుకున్నాడు. తర్వాత ఛేజ్, బిషూల ఓవర్లలోనూ ఇదే తరహాలో బాది పరుగులు పిండుకున్నాడు. 18 బంతుల్లోనే అతడు వ్యక్తిగత స్కోరు 42 నుంచి 83కు చేరుకోవడం విశేషం. అవతలి ఎండ్‌లోని కోహ్లి అప్పటికి చేసివని 22 పరుగులే కావడం గమనార్హం. మరికాసేపటికే బిషూ బౌలింగ్‌లో ఫైన్ లెగ్‌లో బౌండరీ బాదిన కెప్టెన్ కెరీర్లో 24వ శతకాన్ని అందుకున్నాడు. అయితే, శతకం చేసే ఊపులో కనిపించిన పంత్... బిషూ గూగ్లీని షాట్ కొట్టే యత్నంలో షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో పాల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 133 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. జడేజా సైతం బ్యాట్ ఝళిపించడం తో లంచ్‌కు ముందే స్కోరు 500 దాటింది. లంచ్–టీ జడేజా సెషన్... విరామం నుంచి వస్తూనే లూయిస్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన కోహ్లి ఈ ఏడాది టెస్టుల్లో 1000 పరుగుల మార్కు దాటాడు. అదే ఊపులో బిషూ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కోహ్లి ఔటయ్యాక జడేజా విజృంభణ మొదలైంది. ఈ మధ్యలో అశ్విన్ (7), కుల్దీప్ (12) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఫిఫ్టీ అనంతరం సిక్స్‌లు, ఫోర్లతో జడేజా మరింత ధాటిగా ఆడాడు. అతడికి ఉమేశ్ యాదవ్ (22; 2 సిక్స్‌లు) సహకరించాడు. 79 పరుగుల వద్ద దక్కిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుంటూ భారీ షాట్లతో 90ల్లోకి వచ్చాడు. కానీ, అప్పటికే 9 వికెట్లు పడటంతో అతడి సెంచరీ పూర్తవుతుందా? అనే అనుమానం కలిగింది. దీనికి తగ్గట్లే కొంత ఉత్కంఠ నెలకొన్నా షమీ (2 నాటౌట్) సహకరించాడు. బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో మిడాఫ్ లోకి బంతిని కొట్టి పరుగు తీయడంతో టెస్టుల్లో జడేజా తొలి శతకం పూర్తయింది. ఆ వెంటనే కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. సొంతగడ్డపై జడేజాలం... ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శన, ఏడాది పైగా విరామంతో వన్డేల్లో చోటుతో ఆసియా కప్ ఫైనల్లో విలువైన పరుగులతో మళ్లీ జనం నాట్లో నానుతున్న జడేజా... సొంతగడ్డపై టెస్టులో శుక్రవారం అంతా తానే అయి కనిపించాడు. లోయరార్డర్ అండగా సిక్స్‌లు బాది తొమ్మిదేళ్ల కెరీర్లో తొలి శతకం నమోదుతో కర్ర సాము చేసిన ఈ ఆల్ రౌండర్... ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో ఓ రనౌట్ (హేట్‌మైర్), ఓ వికెట్ పడగొట్టాడు. ఇందులో రనౌట్‌ను కొంత విచిత్రం అనిపించేలా చేశాడు. అదెలాగంటే, అశ్విన్ బౌలింగ్‌లో హేట్‌మైర్ బంతిని మిడాన్‌లోకి ఆడి ఆంబ్రిస్‌ను పరుగుకు పిలిచాడు. కానీ, తర్వాత వెనక్కుతగ్గాడు.ఈలోగా ఆంబ్రిస్ స్ట్రయికర్ క్రీజు వద్దకు వచ్చేశాడు. దీంతో ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకేవైపు ఉండిపోయారు. బంతిని అందుకున్న జడేజా... అశ్విన్‌కు ఇవ్వకుండా వికెట్లను పడగొట్టేందుకు నింపాదిగా రాసాగాడు. అవకాశాన్ని గమనించిన హేట్‌మైర్ పరుగుకు యత్నించాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ కంగారుపడగా, జడేజా వేగం పెంచి బంతిని వికెట్లకేసి కొట్టాడు. దగ్గరగా ఉన్నప్పటికీ త్రో తరహాలో బంతిని విసిరాడు. అది తగలకుంటే పరిస్థితి ఏమిటన్న రీతిలో అశ్విన్, కోహ్లి అతడికేసి చూడటం, తర్వాత కులాసాగా నవ్వడం గమనార్హం. కోహ్లి సంబరాలు లేకుండానే: సరైన సవాల్ ఉంటేనే కోహ్లికి మజానేమో? దీటైన ప్రత్యర్థిపై ఆడితేనే ఆనందమేమో...? శుక్రవారం అతడి బాడీ లాంగ్వేజ్ ఇలాగే ఉంది మరి. టెస్టులంటే అమితాసక్తి చూపే భారత కెప్టెన్ అందులో సెంచరీ చేస్తే ఆకాశమే పాదాక్రాంతమైనట్లు రెండు చేతులూ చాచి గర్జనలాంటి అరుపుతో సంబరం చేసుకుంటాడు. రాజ్‌కోట్‌లో మాత్రం ఇవేమీ లేకుండానే అతడి శతకాభివాదం సాగిపోయింది.అసలు తాను మూడంకెలను చేరుకున్నాడా లేదా అని అభిమానులకు అనుమానం కలిగేలా అత్యంత సాధారణంగా బ్యాట్‌ను పైకెత్తాడు. ఈ శతకం అమ్మకు అంకితం... గతంలో 80లు, 90లు చేసినా సెంచరీలుగా మల్చలేకపోయా. ఈ రోజు మాత్రం ఎలాంటి చెత్త షాట్లు కొట్టదల్చుకోలేదు. అందుకే ఉమేశ్, షమీలతో ఎప్పటికప్పుడు మాట్లాడా. శతకం చేసి తీరాలని నాకు నేను సంకల్పించుకున్నా. స్థిరంగా ఆడకుంటే ఒత్తిడిలో పడతాం. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోదల్చుకున్నా. ఇంగ్లండ్‌లోనూ ఇదే ఆలోచనతో ఉన్నా. ఈ సెంచరీ మా అమ్మకు అంకితం. - జడేజా ►124 టెస్టుల్లో 24 సెంచరీలు చేసేందుకు కోహ్లి తీసుకున్న ఇన్నింగ్స్‌ల సంఖ్య. బ్రాడ్‌మన్ (66 ఇన్నింగ్స్) మాత్రమే ఇంతకంటే వేగంగా 24 సెంచరీలు చేశాడు. సచిన్‌కు 125, గావస్కర్‌కు 128 ఇన్నింగ్స్‌లు పట్టాయి. ►30 టెస్టులు, వన్డేలు కలిపి కెప్టెన్‌గా కోహ్లి సెంచరీల సంఖ్య. నాయకుడిగా అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పాంటింగ్ (41), గ్రేమ్ స్మిత్ (33) అతనికంటే ముందున్నారు. ►24 టెస్టుల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. తాజా శతకంతో సెహ్వాగ్ (23)ను అధిగమించాడు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (51), రాహుల్ ద్రవిడ్ (36), సునీల్ గావస్కర్ (34) మాత్రమే అతనికంటే ఎక్కువ సెంచరీలు చేశారు. ►3 వరుసగా మూడో ఏడాది టెస్టుల్లో 1000 పరుగులు చేసిన కోహ్లి ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ►1 జడేజాకు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలి సెంచరీ. తన 218వ మ్యాచ్‌లో అతను ఈ మార్క్‌ను అందుకున్నాడు ► 649 టెస్టుల్లో విండీస్‌పై భారత్‌కిదే అత్యధిక స్కోరు. గత రెండేళ్లలో భారత్ 600 అంతకంటే ఎక్కువ స్కోరు చేయడం ఇది ఎనిమిదోసారి. -
కేఎల్ రాహుల్.. మళ్లీనా?
రాజ్‌కోట్ : టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. గురువారం వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశ పరిచిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ ఈ వికెట్‌పై సమీక్షకు వెళ్లి మరోసారి విఫలమయ్యాడు. ఇది అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మళ్లీ డీఆర్ఎస్ వృథా చేశావా? అంటూ మండిపడుతున్నారు. ఇక ఆసియాకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ డీఆర్ఎస్ వృథా చేయడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. అప్పుడే అభిమానుల రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి డకౌట్ కావడమే కాకుండా.. రివ్యూను వృథా చేయడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. (చదవండి: వద్దంటే వినాలిగా!!) దీంతో సోషల్ మీడియా వేదికగా రాహుల్‌ను ఏకిపారేస్తున్నారు. ఇక విచారకరమైన విషయం ఏమిటంటే రాహుల్ గత 8 ఇన్నింగ్స్‌ల్లో ఎల్బీడబ్ల్యూ లేక బౌల్డ్ కావడం. దీంతో అతని ఫుట్ వర్క్‌పై సందేహం వ్యక్తం చేస్తూ అతనికి మరోసారి అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే మయాంక్ అగర్వాల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతని ఆటపై వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. కేఎల్ రాహుల్ క్రికెట్ కన్నా తన నిర్లక్ష్యాన్నే ఎక్కువగా ప్రేమిస్తాడని, రివ్యూలను వృథా చేయడం ఓ అలవాటుగా మార్చుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. ( చదవండి: నాన్నకు ప్రేమతో.. : పృథ్వీ షా) అరంగేట్ర కుర్రాడు పృథ్వీ షా (154 బంతుల్లో 134; 19 ఫోర్లు) దూకుడైన శతకానికి తోడు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (130 బంతుల్లో 86; 14 ఫోర్లు); కెప్టెన్ విరాట్ కోహ్లి (137 బంతుల్లో 72 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించడంతో గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. కోహ్లితో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ (21 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్ బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. (చదవండి: పృథ్వీ ‘షా’న్దార్ ) #klrahul wastes a DRS review yet again #someonepleaseslaphim pic.twitter.com/DEChx0wCmK — Jay Flora (@jayflora85) October 4, 2018 KL Rahul loves negligence more than Cricket.#KLRahul #INDvWI — Shiva Amirishetti (@SAmirishetti) October 4, 2018 #KLRahul starts saving his all energy to score 100+ in last test match for getting place in next series 😂😂 — noothan s (@am_noothan) October 4, 2018 -
పృథ్వీ ‘షా’న్దార్
రాజ్‌కోట్: పస లేని బౌలింగ్‌ను ఆటాడుకుంటూ వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్ కదంతొక్కడంతో మొదటి రోజే పైచేయి సాధించింది. అరంగేట్ర కుర్రాడు పృథ్వీ షా (154 బంతుల్లో 134; 19 ఫోర్లు) దూకుడైన శతకానికి తోడు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (130 బంతుల్లో 86; 14 ఫోర్లు); కెప్టెన్ విరాట్ కోహ్లి (137 బంతుల్లో 72 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించడంతో గురువారం ఇక్కడ ప్రారంభమైన మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. కోహ్లితో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ (21 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్ బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మ్యాచ్‌కు కొద్దిసేపు ముందు జాసన్ హోల్డర్ మడమ గాయం కారణంగా దూరమవడంతో బ్రాత్‌వైట్ విండీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆటంతా అతడే! టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ (0) తొలి ఓవర్ చివరి బంతికే గాబ్రియెల్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూలో బంతి మధ్య వికెట్‌ను తాకుతున్నట్లు తేలడంతో అతడు వెనుదిరిగాడు. అయితే, మరో ఎండ్‌లో పృథ్వీ అలరించాడు. కీమో పాల్ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాదాడు. మరో ఎండ్‌లో పుజారా సైతం దూకుడు కనబర్చాడు. తొమ్మిదో ఓవర్లోనే స్పిన్నర్ బిషూను దింపినా ఈ జోడీ ఏమాత్రం ఇబ్బందిపడలేదు. ఈ క్రమంలో ఛేజ్ బౌలింగ్‌లో సింగిల్‌తో పృథ్వీ అర్ధశతకం (56 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. కొద్దిసేపటికే పుజారా (67 బంతుల్లో) సైతం ఈ మార్కును చేరుకున్నాడు. అయితే, అర్ధ శతకం తర్వాత షా బ్యాటింగ్ మరింత వేగంగా సాగింది. చూస్తుండగానే 60, 70 దాటిపోయింది. 133/1తో భారత్ లంచ్‌కు వెళ్లింది. విరామం నుంచి వస్తూనే బిషూ వరుస ఓవర్లలో మూడు బౌండరీలు బాదిన పృథ్వీ 90ల్లోకి వచ్చాడు. పాల్ బౌలింగ్‌లో కవర్స్‌లోకి బంతిని కొట్టి డబుల్ తీయడంతో అతడి శతకం (99 బంతుల్లో) పూర్తయింది. ఇక్కడినుంచి షా నెమ్మదించగా, పుజారా జోరు పెంచాడు. భాగస్వామ్యం 200 దాటింది. సెంచరీ ఖాయం అనుకుంటున్న దశలో పుజారా అవుటయ్యాడు. టీ విరామానికి ముందు బిషూ వేసిన బంతిని కవర్స్ దిశగా పంపే యత్నంలో షా అతడికే క్యాచ్ ఇచ్చాడు. దీంతో అద్భు త ఇన్నింగ్స్ ముగిసింది. మూడో సెషన్లో ఇన్నిం గ్స్‌ను కోహ్లి, రహానే (92 బంతుల్లో 41; 5 ఫోర్లు) నడిపించారు. 99 బంతుల్లో కోహ్లి అర్ధ శతకం అం దుకోగా, రహానేను ఛేజ్ వెనక్కుపంపాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 102 పరుగులు జోడించారు. పిచ్ ఏమీ ఇబ్బంది పెట్టలేదు...! ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన అంతకంటే లేదు...! ఉన్నదంతా యువ కెరటం పృథ్వీ ‘షో’నే...! రోజులో రెండు సెషన్ల ఆట అతడిదే...! మ్యాచ్‌ను అంతగా ఏక పక్షంగా మార్చేశాడీ ముంబైకర్...! తనను పోల్చి చూసే సచిన్‌కూ సాధ్యం కాని ఘనతను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్నాడీ కుర్ర ఓపెనర్..! బెరుకు లేని బ్యాటింగ్‌తో సెంచరీ కొట్టేశాడు...! అరంగేట్రంలోనే షాన్‌దార్ ఇన్నింగ్స్‌తో రికార్డులను తిరగరాశాడు...! దీంతో వెస్టిండీస్‌తో తొలి టెస్టును కోహ్లి సేన ఘనంగా ప్రారంభించింది. ఈ శతకం నాన్నకే అంకితం ‘‘నేను టీమిండియా కోసం చేసే ప్రతి పరుగులో నాన్నే ఉంటాడు. ఆయన నా కోసం ఎంతో చేశాడు. ఎన్నో వదులుకున్నాడు. తన సంతోషాలన్నీ త్యాగం చేశాడు. కాబట్టే నా శతకం నాన్నకే అంకితం. అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించడం చాలా సంతోషాన్నిచ్చింది. అయితే క్రీజులో నేను మాత్రం దీనిని నా తొలి మ్యాచ్‌గా అస్సలు భావించలేదు. నా శైలికి తగ్గట్లే బ్యాటింగ్ చేశాను. నిజానికి ఇక్కడ అరంగేట్రం చాన్స్ లభించినప్పటికీ... నేనైతే ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైనపుడే ఐదు రోజుల ఆటకు మానసికంగా సంసిద్ధమయ్యాను. తుది జట్టులో ఆడించడమనేది కెప్టెన్, కోచ్‌ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఇక్కడ ఆ చాన్స్ లభించింది. ఇక ఈ అవకాశాన్ని జారవిడుచుకోను. నిలకడగా రాణించి స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాను’’ – పృథ్వీ షా అదరగొట్టాడు... ‘కుర్రాడు మరీ లేతగా ఉన్నాడు...’ తరహాలో కనిపించినా క్రీజులో తానెంత ఘటికుడినో నిరూపించాడు పృథ్వీ షా. ఆడుతున్నది తొలి టెస్టనే ఒత్తిడి లేదు. షెనాన్ గాబ్రియెల్ 145 కి.మీ. వేగం తగ్గకుండా బంతులేస్తున్నా బెరుకు లేదు. బౌలింగ్ మార్పులతో ప్రత్యర్థి వల పన్నుతున్నా చెక్కు చెదరని ఏకాగ్రత! ఇదీ గురువారం షా ఇన్నింగ్స్ సాగిన తీరు. ఫుల్ లెంగ్త్ బంతి అయితే షాట్‌కు దిగడం, షార్ట్ బంతి అయితే ఆచితూచి ఆడటం, మంచి బంతిని గౌరవంగా వదిలేయడం... ఇలా ఎంతో అనుభవజ్ఞుడిలా, స్పష్టమైన గేమ్ ప్లాన్‌తో వచ్చినవాడిలా కనిపించాడతడు. వన్డే తరహాలో ఆడిన పృథ్వీ ఓ దశలో ఎదుర్కొన్న బంతులను మించి పరుగులు చేశాడు. వందకుపైగా స్ట్రయిక్ రేట్‌తో శతకం అందుకున్నాడు. అంతటితో సంతృప్తి పడకుండా, మరింత భారీ స్కోరుకు తనను తాను సిద్ధం చేసుకునేందుకా? అన్నట్లు సెంచరీ తర్వాత నిదానించాడు. నిబ్బరం... సంబరం అవతలి జట్టు ఎలాంటిదైనా టెస్టుల్లో బ్యాట్స్‌మెన్‌కు కావాల్సింది నిబ్బరం. అది ఇన్నింగ్స్ తొలి బంతిని ఎదుర్కొన్నప్పటి నుంచే పృథ్వీలో కనిపించింది. సహజ సిద్ధమైన బ్యాక్‌ఫుట్ ఆటకు... ముచ్చటైన స్ట్రోక్ ప్లే జోడిస్తూ పరుగులు పిండుకున్నాడు. కట్స్, ఫ్లిక్, హుక్ ఇలా అన్ని రకాల షాట్లు కొట్టాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు ఇన్నింగ్స్ రన్‌రేట్ 4.5 పరుగుల పైనే సాగడం దీనికి నిదర్శనం. రెండు సెషన్ల పాటు నిలిచి జట్టుకు ఒక ఓపెనర్ ఏం చేయాలో అది చేసి చూపాడు. ఆఫ్‌సైడ్ ఏడుగురు ఫీల్డర్లను మోహరించి షార్ట్, వైడ్, హాఫ్ వ్యాలీ బంతులతో ప్రత్యర్థి విసిరిన పరీక్షను అధిగమించాడు. కొన్నిసార్లు దూరంగా వెళ్తున్న బంతులను వెంటాడేందుకు ప్రయత్నించినా పొరపాటును గ్రహించి వెంటనే సర్దుకున్నాడు. చకచకా పరుగులు సాధిస్తున్న పృథ్వీని చూస్తుంటే ఒకప్పటి సెహ్వాగ్ గుర్తొచ్చాడు. మొత్తానికి... ఓ పిల్లాడిలా మైదానంలో దిగిన అతడు పెవిలియన్ చేరేటప్పటికి అతి పెద్ద పరీక్ష ఉత్తీర్ణుడైనవాడిలా కనిపించాడు. ►పిన్న వయసులో సెంచరీ చేసిన భారత ఆటగాళ్లలో సచిన్ (17 ఏళ్ల 107 రోజులు) తర్వాత పృథ్వీ షా (18 ఏళ్ల 329 రోజులు) రెండో స్థానంలో నిలిచాడు. ► తొలి టెస్టులోనే అతి పిన్న వయసులో సెంచరీ చేసిన జాబితాలో పృథ్వీ నాలుగో స్థానంలో నిలిచాడు. అష్రాఫుల్, మసకద్జా, సలీమ్ మాలిక్ అతనికంటే చిన్న వయసులో తమ తొలి మ్యాచ్‌లలో శతకాలు బాదారు. ►సెంచరీ చేసేందుకుపృథ్వీ షాకు పట్టినబంతులు. కెరీర్ తొలిటెస్టులో శిఖర్ ధావన్ (85),డ్వేన్ స్మిత్ (93) మాత్రమే ఇంతకంటే తక్కువ బంతుల్లోసెంచరీ సాధించారు. ►భారత్ తరఫునతొలి టెస్టులోసెంచరీ చేసిన15వ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాజకోటలో విజయం వేటకు
విదేశీ పరాజయాలను మరపున పడేసేందుకు... ఎప్పటిలా స్వదేశంలో పులిలా చెలరేగేందుకు... టీమిండియా ముంగిట ఓ అవకాశం! విరాట్ కోహ్లి పరుగుల ప్రవాహానికి... రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల వేటకు ఓ రాచ మార్గం! రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌తో నేటి నుంచే తొలి టెస్టు... ప్రతిభ ఉన్నా అనుభవం లేని ప్రత్యర్థి... ఐదు రోజుల సమరంలో ఎంతవరకు నిలుస్తుందో వేచి చూడాలి. రాజ్‌కోట్: పసికూన అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టును వదిలేస్తే... దాదాపు 10 నెలల తర్వాత సొంతగడ్డపై భారత్‌కు పూర్తి స్థాయి టెస్టు సిరీస్. బలహీనమైనదే అయినా, పూర్తిగా తీసిపారేయలేని వెస్టిండీస్‌తో సమరం. ఇందులో భాగంగా గురువారం నుంచి రాజ్‌కోట్‌లో తొలి పోరు. ఎన్నడూ లేని విధంగా మ్యాచ్‌కు ముందు రోజే 12 మంది సభ్యుల జట్టును ప్రకటించడం టీమిండియా తరఫున ఓ విశేషమైతే... సంచలనాల యువ పృథ్వీ షా అరంగేట్రం ఖాయమవడం ఇంకో విశేషం. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్‌కు తప్పని నిరీక్షణ. కూర్పులో అనూహ్య మార్పుతో ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారికీ దక్కని అవకాశం. ఎప్పటిలా స్పిన్‌కు కాకుండా పేస్‌కు అనుకూలించే పిచ్‌లు తయారు చేశారన్న అంచనాల మధ్య కొంత ఆసక్తికరంగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. పేసరా? స్పిన్నరా? కోహ్లి సేన ఐదుగురు బౌలర్లతో బరిలో దిగనున్న నేపథ్యంలో కూర్పు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లుగా ఉంటుందా? ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ఉంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆల్‌రౌండర్ అందుబాటులో లేనందునే... సంప్రదాయంగా వస్తున్న నలుగురు బౌలర్ల వ్యూహాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజాతో పాటు అశ్విన్‌లను ఆల్రౌండర్లుగా పరిగణించినా, మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ను తీసుకుంటారో? లేక పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను ఎంచుకుంటారో చూడాలి. ఇక బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా మయాంక్‌ను దింపుతారని అంతా ఆశిస్తే, అనూహ్యంగా పృథ్వీ షా పేరును ప్రకటించారు. పుజారా, కోహ్లి, రహానేలతో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. తాను నాలుగు శతకాలు చేసిన ప్రియమైన ప్రత్యర్థిపై బ్యాట్‌తో రాణించేందుకు అశ్విన్ సిద్ధంగా ఉన్నాడు. సొంతగడ్డ కాబట్టి రవీంద్ర జడేజా నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ ఆశించొచ్చు. స్పిన్నర్లతో పాటు ప్రధాన పేసర్లు షమీ, ఉమేశ్ యాదవ్‌లను ఎదుర్కోవడం విండీస్‌కు కఠిన పరీక్షే. అనుభవం లేకున్నా సత్తాగలదే... పరిమిత ఓవర్ల క్రికెట్లో విరుచుకుపడే నాణ్యమైన ఆటగాళ్లు టెస్టులకు మొహం చాటేస్తున్నా... ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ నేతృత్వంలోని వెస్టిండీస్‌ను సంప్రదాయ ఫార్మాట్లో తక్కువగా చూడలేం. ఇటీవల సొంతగడ్డపై శ్రీలంకతో సిరీస్‌ను 1–1తో డ్రా చేసుకుని, బంగ్లాదేశ్‌పై 2–0తో విజయం సాధించి ఆ జట్టు ఫామ్‌లో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలోనూ లీడ్స్‌లో టెస్టు నెగ్గింది. అయితే, కెప్టెన్ హోల్డర్ సహా చాలామంది ఆటగాళ్లకు భారత్‌లో ఆడిన అనుభవం లేకపోవడం ప్రధాన లోటు. ప్రస్తుత జట్టులో ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్, కీరన్ పావెల్, షనన్ గాబ్రియెల్, దేవేంద్ర బిషూ మాత్రమే గతంలో ఇక్కడ పర్యటించారు. పేసర్ కీమర్ రోచ్ సైతం ఆడినా అతడు తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. వీటన్నిటిని పక్కన పెడితే ఈ జట్టుకు ప్రతిఘటనతో మ్యాచ్‌లను రసవత్తరంగా మార్చగల సత్తా ఉన్నది. బ్రాత్‌వైట్, షై హోప్, రోస్టన్ ఛేజ్ కఠిన పరిస్థితుల్లోనూ నిలకడగా పరుగులు సాధిస్తున్నారు. వికెట్ కీపర్ షేన్ డౌరిచ్, హోల్డర్ లోయరార్డర్లో ఉపయుక్తమైన బ్యాట్స్‌మెన్. ఎటొచ్చి అటు పేస్‌లో ఇటు స్పిన్‌లోనూ బలహీనంగా కనిపిస్తోంది. షనన్ గాబ్రియెల్‌కు తోడుగా కీమో పాల్, షర్మన్ లూయీస్లలో ఒకరు రెండో పేసర్‌గా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. వీరిద్దరూ కొత్తవారే. బిషూ, జొమెల్ వారికన్, పార్ట్ టైమర్ చేజ్‌లతో కూడిన స్పిన్‌ను ఆడటం భారత బ్యాట్స్‌మెన్‌కు పెద్దగా ఇబ్బందే కాదు. ఇలాంటి పరిమిత వనరులతో వెస్టిండీస్ ఎలా ఆడుతుందో చూడాలి. భారత క్రికెట్ జట్టు ఎంపికకు సంబంధించి సెలక్టర్లదే బాధ్యత. తుది జట్టులోకి తీసుకునే విషయంపై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మొదటి నుంచి జట్టుతోనే ఉన్నా ఒక్క మ్యాచ్‌లో కూడా కరుణ్ నాయర్‌ను ఆడించకపోవడంపై విమర్శలు చెలరేగినా... ఈ అంశంపై ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ తగిన వివరణ ఇచ్చారు. ఆయన ఒకసారి వివరణ ఇచ్చాక మళ్లీ నేనిక్కడ మాట్లాడటం అనవసరం. ఎవరికి అప్పజెప్పిన బాధ్యతలు వారు ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. టాపార్డర్ మెరుగైన ప్రదర్శన కనబర్చడం మినహా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నుంచి కొత్తగా మరేమీ ఆశించడం లేదు. –విరాట్ కోహ్లి పిచ్, వాతావరణం పిచ్ రెండున్నర రోజులు బ్యాటింగ్‌కు అనుకూలం. తర్వాత స్పిన్‌కు సహకరిస్తుంది. కానీ, ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకుని బౌన్సీ పిచ్ తయారు చేయాల్సిందిగా క్యురేటర్‌కు బీసీసీఐ సూచనలు చేసిందన్న వార్తలతో ఏ విధంగా స్పందిస్తుందో మ్యాచ్ సాగే తీరును బట్టి తేలనుంది. టెస్టు జరిగే ఐదు రోజుల్లో వర్ష సూచన లేదు. జట్లు (అంచనా) భారత్: కేఎల్ రాహుల్, పృథ్వీ షా, పుజారా, కోహ్లి, రహానే, పంత్, అశ్విన్, జడేజా, షమీ, ఉమేశ్, కుల్దీప్/శార్దూల్. విండీస్: బ్రాత్‌వైట్, కీరన్ పావెల్, షై హోప్, సునీల్ ఆంబ్రిస్, ఛేజ్, హేట్‌మెయిర్, డౌరిచ్, హోల్డర్, కీమో పాల్, గ్రాబియెల్, బిషూ. ►భారత గడ్డపై వెస్టిండీస్ జట్టు టెస్టు గెలిచి 24 ఏళ్లు గడిచాయి. విండీస్ జట్టు చివరిసారి 1994లో భారత్‌లో టెస్టు గెలిచింది. ఆ తర్వాతి కాలంలో భారత్‌లో ఆ జట్టు కేవలం ఎనిమిది టెస్టులు మాత్రమే ఆడింది. ► ఉదయం గం. 9.20 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
అతడు అర్ధరాత్రి కూడా పరుగులు చేయగలడు
భారత ఉత్తమ క్రికెటర్లయిన కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గతంలో ఇంగ్లండ్ గడ్డపై రాణించలేకపోయారు. 2014 పర్యటన వారు మర్చిపోదగిన వాటిలో ఒకటి. నాటి సంధి దశ తర్వాత ఇద్దరూ గొప్ప ఆటగాళ్లుగా ఎదిగారు. ఇక మిగిలిపోయిన ఈ సవాల్ వారికి చాలా క్లిష్టమైనది. మొదటి టెస్టు ద్వారా అందులో కొంత అధిగమించారు. దీంతోపాటు క్రికెట్ చరిత్రలో మేటి ఆటగాళ్లుగా నిలిచేందుకు మార్గం వేసుకున్నారు. వారి నైపుణ్యం, దృక్పథంపై ఎప్పుడూ సందేహాలు లేవు. తాజాగా వాటిని మిగతా ప్రపంచానికి చాటేందుకు ఓ అవకాశం దక్కింది. దానిని తమదైన శైలిలో నెరవేర్చారు. టెస్టు తొలి రోజే అశ్విన్ బంతిని స్పిన్ తిప్పగలిగాడు. పిచ్ సహకారంతోనే అతనిలా చేయగలిగాడని ఎవరూ అనలేరు. అత్యుత్తమ నైపుణ్యంతోనే ఇది సాధ్యం. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చుట్టూ ఉచ్చు పన్నిన అతడు వారిని కట్టిపడేశాడు. కుక్లాంటి విశేష అనుభవజ్ఞుడిని బౌల్డ్ చేయాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కానీ అశ్విన్ దానిని సులువుగా చేసేశాడు. తర్వాత తానెందుకు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అయ్యాడో కోహ్లి చాటిచెప్పాడు. ఓవైపు వెంటవెంటనే మూడు వికెట్లు పడిపోవడం, మరోవైపు అండర్సన్ ఔట్ స్వింగ్‌తో తన ఆఫ్‌స్టంప్ బలహీనతను పరీక్షిస్తుండటంతో కోహ్లి ప్రారంభంలో చాలా శ్రమించాడు. ఇదే సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఓ బ్యాట్స్‌మన్‌కు అవసరమైన అదృష్టం కూడా తనకు దక్కింది. తర్వాత లోయరార్డర్ బ్యాట్స్‌మెన్‌ను రక్షించుకుంటూ, స్ట్రయిక్ తీసుకుంటూ, జో రూట్ ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్‌ను అపహాస్యం చేస్తూ అద్భుతం సృష్టించాడు. తనను అన్నివిధాలా పరీక్షించడంతో పాటు, అనిశ్చిత స్థితి నుంచి జట్టును విజయం వైపు తీసుకెళ్లిన ఈ శతకాన్ని అతడు చాలాకాలం గుర్తు పెట్టుకుంటాడు. ఈ క్రమంలో తానిక్కడ రాణించాలంటే కౌంటీ క్రికెట్ ఆడాలనేమీ లేదని చూపాడు. అర్ధరాత్రి నిద్ర లేపినా పరుగులు చేయగల విశిష్ట నైపుణ్యం కోహ్లిది. ఒకవేళ భారత్ ఈ టెస్టుతో పాటు సిరీస్ గెలిచినా... అంతకుముందు ఆడిన సన్నాహక మ్యాచ్ ఇతర బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదనేది మాత్రం నిజం. దీనినిబట్టి కోహ్లి కంటే స్వింగ్ బంతిని ఆడలేకపోయిన వారికే కౌంటీల అవసరం ఎక్కువని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లోలాగా ప్రతిసారీ విరాట్ జట్టును కాపాడలేడు కదా? -
విజయం ఊరిస్తోంది..!
తొలి టెస్టులోనే విజయం సాధించి సుదీర్ఘ సిరీస్‌లో శుభారంభం చేసే అవకాశం... 194 పరుగుల సాధారణ లక్ష్యం.. కానీ మన బ్యాట్స్‌మెన్ మరో పేలవ ప్రదర్శనతో గెలుపు బాట కఠినంగా మారిపోయింది. 78 పరుగులకే ఐదుగురు పెవిలియన్ చేరి ఆందోళన పెంచారు. అయితే ఎప్పటిలాగే నేనున్నానంటూ విరాట్ కోహ్లి నిలబడ్డాడు. మెల్లగా జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు. అతనికి అండగా దినేశ్ కార్తీక్ గట్టిగానే నిలబడ్డాడు. అయినా సరే మదిలో కాస్త సందేహం... ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోతుండటంతో మరో 84 పరుగులు ఇంకా సుదూరంగానే కనిపిస్తోంది. భారత్ గెలుపుపై ఆశలు పెంచుకోగలిగిందంటే ఇషాంత్ శర్మ అద్భుత బౌలింగ్ ప్రదర్శన వల్లే. ఒకే ఓవర్లో మూడు వికెట్లు సహా మొత్తం ఐదు వికెట్లతో గత సిరీస్ ‘లార్డ్స్’ ప్రదర్శనను గుర్తు చేయగా, అశ్విన్ స్పిన్ కూడా మాయ చేసింది. అయితే కుర్రాడు కరన్ పట్టుదలగా నిలబడటంతో ఇంగ్లండ్ చెప్పుకోదగ్గ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. నాలుగో రోజు మనోళ్లు మిగిలిన ఐదు వికెట్లతో గట్టుకు చేరతారా? లేక ఇంగ్లండ్ వలలో పడతారా? ఇక అంతా కోహ్లిపైనే భారం..! బర్మింగ్‌హామ్: తొలి టెస్టులో భారత్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76 బంతుల్లో 43 బ్యాటింగ్; 3 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (18 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లాగే కోహ్లికి లోయర్ ఆర్డర్ సహకరిస్తే శనివారం సిరీస్‌లో 1–0తో భారత్ ఆధిక్యం సాధించేందుకు మంచి అవకాశం ఉంది. అంతకుముందు ఇషాంత్ శర్మ (5/51) ధాటికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే కుప్పకూలింది. ఎనిమిదో స్థానంలో ఆడిన స్యామ్ కరన్ (65 బంతుల్లో 63; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. ఒకే ఓవర్లో మూడు వికెట్లు... ఓవర్‌నైట్ స్కోరు 9/1తో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. రెండో రోజు తొలి వికెట్‌తో భారత్‌కు శుభారంభం అందించిన అశ్విన్ తన జోరును కొనసాగించడంతో ఇంగ్లండ్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ముందుగా జెన్నింగ్స్ (8) స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇవ్వగా... కొద్ది సేపటికే కెప్టెన్ జో రూట్ (14)ను కూడా అశ్విన్ వెనక్కి పంపించాడు. ఇషాంత్ వేసిన చక్కటి బంతిని ఆడలేక మలాన్ (20) స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇవ్వడంతో జట్టు పతనం మొదలైంది. అనంతరం ఇన్నింగ్స్ 31వ ఓవర్లో ఇషాంత్ చెలరేగిపోయాడు. ముగ్గురిని ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. రెండో బంతికి బెయిర్‌స్టో (40 బంతుల్లో 28; 5 ఫోర్లు) ఔట్ కాగా, నాలుగో బంతికి స్టోక్స్ (6) వెనుదిరిగాడు. ఈ వికెట్ తర్వాత లంచ్ విరామం వచ్చింది. అయితే ఆ తర్వాత తన ఓవర్ కొనసాగించిన ఇషాంత్ చివరి బంతికి బట్లర్ (1) పని పట్టాడు. ఈ దశలో ఇంగ్లండ్ స్కోరు 87/7 కాగా... ఆధిక్యం సరిగ్గా వంద పరుగులకు చేరింది. కరన్ మెరుపులు... తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీసిన స్యామ్ కరన్ ఈసారి బ్యాటింగ్ బలం చూపించాడు. ఎనిమిదో వికెట్‌కు రషీద్ (16)తో 48 పరుగులు, తొమ్మిదో వికెట్‌కు బ్రాడ్ (11)తో 41 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. షమీ, ఇషాంత్ ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. బంతులు అనూహ్యంగా ఎడ్జ్ తీసుకొని స్లిప్ ఫీల్డర్లను దాటి బౌండరీలకు వెళ్లిపోవడం, రషీద్ క్యాచ్‌ను ధావన్ వదిలేయడం, వేగంగా పరుగులు రావడం... ఇలా ఇరు జట్లు ఇలా కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నాయి. వెలుతురు తగ్గడంతో కొద్ది సేపు నిలిచిపోయిన ఆట మళ్లీ మొదలయ్యాక భారత్ కోలుకుంది. రషీద్‌ను ఉమేశ్ బౌల్డ్ చేశాక కూడా కరన్ దూకుడు తగ్గలేదు. అశ్విన్ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన అతను ఇషాంత్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్‌తో 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రాడ్‌ను ఔట్ చేసి ఇషాంత్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకోగా... తర్వాతి ఓవర్లో కరన్ వికెట్ తీసి ఉమేశ్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగించాడు. టాపార్డర్ విఫలం... ఛేదనలో భారత్‌కు మళ్లీ నిరాశాజనక ఆరంభం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లాగే టాప్–3 మరోసారి విఫలమయ్యారు. విజయ్ (6)ను ఎల్బీగా వెనక్కి పంపిన బ్రాడ్... తన తర్వాతి ఓవర్లో ధావన్ (13)నూ ఔట్ చేశాడు. స్టోక్స్‌కు రాహుల్ (13) వికెట్ దక్కగా, రహానే (2) పేలవ ఫామ్ కొనసాగింది. ఈ దశలో మరోసారి కోహ్లి బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు. ఆరో వికెట్‌కు కార్తీక్‌తో అభేద్యంగా 32 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను అతను నడిపించాడు. ►మధ్యాహ్నం గం. 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం -
రవిశాస్త్రి.. ఆంధ్ర భోజనం ఫుల్‌గా తింటే?
బర్మింగ్‌హామ్ : ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తెగ ఇబ్బంది పడ్డాడు. తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. వస్తున్న నిద్రను ఆపుకోలేక కునుకు తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆతిథ్య జట్టు 134/3తో పటిష్ట స్థితిలో ఉండగా.. ఇషాంత్ శర్మ వేసిన 46 ఓవర్లో ఇది చోటు చేసుకుంది. దీన్ని గుర్తించిన అభిమానులు రవిశాస్త్రిపై కుళ్లు జోకులు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ‘నీ ఫేవరేట్ ఆంధ్ర భోజనం ఫుల్‌గా తింటే ఇలానే ఉంటుంది మరీ’ అని కామెంట్ చేస్తున్నారు. ఇక రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంతో ఇంగ్లండ్ 287 పరుగులకు కుప్పకూలడం.. అనంతరం రెండో రోజు ఆటలో భారత బ్యాట్స్‌మన్ విఫలమవ్వడం.. కెప్టెన్ విరాట్ కోహ్లి వన్ మ్యాన్ ఆర్మీ ప్రదర్శనతో 274 పరుగులు సాధించడం తెలిసిన విషయమే. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఓపెనర్ కుక్ వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. After effects of full meals from your favourite Andhra mess 😴😴 @RaviShastriOfc #ENGvIND #RaviShastri pic.twitter.com/EpkaSoIgff — Satheesh Kumar (@SatheeshKCP) August 1, 2018 చదవండి: దటీజ్ కోహ్లి! -
రవిశాస్త్రి కూర్పాట్లు..వైరల్!
-
'సర్' విరాట్
ఇంగ్లండ్ గడ్డపై చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ... గత పర్యటన నాటి ఆటగాడిని కానని నిరూపిస్తూ... తానెక్కడైనా రాణించగలనని చాటి చెబుతూ... ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెన్నుచూపనని రుజువు చేస్తూ... తన వికెట్ విలువ ఏమిటో వివరిస్తూ... తన క్యాచ్‌లను జారవిడవడం ఎంతటి తప్పిదమో అని ప్రత్యర్థి బాధపడేలా చేస్తూ... అసలు సిసలు ‘కెప్టెన్ ఇన్నింగ్స్’ అంటే ఇదేనని కళ్లకు కడుతూ... విరాట్ కోహ్లి అద్భుత శతకంతో చెలరేగిన వేళ... మొదటి టెస్టులో టీమిండియా నిలదొక్కుకుంది. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా అమేయ పట్టుదలతో ఆడిన కోహ్లి... జట్టును ఒంటిచేత్తో ఒడ్డున పడేశాడు. ఇంగ్లండ్ గడ్డపై ఇదే తరహా ఆటను ఇకముందూ కొనసాగిస్తే ‘సర్’ పురస్కారంతో సత్కరించేందుకు బ్రిటన్ సిద్ధం కావాల్సిందే ...అయితే, దీనికిముందు ఓపెనర్లు అర్ధ శతక భాగస్వామ్యం అందించినా, విదేశీ గడ్డపై యథాప్రకారం మిగతా భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు! బౌలర్లు బెంబేలెత్తించకున్నా, వారి బంతులేమీ భయంకరంగా దూసుకురాకున్నా... వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు! ...ఇప్పుడిక చేయాల్సింది సారథి స్ఫూర్తితో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను సాధ్యమైనంత తక్కువ స్కోరుకు కట్టడి చేయడమే...! బర్మింగ్‌హామ్: అహో... విరాట్ కోహ్లి! ఏమా పోరాటం! ఎంతటి పట్టుదల! తీరని పరాభవం మిగిల్చిన ఇంగ్లిష్ గడ్డపైనే తన పౌరుషం చాటాడు. తనను అవుట్ చేయడం ఎంత కష్టమో ఆచరణలో చూపుతూ పరుగులు పిండుకున్నాడు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను కాచుకుని, ప్రత్యర్థి ఆధిక్యానికి గండికొట్టాడు. తాను నిలవకుంటే మ్యాచే చేజారే ముప్పున్న నేపథ్యంలో... ఒంటరి పోరాటంతో ఇంగ్లండ్‌ది పైచేయి కాకుండా చూశాడు. కోహ్లి (225 బంతుల్లో 149; 22 ఫోర్లు, 1 సిక్స్) అమోఘ ఆటతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 274 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 285/9తో గురువారం రెండో రోజు బరిలో దిగిన ఇంగ్లండ్ మరో రెండు పరుగులు జోడించి ఆలౌటైంది. తొలి రోజు చివరి ఓవర్లో చేజారిన కరన్ (24) వికెట్‌ను తన ఖాతాలోనే వేసుకున్న షమీ (3/64) ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను ముగించాడు. అనంతరం బరిలో దిగిన భారత్‌కు ఓపెనర్లు విజయ్ (20), ధావన్ (26) తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. కానీ కోహ్లి మినహా మిగతావారు భారీ స్కోరు చేయలేకపోవడంతో 274 పరుగులకే పరిమితమైంది. స్యామ్ కరన్ (4/74) రాణించగా, అండర్సన్, స్టోక్స్, రషీద్‌లకు తలా రెండు వికెట్లు దక్కాయి. 13 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ రోజు ముగిసేసరికి 9/1తో నిలిచింది. ఓపెనర్ కుక్ (0) మరోసారి అశ్విన్‌కే చిక్కాడు. మొత్తమ్మీద ఇంగ్లండ్ 22 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆరంభం బాగున్నా... విజయ్, ధావన్ ఇబ్బంది లేకుండా ఆడటంతో భారత ఇన్నింగ్స్ ఆశావహంగా సాగింది. చాలాకాలం తర్వాత విదేశాల్లో మంచి ఆరంభం దక్కింది. అయితే, కుదురుకున్న వీరిద్దరితో పాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ (4)ను 8 బంతుల వ్యవధిలో అవుట్ చేసి కరన్ దెబ్బకొట్టాడు. ఒక్కసారిగా స్కోరు 59/3కి పడిపోయింది. 76/3తో భారత్ లంచ్ విరామానికి వెళ్లింది. కొద్దిసేపటికే వైస్ కెప్టెన్ రహానే (15) దూరంగా వెళ్తున్న స్టోక్స్ బంతిని వెంటాడి వికెట్ పారేసుకున్నాడు. దీంతో నాలుగో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికి స్కోరు సరిగ్గా 100. వెంటనే దినేశ్ కార్తీక్ (0) కూడా స్టోక్స్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లు ఒత్తిడి పెంచడంతో ఇదే స్కోరు వద్ద జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. హార్దిక్ పాండ్యా (22) ఇచ్చిన క్యాచ్‌ను కుక్ జారవిడిచారు. మధ్యలో పాండ్యాను అంపైర్ ఎల్బీగా ప్రకటించినా, అప్పీల్‌కు వెళ్లి బయటపడ్డాడు. ఇక్కడి నుంచి పాండ్యా, కోహ్లి నడిపించారు. ఆరో వికెట్‌కు 48 పరుగులు జత చేశాక పాండ్యాను కరన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈసారి అప్పీల్‌కు వెళ్లినా ఫలితం ప్రతికూలంగా వచ్చింది. అశ్విన్ (10), షమీ (2)లను అండర్సన్ పెవిలియన్ చేర్చాడు. అప్పటికి పరిస్థితి 182/8. ఈ లెక్కన చూస్తే ప్రత్యర్థికి భారీ ఆధిక్యమే దక్కేలా కనిపించింది. అయితే, ఇషాంత్ (5), ఉమేశ్ (1 నాటౌట్) సాయంతో కోహ్లి పోరాడాడు. ఈ క్రమంలో శతకం అందుకున్నాడు. అనంతరం సాధ్యమైనన్ని పరుగులు జోడించే ఉద్దేశంతో భారీ షాట్లు కొడుతూ తాడోపేడో అనేలా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లు చేసేదేమీ లేక అతడి ప్రతాపాన్ని చూస్తూ ఉండిపోయారు. ఆఖరికి రషీద్ బౌలింగ్‌లో బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించి పాయింట్లో బ్రాడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అతడి అసాధారణ ఇన్నింగ్స్, భారత తొలి ఇన్నింగ్స్ ముగిశాయి. 21, 51 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌లను మలాన్ జారవిడవడం కూడా జట్టుకు కలిసొచ్చింది. బ్రిటన్ను గెలిచాడు... విరాట్ కోహ్లి మైదానంలోకి అడుగు పెట్టిన సమయంలో ప్రేక్షకులు అతడిని గేలి చేస్తూ స్వాగతించారు...కోహ్లి ఇన్నింగ్స్ ముగించి మైదానం వీడేటప్పుడు అదే జనం నిలబడి చప్పట్లతో అభినందిస్తూ ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు. భారత కెప్టెన్ ఇన్నింగ్స్ గొప్పతనం చూపించేందుకు ఇది చాలు. నాలుగేళ్ల క్రితం 10 ఇన్నింగ్స్‌లలో 288 బంతులు ఎదుర్కొని 134 పరుగులు చేసిన కోహ్లి... ఇప్పుడు ఒక్క ఇన్నింగ్స్‌లో 225 బంతులు ఆడి 149 పరుగులతో లెక్క సరి చేశాడు. 2014 సిరీస్ జ్ఞాపకాలను, తనపై వచ్చిన విమర్శలను పాతాళంలోకి పాతి పెట్టాడు! కోహ్లికి సెంచరీలు చేయడం కొత్త కాదు, రికార్డులు సృష్టించడమూ కొత్త కాదు. కానీ ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్...ఇలా ఎక్కడైనా పరుగుల వరద పారించిన కోహ్లికి ఇంగ్లండ్‌లో మాత్రం బాకీ ఉండిపోయింది. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ తొలి ఇన్నింగ్స్‌లో సహచరులెవరూ కనీస ప్రదర్శన చేయలేదు. నమ్ముకున్న బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఈ స్థితిలో ఒంటరిగా పోరాడుతూ అతను చేసిన పరుగుల విలువ అమూల్యం. పాండ్యా ఆరో వికెట్‌గా వెనుదిరిగిన సమయంలో జట్టు స్కోరు 148 పరుగులు కాగా... కోహ్లి 47 వద్ద ఆడుతున్నాడు. గతంలో సచిన్ స్థాయి క్రికెటర్ కూడా టెయిలెండర్ల సహకారంతో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ చేసిన సందర్భాలు దాదాపుగా లేవు. కానీ కోహ్లి మాత్రం తనేంటో మళ్లీ చూపించాడు. ఇన్నింగ్స్‌ను పూర్తిగా అదుపులో పెట్టుకొని ముందు పరిస్థితికి తగినట్లుగా, ఆ తర్వాత ధాటిని పెంచుతూ అతను ఆడిన షాట్లు మరచిపోలేనివి. పాండ్యా వెనుదిరిగాక భారత్ ఖాతాలో చేరిన 126 పరుగుల్లో కోహ్లి చేసినవే 102 ఉన్నాయి. చివరి గంట పాటు కోహ్లిని ఎలా ఔట్ చేయాలో తెలీక ఇంగ్లండ్ పూర్తిగా చేతులెత్తేసింది. మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉన్నా సిరీస్ మొత్తానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని కోహ్లికి ఈ ఇన్నింగ్స్ పుష్కలంగా అందించింది. సెంచరీ సాధించాక భావోద్వేగాలను దాచుకోకుండా గర్జించిన తీరు అతని దృష్టిలో దీని విలువేమిటో చూపించింది. అండర్సన్‌తో రసవత్తర పోరు: కోహ్లిని ఔట్ చేస్తేనే గానీ నేను ఇంటికి వెళ్లను అని ఒట్టు పెట్టుకున్నట్లుగా అండర్సన్ ఒక వైపు... ఏం చేసినా నీ బౌలింగ్‌లో మాత్రం ఔట్ కాననే పట్టుదల కనబర్చిన కోహ్లి మరో వైపు... వెరసి బర్మింగ్‌హామ్ టెస్టులో రెండో రోజు ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య రసవత్తర పోరు సాగింది. ఈ క్రమంలో కోహ్లికి అదృష్ట దేవత కూడా తోడుగా వచ్చింది. 2014 సిరీస్‌లో కోహ్లిని నాలుగు సార్లు ఔట్ చేసిన అండర్సన్ ఇప్పుడు కూడా మళ్లీ అదే కోహ్లి వికెట్‌పై గురి పెట్టాడు. క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఆ పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చక్కటి బంతులతో పదే పదే కట్టడి చేశాక చివరకు 43 బంతులు వేసిన తర్వాత అండర్సన్‌కు కోహ్లిని ఔట్ చేసే అద్భుత అవకాశం వచ్చింది. 21 పరుగుల వద్ద ఆడుతున్న కోహ్లి ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను రెండో స్లిప్‌లో మలాన్ వదిలేయడంతో ఈ పోరు చాలించి అండర్సన్ తన స్పెల్ ముగించాడు. కోహ్లి రావడానికి ముందు వరుసగా 7 ఓవర్లు బౌలింగ్ చేసిన జిమ్మీ, ఆ తర్వాత కోహ్లిని పడగొట్టే ఆలోచనతో మరో 8 ఓవర్ల పాటు తన శక్తిని వెచ్చించాడు. మున్ముందు సుదీర్ఘ సిరీస్ గురించి ఆలోచించకుండా 36 ఏళ్ల వయసులో అతను తీవ్రంగా శ్రమించాడు. సుదీర్ఘ స్పెల్ నుంచి విరామం తీసుకున్న అనంతరం మరో 17 ఓవర్ల తర్వాత అండర్సన్ మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. మరో 7 ఓవర్ల పాటు పదే పదే కోహ్లిని ఇబ్బంది పెట్టగలిగినా... వికెట్ మాత్రం దక్కలేదు. -
'రూట్' మూసేశారు...
ఐదు టెస్టుల సిరీస్‌కు ఆరంభం ఎలా ఉండాలని భారత్ ఆశించిందో సరిగ్గా అలాగే జరిగింది. మనోళ్లు బౌలింగ్‌లో అదరగొట్టడంతో బర్మింగ్‌హామ్ కాస్తా బాంబే మైదానంలా కనిపించింది. అశ్విన్ బంతులకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేస్తుంటే ఆడుతోంది ఇండియాలోనే అనిపించింది. సొంతగడ్డపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని అంతా తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు కనిపించిన ఇంగ్లండ్‌ను మొదటి రోజే దెబ్బ తీసి కోహ్లి సేన సిరీస్‌లో సవాల్ విసిరింది. ఒక దశలో ఇంగ్లండ్ స్కోరు 216/3. రూట్, బెయిర్‌స్టో అలవోకగా బ్యాటింగ్ చేస్తూ 104 పరుగులు జోడించారు. కానీ రూట్ చేసిన పొరపాటుకు ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. లేని పరుగుకు ప్రయత్నించి అతను రనౌట్ కావడంతో భారత్‌కు ‘దారి’ తెరచుకుంది. ఈ అవకాశాన్ని టీమిండియా వృథా చేయలేదు. 1000వ టెస్టు జ్ఞాపికను సరిగా అందుకోలేక ఈసీబీ చైర్మన్ పడేసి రెండు ముక్కలు చేయగానే మొదలైన అశుభం ఇంగ్లండ్‌ను రోజంతా వెంటాడినట్లుంది. బర్మింగ్‌హామ్: అంచనాలకు మించి రాణించిన భారత్ తొలి రోజు ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ బుధవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. జో రూట్ (156 బంతుల్లో 80; 9 ఫోర్లు), బెయిర్‌స్టో (88 బంతుల్లో 70; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడం మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆఖరి ఓవర్లో కరన్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ దినేశ్ కార్తీక్ వదిలేయడంతో భారత్‌కు చివరి వికెట్ దక్కలేదు. చివరి సెషన్లోనే భారత్ ఆరు వికెట్లు తీయడం విశేషం. బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయిన పిచ్‌పై ఇంగ్లండ్ స్వయంకృతంతో కుప్పకూలింది. ఇదే వికెట్‌పై రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ సత్తా చాటితే ఈ టెస్టుపై పట్టు బిగించడం కష్టం కాబోదు. రూట్ జోరు... టాస్ గెలిచిన ఇంగ్లండ్‌కు తొలి రోజు ఆశించిన ఆరంభం లభించలేదు. సీనియర్ బ్యాట్స్‌మెన్ కుక్ (13) తన ఆటతో మళ్లీ నిరాశపర్చాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లోనే అశ్విన్‌ను బౌలింగ్‌కు దించి భారత్ ఫలితం సాధించింది. తన రెండో ఓవర్లోనే అశ్విన్ చక్కటి బంతితో కుక్‌ను బౌల్డ్ చేశాడు. కుక్‌ను అశ్విన్ ఔట్ చేయడం ఇది ఎనిమిదో సారి కావడం విశేషం. అంతకుముందు ఇషాంత్ బౌలింగ్‌లో 9 పరుగుల వద్ద నాలుగో స్లిప్‌లో రహానే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కీటన్ జెన్నింగ్స్ (98 బంతుల్లో 42; 4 ఫోర్లు), కెప్టెన్ రూట్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నా వీరిద్దరు ఎలాంటి ప్రమాదం లేకుండా తొలి సెషన్‌ను ముగించగలిగారు. అయితే లంచ్ తర్వాత షమీ జోరుతో పరిస్థితి ఒక్కసారిగా భారత్‌కు అనుకూలంగా కనిపించింది. రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం తర్వాత జెన్నింగ్స్ దురదృష్టవశాత్తూ వెనుదిరిగాడు. షమీ వేసిన బంతిని జెన్నింగ్స్ డిఫెన్స్ ఆడగా... అతని కాలికి తగిలి స్టంప్‌పై పడిన బంతి మెల్లగా బెయిల్‌ను గిరాటేసింది. కొద్ది సేపటికి మలాన్ (8) కూడా షమీ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో రూట్, బెయిర్‌స్టో సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో 107 బంతుల్లో రూట్ అర్ధ సెంచరీ పూర్తయింది. రెండో సెషన్లో మరో వికెట్ తీసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టపటపా... చివరి సెషన్‌ను ఇంగ్లండ్ దూకుడుగా ప్రారంభించింది. పాండ్యా ఓవర్లలో రూట్, బెయిర్‌స్టో వరుసగా రెండేసి ఫోర్లు బాదారు. ఈ క్రమంలో 72 బంతుల్లోనే బెయిర్‌స్టో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయితే ఈ భాగస్వామ్యం వంద పరుగులు దాటిన తర్వాత ఇంగ్లండ్ చేజేతులా వికెట్లు అందించి భారత్ శిబిరంలో ఆనందం నింపింది. రూట్ రనౌట్ జట్టు పతనానికి దారి తీసింది. అశ్విన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో మిడ్ వికెట్ దిశగా ఆడగా సింగిల్ పూర్తయింది. అయితే వీరిద్దరు లేని రెండో పరుగు కోసం సాహసం చేశారు. చురుగ్గా స్పందించిన కోహ్లి బంతిని అందుకొని నాన్‌స్ట్రయికింగ్ వికెట్లపై నేరుగా కొట్టడంతో రూట్ వెనుదిరిగాడు. కోహ్లి ‘డ్రాప్ ద మైక్’ సంబరాలతో రూట్‌ను సాగనంపాడు. కొద్ది సేపటికే ఉమేశ్ బంతిని బెయిర్‌స్టో వికెట్లపైకి ఆడుకోగా... బట్లర్ (0)ను అశ్విన్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఈ దశలో ఆదుకునే ప్రయత్నం చేసిన స్టోక్స్ (21) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. చివర్లో స్యామ్ కరన్ (24 బ్యాటింగ్) కొద్దిగా పోరాడటంతో ఇంగ్లండ్ ఆలౌట్ కాలేదు. పుజారా పనికి రాడా! ‘జట్టులో నా స్థానంపై ఢోకా లేదు’... తొలి టెస్టుకు ముందు చతేశ్వర్ పుజారా చెప్పిన మాట తప్పని తేలేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. కేఎల్ రాహుల్‌ను మూడో స్థానంలో ఆడించేందుకు భారత టీమ్ మేనేజ్మెంట్ పుజారాను పక్కన పెట్టింది. సాంకేతికంగా మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న టెస్టు స్పెషలిస్ట్‌ను ఆడించకపోవడం అనూహ్యమే. నిజానికి తాజా ఫామ్‌ను బట్టి చూస్తే ధావన్ స్థానంలో రాహుల్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉందనిపించింది. కానీ ఎడమచేతి వాటం కావడం ధావన్‌కు కలిసొచ్చింది. డిఫెన్స్ బలంగా ఉన్నా... పుజారా అతి నెమ్మదిగా ఆడే శైలిపై ఎప్పటినుంచో కోహ్లి, శాస్త్రికి సందేహాలు ఉన్నాయి. రాహుల్‌కు కూడా మంచి టెక్నిక్ ఉండటంతో పాటు అవసరమైతే ధాటిగా ఆడగలడు కాబట్టి అతనికి ప్రాధాన్యత లభించింది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహకంగా బాగుంటుందని కౌంటీల్లో ఆడిన పుజారాకు అదే నష్టం చేసినట్లుంది. ఎందుకంటే ఈ సీజన్లో కౌంటీల్లో ఆడిన 12 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను కేవలం 14.33 సగటుతో 172 పరుగులు మాత్రమే చేశాడు. పైగా 12 ఇన్నింగ్స్‌లో 8 సార్లు బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం పుజారా డిఫెన్స్‌పై కూడా సందేహాలు రేకెత్తించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో అతను పట్టుదలగా ఆడి చేసిన అర్ధ సెంచరీ భారత్ విజయానికి బాటలు పరచిన విషయాన్ని మరుగున పడేసింది. పుజారాను పక్కన పెట్టే స్థాయిలో అతను విఫలం కాలేదనేది వాస్తవం. పైగా ముగ్గురు ప్రధాన పేసర్లు తుది జట్టులో ఉన్నప్పుడు పాండ్యా అవసరం పెద్దగా లేదు. అతడిని తప్పించైనా రెగ్యులర్ బ్యాట్స్‌మన్ పుజారాకు చోటు కల్పిస్తే సరిపోయేది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సమరానికి సైరన్
ఆటగాళ్ల సవాళ్లు, ప్రతిసవాళ్లు లేవు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, స్పందనలు కనిపించలేదు. పిచ్‌లు, వాతావరణంపై చర్చ జరిగినా, క్రికెటర్లు మాత్రం దీనిని పట్టించుకోవడం లేదు. ఇరు జట్లు కేవలం తమ బలం, బలగాన్నే నమ్ముకున్నాయి. అన్నీ పక్కన పెట్టి ఆటపై మాత్రమే దృష్టి పెట్టాయి. నాలుగేళ్ల క్రితం నాటి పరాజయాలను మరచిపోయే ప్రదర్శన చేయాలని ఒక జట్టు... రెండేళ్ల క్రితం చిత్తుగా ఓడించిన ప్రత్యర్థిని సొంతగడ్డపై పడగొట్టాలని మరో జట్టు... ఈ నేపథ్యంలో ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అసలు సమరానికి రంగం సిద్ధమైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సరిగ్గా ఆరు వారాల వ్యవధిలో జరిగే ఐదు టెస్టులు సంప్రదాయ క్రికెట్ మజాను అందించనున్నాయి. టాప్ ర్యాంకర్ భారత్, ఐదో ర్యాంక్ టీమ్ ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ పోరులో అంతిమ విజేత ఎవరో వేచి చూడాలి. బర్మింగ్‌హామ్: సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు ఉండే ప్రాధాన్యతే వేరు. ఇక్కడ గెలిచి శుభారంభం చేస్తే మానసికంగా ఆ జట్టు బలం రెట్టింపవుతుంది. విదేశీ గడ్డపై మొదటి మ్యాచ్‌లో వెనుకబడి భారత్ సిరీస్‌లో ఆధిక్యం ప్రదర్శించిన సందర్భాలు చాలా అరుదు. కాబట్టి ఈ సారైనా విజయంతో మొదలు పెట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది. భారత్, ఇంగ్లండ్ మధ్య నేటి నుంచి ఇక్కడి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలి టెస్టు జరగనుంది. మ్యాచ్‌కు ముందు రోజే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించి సిద్ధం కాగా... భారత్ మాత్రం ఇంకా ఓపెనర్లు, స్పిన్నర్ల విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయింది. కోహ్లిపైనే దృష్టి... 2014లో ఇక్కడ ఆఖరి టెస్టు ఆడిన భారత తుది జట్టు నుంచి కనీసం ఆరుగురు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో కూడా ఆడబోతున్నారు. విజయ్, పుజారా, రహానే, అశ్విన్, ఇషాంత్‌లతో పాటు విరాట్ కోహ్లి ఈ జాబితాలో ఉన్నాడు. అయితే ఎవరు ఎలా ఆడినా కోహ్లిని మాత్రం నాటి సిరీస్ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ సారి కచ్చితంగా బాగా ఆడాల్సిన స్థితిలో అతను బరిలోకి దిగుతుండగా, కెప్టెన్‌గా జట్టును గెలిపించాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉంది. వరల్డ్ టాప్ బ్యాట్స్‌మన్‌గా కోహ్లి తన స్థాయిని ప్రదర్శిస్తే భారత్ ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం. ఇద్దరు ఓపెనర్లలో విజయ్‌తో పాటు ఎడమచేతి వాటం కావడం వల్ల శిఖర్ ధావన్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే తాజా ఫామ్ మాత్రం రాహుల్ మెరుగనే చూపిస్తోంది. పుజారా మాత్రం తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోలేకపోతున్నాడు. 2014లో అందరిలాగే విఫలమైన తాను, ఇటీవల కౌంటీ క్రికెట్ ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. అనూహ్య నిర్ణయాలు తీసుకునే కోహ్లి అవసరమైతే పుజారాను కూడా పక్కన పెట్టి మూడో స్థానంలో రాహుల్‌ను ఆడించవచ్చు కూడా. ఇక రహానే కూడా తన సామర్థ్యానికి తగిన విధంగా రాణించాల్సి ఉంది. బౌలింగ్‌లో ఇద్దరు పేసర్లు ఇషాంత్, ఉమేశ్ ఉండటం ఖాయం. భువనేశ్వర్, బుమ్రా లేని లోటు కనిపించకుండా వీరిద్దరు సత్తా చాటాల్సి ఉంది. స్పిన్నర్లలో అశ్విన్ తను అనుభవాన్ని చూపిస్తే ఇంగ్లండ్‌కు ఇబ్బందులు తప్పవు. ఇంగ్లండ్ ఒకే స్పిన్నర్‌కు పరిమితమైన నేపథ్యంలో భారత్ రెండో స్పిన్నర్‌ను దించి సాహసం చేస్తుందా, మూడో పేసర్‌ను తీసుకుంటుందా చూడాలి. పాండ్యాను మూడో సీమర్‌గా భావిస్తే కుల్దీప్కు అవకాశం దక్కవచ్చు. అయితే ఇప్పటి వరకు డ్యూక్ బంతులతో బౌలింగ్ చేయని కుల్దీప్ ఏమాత్రం ప్రభావం చూపిస్తాడనేది ఆసక్తికరం. రషీద్ ఎంపిక... బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ ప్రధానంగా ఇద్దరు ఆటగాళ్లపై ఆధార పడుతోంది. సీనియర్ ఓపెనర్ అలిస్టర్ కుక్, కెప్టెన్ జో రూట్ ఆ జట్టు భారాన్ని మోస్తున్నారు. ఇతర బ్యాట్స్‌మెన్ కూడా రాణించే అవకాశం ఉన్నా... కుక్, రూట్ మాత్రం టెస్టు స్వరూపాన్ని మార్చగలరు. బెయిర్ స్టో మంచి ఫామ్‌లో ఉండగా, లోయర్ ఆర్డర్లో బట్లర్ బ్యాటింగ్ అదనపు బలం కాగలదు. జెన్నింగ్స్, మలాన్ ఏమాత్రం భారత్‌పై ఆధిక్యం కనబర్చగలరనేది చెప్పలేం. మరోసారి పేస్ ద్వయం అండర్సన్, బ్రాడ్లపై అదనపు భారం పడింది. ఆరంభంలో వీరిద్దరు టీమిండియా వికెట్ల తీయగలిగితే మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మారిపోవచ్చు. కొంత కాలంగా మరీ అద్భుతమైన ఫామ్‌లో లేకున్నా... అనుభవంతో పాటు సొంతగడ్డపై అండర్సన్, బ్రాడ్ ఎప్పుడైనా ప్రమాదకరమే. మంచి స్వింగ్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్యామ్ కరన్‌ను తుది జట్టులో ఎంపిక చేసి ఇంగ్లండ్ మూడో పేసర్ వైపే మొగ్గు చూపింది. ఒకే స్పిన్నర్‌గా ఆదిల్ రషీద్‌కే చోటు దక్కడం విశేషం. వివాదాస్పద రీతిలో జట్టులో చోటు దక్కించుకున్న రషీద్‌పై కచ్చితంగా రాణించాలనే ఒత్తిడి ఉండటం భారత్‌కు కలిసి రావచ్చు. 2014లో భారత్‌పై చెలరేగిన ఆల్‌రౌండర్ మొయిన్ అలీని మాత్రం ఇంగ్లండ్ ఎంపిక చేయకపోవడం విశేషం. 10 వేల సీట్లు ఖాళీ! భారత్–ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్‌పై కౌంటీ జట్ల అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం టిక్కెట్ల అమ్మకాలపై పడుతోందని వాపోతున్నారు. బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే టెస్టుకు మొదటి రెండు రోజుల పాటు 10 వేల టిక్కెట్లు అమ్ముడుకాకుండా మిగిలిపోయాయని చెబుతున్నారు. సహజంగా టెస్టులు గురువారం నుంచి ప్రారంభం కావాలని కౌంటీలు కోరుకుంటాయి. తద్వారా సెలవు రోజులైన శని, ఆదివారాల నాటికి మ్యాచ్‌లు మూడు, నాలుగో రోజుకు చేరుతాయి. రసవత్తర పోరాటాలను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అభిమానులు మైదానానికి భారీగా వస్తారు. కానీ, ప్రస్తుత సిరీస్‌లో రెండు, నాలుగో టెస్టులు మాత్రమే గురువారం మొదలవుతున్నాయి. మూడో టెస్టు శనివారం (ఆగస్టు 18), అయిదో టెస్టు శుక్రవారం (సెప్టెంబరు 7) నుంచి జరుగనున్నాయి. ‘మొత్తమ్మీద 70 వేల టిక్కెట్లు మాత్రమే అమ్మగలిగాం. తొలి రెండు రోజులకు సంబంధించిన విక్రయాలు మేం ఆశించినంతగా లేవు. బుధవారం నుంచి ప్రారంభమే దీనికి కారణం. ఈ సిరీస్ షెడ్యూల్‌పై చర్చ రేకెత్తించనుంది’ అని బర్మింగ్‌హామ్ కౌంటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీల్ స్నోబాల్ వ్యాఖ్యానించాడు. ►ఈ మైదానంలో భారత్ ఆరు టెస్టులు ఆడింది. ఐదింటిలో ఓడిపోయి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ►ఇంగ్లండ్ జట్టుకు ఇది 1000వ టెస్టు. 999 టెస్టుల్లో ఇంగ్లండ్ 357 గెలిచి, 297 ఓడింది. మరో 345 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 15 మార్చి, 1877లో మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో తమ తొలి టెస్టు ఆడిన ఇంగ్లండ్ 45 పరుగులతో ఓడింది. సొంతగడ్డపై 510 టెస్టులు ఆడిన ఆ జట్టు 213 గెలిచి, 119 ఓడింది. మరో 178 టెస్టులు డ్రా అయ్యాయి. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, ధావన్, రాహుల్/పుజారా, రహానే, కార్తీక్, పాండ్యా, అశ్విన్, ఉమేశ్, ఇషాంత్, కుల్దీప్/షమీ. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), కుక్, జెన్నింగ్స్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, రషీద్, కరన్, బ్రాడ్, అండర్సన్. పిచ్, వాతావరణం గత కొద్ది రోజులుగా విపరీతమైన ఎండల వల్ల పొడిబారి ఎడ్జ్‌బాస్టన్ వికెట్ భారత్‌లోలాగే కనిపిస్తోందని అన్ని వైపుల నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. అయితే మ్యాచ్‌కు ముందు రోజు పిచ్ మరీ అలా ఏమీ లేదు. నిరంతరాయంగా నీళ్లు చల్లడంతో పిచ్‌లో జీవం ఉంది. ఆరంభంలో పేస్, స్వింగ్‌కు అనుకూలించవచ్చు. ఊహించినదానికి భిన్నంగా స్పిన్ ప్రభావం తక్కువ కావచ్చు. వాతావరణం బాగుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. భారత్(vs) ఇంగ్లండ్ తొలి టెస్టు మధ్యాహ్నం గం. 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లో ప్రత్యక్ష ప్రసారం -
మొదటి టెస్టే కీలకం
ఈ సంవత్సరం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల రూపంలో టీమిండియాకు మూడు సవాళ్లతో ప్రారంభమైంది. వీటిని అధిగమిస్తే టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకుకు నిజంగా అర్హులేనని క్రికెట్ ప్రపంచం మొత్తం అభిప్రాయానికి వచ్చేది. చరిత్రలో ఏ భారత జట్టుకూ సాధ్యం కాని దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో టెస్టు సిరీస్ విజయాలను సాధించగలిగితే ప్రతి ఒక్కరూ ఈ జట్టు ప్రపంచ అత్యుత్తమమని ఒప్పుకునేవారు. అయితే, దక్షిణాఫ్రికా పర్యటన రూపంలో మొదటి సవాల్లో విఫలమయ్యారు. ఇందుకు ప్రధాన కారణం సరైన ఆలోచన లేని షెడ్యూల్. అక్కడకు చేరిన వారం వ్యవధిలోనే సఫారీలతో తొలి టెస్టు ఆడి చిన్న లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. బ్యాటింగ్ వైఫల్యంతో రెండో టెస్టులో పరాజయం పాలయ్యారు. మూడో టెస్టుకు మాత్రం పక్కాగా సన్నద్ధమయ్యారు. అనూహ్యంగా బౌన్స్ అవుతున్న పిచ్‌పైనా బ్యాట్స్‌మెన్ రాణించగా, బౌలర్లు తమ ఫామ్‌ను కొనసాగిస్తూ దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ చేయకుండా అడ్డుకున్నారు. టి20లు, వన్డే సిరీస్‌ల కోసం ఇప్పుడు జట్టు నెల రోజులకు పైగా ఇంగ్లండ్‌లోనే ఉంది. తెల్ల బంతితోనే ఆ మ్యాచ్‌లన్నీ ఆడినా, వాతావరణం, పిచ్‌లకు ఆటగాళ్లు అలవాటై ఉంటారు. అసలు ప్రశ్నేంటంటే... టెస్టుల్లో ఆడే ఎర్ర బంతిని ఎదుర్కోవడానికి ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ సరిపోతుందా అని? గత నెలంతా వాతావరణం భారత్ కంటే ఎక్కువ ఎండగా ఉన్నా, రెండ్రోజులుగా మారుతోంది. వర్షం పడుతోంది. ఇదిలాగే కొనసాగితే, కొత్త బంతి బౌలర్లకు పండుగే. బంతి కూడా వేగంగా కదులుతుంది కాబట్టి పేసర్లు భారీ స్పెల్స్ వేసేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రారంభ టెస్టు ఫలితం మిగతా సిరీస్ అంతా కనిపిస్తుంది కాబట్టి, ఐదుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఫార్ములానా?, ఇందులో ఇద్దరు స్పిన్నర్లు ఉండాలా? అని భారత జట్టు మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతుండొచ్చు. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌తోనే ఆడినా, టెస్టుల్లో శతకాలు బాదిన అశ్విన్, హార్దిక్ పాండ్యాలు జట్టుకు అదనపు బలం. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సైతం టెస్టుల్లో సెంచరీ చేశాడు. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ తర్వాత కార్తీక్ ఆరో స్థానంలో ఆడితే, పాండ్యా, అశ్విన్ అతడిని అనుసరిస్తారు. ఇలాగైతే రెండో స్పిన్నర్‌గా కుల్దీప్ను తీసుకోవచ్చు. ఇదంతా మ్యాచ్ రోజు ఉదయం పిచ్ స్వభావాన్ని పరిశీలించాక తేలుతుంది. పచ్చిక ఎక్కువగా ఉంటే, మరో పేసర్‌ను ఎంచుకుని కుల్దీప్ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఏదేమైనా, తొలి టెస్టు ఓడామనే వెనుకబాటును తప్పించుకునేందుకు సరైన కూర్పు ముఖ్యం. లేదంటే సెప్టెంబరు వరకు సాగే పోరాటంలో పైచేయి సాధించడం కష్టం. -
ఐర్లాండ్‌తో టెస్టు: పాకిస్తాన్ 268/6
డబ్లిన్: అరంగేట్ర టెస్టులోనే ఐర్లాండ్ ఆకట్టుకుంది. పాకిస్తాన్‌ను ఆ జట్టు కట్టడి చేసింది. వర్షంతో తొలి రోజు ఆట రద్దవగా, రెండో రోజు శనివారం బ్యాటింగ్‌కు దిగిన పాక్... ఐర్లాండ్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్లో అసద్ షఫీఖ్ (62; 8 ఫోర్లు) నిలిచినా ఓపెనర్లు అజహర్ అలీ (4), ఇమాముల్ హక్ (7)తో పాటు సొహైల్ (31; 2 ఫోర్లు), ఆజమ్ (14), కెప్టెన్ సర్ఫరాజ్ (20) విఫలమయ్యారు. దీంతో జట్టు 159 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. షాదాబ్ ఖాన్ (52 బ్యాటింగ్), అష్రఫ్ (61 బ్యాటింగ్) దూకుడుతో ఆట ముగిసే సమయానికి 76 ఓవర్లలో 6 వికెట్లకు 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో రాన్‌కిన్ రెండు దేశాల తరఫున టెస్టు క్రికెట్ ఆడిన 15వ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. -
యాషెస్‌కు వేళాయె...
క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికర పోరుకు రేపటి నుంచి తెరలేవనుంది. దాయాదులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య 2017–18 యాషెస్ సిరీస్ తొలి టెస్టు మ్యాచ్ గురువారం బ్రిస్బేన్‌లో ప్రారంభం కానుంది. జో రూట్, స్టీవ్ స్మిత్ రూపంలో ప్రపంచ టాప్ క్రికెటర్లు కెప్టెన్లుగా ఉన్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈసారి యాషెస్ మరింత ఆసక్తికరం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టుదే కాస్త పైచేయిగా ఉన్నా... సొంతగడ్డపై ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. 2013లో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 0–5తో మట్టికరిపించిన కంగారూలు... 2015లో ఇంగ్లండ్ గడ్డపై 2–3తో సిరీస్‌ను కోల్పోయారు. ఈసారి సొంతగడ్డపై లెక్క సరిచేయాలని స్మిత్ బృందం భావిస్తోంది. అయితే కొంతకాలంగా స్మిత్ జట్టు పేలవమైన ఫామ్‌లో కొనసాగుతోంది. ఈ ఏడాది భారత పర్యటనలో దారుణమైన ఓటమిని చవిచూసిన ఆసీస్... యాషెస్ సిరీస్ విజయంతో కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది. అటు ఇంగ్లండ్ కూడా గత సిరీస్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. – సాక్షి క్రీడావిభాగం ఇంగ్లండ్ కూర్పు బాగున్నా... జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు కూర్పు బాగానే ఉన్నప్పటికీ బెన్ స్టోక్స్ వంటి నాణ్యమైన ఆల్‌రౌండర్ కొరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. కుక్, అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీ వంటి అనుభవజ్ఞులకు తోడు యువ ఆటగాళ్లతో సమతూకంగా ఉంది. అయితే ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆడుతున్నప్పడు బెన్ స్టోక్స్ వంటి అద్భుతమైన ఆల్‌రౌండర్ అవసరం చాలా ఉంటుంది. తాజా యాషెస్ సిరీస్ కోసం స్టోక్స్ పేరును ఈసీబీ ప్రకటించినప్పటికీ.. ఓ కేసు విచారణ పెండింగ్‌లో ఉండటంతో అతడిని తప్పించాల్సి వచ్చింది. దీంతో అండర్సన్ వైస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు. స్టోక్స్ స్థానంలో ఫిన్ వచ్చినా... ప్రాక్టీస్ గేమ్‌లో అతనూ గాయపడ్డాడు. కెప్టెన్‌గా తొలి యాషెస్ ఆడుతోన్న రూట్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకం. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్‌లను గెలుచుకుని ఊపు మీదున్న ఇంగ్లండ్‌కు ఈ సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే సిరీస్ ‘డ్రా’ చేసుకోగలిగినా ఇంగ్లండ్ జట్టు యాషెస్ ట్రోఫీని నిలబెట్టుకుంటుంది. స్మిత్‌కు సవాల్.... సారథిగా తొలి యాషెస్ ఆడనున్న స్మిత్‌కు ఈ సిరీస్ అత్యంత ప్రతిష్టాత్మకం. ఇటీవలి కాలంలో పరాజయాలతో ఆగ్రహంగా ఉన్న అభిమానులను శాంతింపజేసేందుకు స్వదేశంలో విజయం చాలా అవసరం. హాజిల్‌వుడ్, స్టార్క్, కమిన్స్ వంటి వారితో ఆసీస్ బౌలింగ్ బలంగానే ఉంది. స్మిత్, షాన్ మార్‡్షలు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌కు బలం. ఏడేళ్ల విరామం తర్వాత వికెట్ కీపర్ టిమ్ పైన్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అయితే... ప్రాక్టీస్ సందర్భంగా వార్నర్ మెడకు గాయమైంది. ఈ వార్త ఆసీస్‌ను కలవరపెడుతోంది. ►యాషెస్ సిరీస్ ఫలితాలు ఆయా దేశాల్లో హీరోలను విలన్లుగా... విలన్లను హీరోలుగా చేస్తాయనేది వాస్తవం. యాషెస్ చరిత్రలో చాలా మంది క్రికెటర్లు యాషెస్ ఓటమితో వారి వారి దేశాల్లో రాత్రికిరాత్రే హీరోలుగా లేదా విలన్లుగా మారిన సంఘటనకు కోకొల్లలు. మహామహులైన కెప్టెన్లు సైతం యాషెస్ కారణంగా తమ బాధ్యతలను వదులుకోవాల్సి వచ్చింది. అందుకే యాషెస్ ఇరుదేశాలకు అత్యంత ప్రతిష్టాత్మకం. ►హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించే యాషెస్‌కు ముందే ఇరుజట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది ప్రతి యాషెస్‌కు ముందు సహజమే అయినా ఈసారి ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని వేడెక్కించాయి. ‘ఈ సిరీస్ తర్వాత చాలామంది ఇంగ్లండ్ ప్లేయర్ల కెరీర్లు ముగిసిపోతాయం’టూ లయన్ వ్యాఖ్యానించాడు. గత సిరీస్‌ల తర్వాత ఇంగ్లండ్ జట్టులో జరిగిన మార్పులను ఉదహరించాడు. కంగారూల బౌలింగ్ వేగాన్ని చూసి రూట్ జట్టు భయపడుతోందన్నాడు. ► ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 69 టెస్టు సిరీస్‌లు జరగ్గా... ఇరుజట్లు చెరో 32 సిరీస్‌లను సొంతం చేసుకొని.. ఐదు సిరీస్‌లను డ్రా చేసుకున్నాయి. ‘యాషెస్’ మ్యాచ్‌ల విషయానికొస్తే... మొత్తం 341 టెస్టు మ్యాచులు జరగ్గా... ఆస్ట్రేలియా 140, ఇంగ్లండ్ 108 మ్యాచుల్లో గెలిచాయి. 93 ‘డ్రా’గా ముగిశాయి. -
రెండో రోజూ అదే తీరు
► 21 ఓవర్లు 57 పరుగులు ► 2 వికెట్లు వర్షంతో దాదాపుగా తుడిచి పెట్టుకుపోయిన ఆట... మళ్లీ శ్రీలంక బౌలింగ్ మెరుపులు... మరో ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యం... నేనున్నానంటూ పట్టుదల చూపించిన పుజారా... క్యాలెండర్లో తేదీ మారడం తప్ప ఈడెన్ గార్డెన్స్‌లో సీన్ మారలేదు. తొలి టెస్టు మొదటి రోజులాగే రెండో రోజు ఆట కూడా వాన కారణంగా అవాంతరం ఎదుర్కొని చివరకు అర్ధాంతరంగానే ఆగిపోయింది. తొలి రోజు లక్మల్ దెబ్బకు అల్లాడిన భారత్ మరో పేసర్ షనకకు రెండు వికెట్లు అప్పగించింది. అయితే ఒక ఎండ్‌లో గోడలా నిలబడ్డ పుజారా కొన్ని చక్కటి షాట్లతో అలరించడం విశేషం. కోల్‌కతా: భారత్, శ్రీలంక తొలి టెస్టును వర్షం వెంటా డుతోంది. వరుసగా రెండో రోజు కూడా మ్యాచ్ వాన బారిన పడటంతో కేవలం 21 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (102 బంతుల్లో 47 బ్యాటింగ్; 9 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత్ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రహానే (4), అశ్విన్ (4) వికెట్లు కోల్పోయింది. పేసర్ షనక ఈ రెండు వికెట్లు తీశాడు. షనక వంతు... ఓవర్‌నైట్ స్కోరు 17/3తో భారత్ తమ ఇన్నింగ్స్‌ను శుక్రవారం కొనసాగించింది. అయితే పిచ్ తొలి రోజులాగే సీమ్‌కు అనుకూలంగా ఉండటంతో లంక కెప్టెన్ చండిమాల్ అదే వ్యూహాన్ని అనుసరించాడు. వికెట్‌పై ఉన్న పచ్చికను ఉపయోగించుకునే ప్రయత్నంలో ఒక ఎండ్‌లో ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో, మరో ఎండ్ నుంచి మీడియం పేసర్ షనకతో బౌలింగ్ చేయించాడు. ఇది లంకకు మంచి ఫలితాన్ని అందించింది. లక్మల్ బౌలింగ్‌లో అదృష్టవశాత్తూ లభించిన బౌండరీతో రహానే ఖాతా తెరిచాడు. వరుసగా 46 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వని లక్మల్ ఇచ్చిన తొలి పరుగులు ఇవి! అయితే కొద్ది సేపటికే షనక బౌలింగ్‌లో దూరంగా వెళుతున్న బంతిని డ్రైవ్ చేయబోయిన రహానే కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత అశ్విన్ కూడా ఇదే తరహాలో ఆడబోయి బ్యాక్వర్డ్ పాయింట్లో కరుణరత్నే క్యాచ్‌తో వెనుదిరిగాడు. మరో 6.5 ఓవర్ల తర్వాత వాన రావడంతో మ్యాచ్ పూర్తిగా ఆగిపోయింది. 2010లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ తర్వాత భారత జట్టు సొంతగడ్డపై 50 పరుగుల లోపే 5 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. బౌండరీల జోరు... ఇతర బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన కనబర్చినా పుజారా తనదైన శైలిలో పట్టుదలను ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లోని వాతావరణ పరిస్థితుల తరహాలోనే ఉండే కౌంటీ క్రికెట్లో ఇటీవలే నాటింగ్హామ్షైర్కు ప్రాతినిధ్యం వహించిన పుజారాకు ఆ అనుభవం ఇక్కడ పనికొచ్చింది. దుర్భేద్యమైన డిఫెన్స్‌ను ప్రదర్శించిన పుజారా చెత్త బంతులను మాత్రమే బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో 24 పరుగుల వద్ద ఆడుతున్నప్పుడు గమగే విసిరిన బౌన్సర్ కుడి బొటన వేలికి బలంగా తగలడంతో అతను చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది కూడా. షనక తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన పుజారా, ఆ తర్వాత అతని బౌలింగ్‌లోనే మరో రెండు బౌండరీలు బాదాడు. చండిమాల్ పార్ట్‌టైమర్ కరుణరత్నేతో బౌలింగ్ చేయించగా... పుజారా రెండు చక్కటి ఫోర్లతో ఆధిపత్యం ప్రదర్శించాడు. కరుణరత్నే ఓవర్లోనే సాహా కూడా మరో ఫోర్ కొట్టాడు. సీనియర్ స్పిన్నర్ హెరాత్‌తో కనీసం ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం ఈ పిచ్‌పై శ్రీలంకకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. ► 46 తొలి పరుగు ఇవ్వడానికి ముందు లక్మల్ విసిరిన డాట్ బంతులు. 2001లో ఆస్ట్రేలియాతో జెరోమ్ టేలర్ (వెస్టిండీస్) 40 బంతుల తర్వాత తొలి పరుగు ఇవ్వగా...మళ్లీ ఇంత పొదుపైన బౌలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఆగని వాన... తొలి రోజు వృథా అయిన సమయాన్ని సరిదిద్దేందుకు రెండో రోజు శుక్రవారం ఆటలో అర గంట సమయాన్ని తొలి, చివరి సెషన్లో 15 నిమిషాల చొప్పున సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. దాంతో ఉదయం 9.15కే ఆట ప్రారంభమైంది. అయితే వర్షం ముంచెత్తడంతో 11 గంటలకు ఆట ఆగిపోయింది. దాంతో నిర్ణీత సమయానికి పది నిమిషాల ముందు 11.20కు అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని సార్లు వాన తెరిపినిచ్చినా ఆటకు అనుకూల వాతావరణం మాత్రం ఏర్పడలేదు. మధ్యాహ్నం 2.10 గంటలకు వర్షం మరింత పెరిగింది. దాంతో మరో 20 నిమిషాల తర్వాత రెండో రోజు ఆటను పూర్తిగా రద్దు చేసేశారు. -
ఆధిక్యంలో పాకిస్తాన్
రెండో ఇన్నింగ్స్‌లో 214/8 లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ 281 పరుగుల ఆధిక్యంతో పటిష్ట స్థితిలో నిలిచింది. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 214 పరుగులు చేసింది. వోక్స్ (5/31) విజృంభణతో 60 పరుగులకే నాలుగు వికెట్లు పడినా షఫీఖ్ (49), సర్ఫరాజ్ (45) ఆదుకున్నారు. క్రీజులో యాసిర్ షా (30 బ్యాటింగ్), ఆమిర్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 272 పరుగులకే ఆలౌట్ కావడంతో పాక్‌కు 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. లెగ్ స్పిన్నర్ యాసిర్ షా (6/72) ఇంగ్లండ్ వెన్ను విరిచాడు. గత 49 ఏళ్లలో లార్డ్స్ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి లెగ్‌స్పిన్నర్‌గా యాసిర్ షా నిలిచాడు. ఆమిర్, రాహత్, రియాజ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. -
పటిష్టస్థితిలో ఇంగ్లండ్
డర్బన్: బౌలర్లతోపాటు బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో... దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ పటిష్టస్థితికి చేరుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 172 పరుగులు చేసింది. జో రూట్ (60 బ్యాటింగ్; 4 ఫోర్లు, ఒక సిక్స్), జేమ్స్ టేలర్ (24 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. దాంతో కుక్ బృందం ఓవరాల్ ఆధిక్యం 261 పరుగులకు చేరింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 137/4తో తొలి ఇన్నింగ్స్ ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 81.4 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటవ్వడంతో ఇంగ్లండ్‌కు 89 పరుగుల ఆధిక్యం దక్కింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ (118 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ సెంచరీ సాధించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ (4/25), స్పిన్నర్ మొయిన్ అలీ (4/69) రాణించారు. -
తొలి రోజే 'తమాషా'
►మొహాలీలో స్పిన్ తంత్రం ►ఒకే రోజు 12 వికెట్లు ►భారత్ 201 ఆలౌట్ ►దక్షిణాఫ్రికా 28/2 ఓ టెస్టు మ్యాచ్ తొలి రోజే 12 వికెట్లు... కొత్త బంతితో స్పిన్నర్ మొదటి ఓవర్ బౌలింగ్ చేయడం... బంతి ఎటు పడి ఎటు తిరుగుతుందో... ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో బ్యాట్స్‌మెన్... అంతా తమాషా..! టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 201 పరుగులకే ఆలౌట్... ఇప్పటివరకూ 17 టెస్టులాడినా పది వికెట్లు తీయలేకపోయిన ఓ పార్ట్‌టైమ్ స్పిన్నర్‌కు నాలుగు వికెట్లు... క్రీజులో ఉన్న సహచరుడు ఏ క్షణంలోనైనా రావచ్చని బయట మరో ఇద్దరు ప్యాడ్లతో సిద్ధంగా ఉండటం... అంతా తమాషా..! అవును... మొహాలీ పిచ్‌పై స్పిన్నర్ల హవాను ఊహించినా... మరీ ఈ స్థాయిలో తొలి రోజే పిచ్ ఇలా స్పందిస్తుందనేది ఎవరి ఊహకూ అందని విషయం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ మ్యాచ్ నాలుగోరోజుకు చేరితేనే గొప్ప. మొత్తానికి ‘ఫ్రీడమ్ సిరీస్’లోతొలి రోజే పలు మలుపులు. మొహాలి: ఆటగాళ్ల ప్రదర్శనకంటే పిచ్ గురించి ఎక్కువగా చర్చ సాగిన తొలి టెస్టులో పిచ్ తన పని తాను పూర్తి చేసింది. గింగిరాలు తిరిగే స్పిన్‌తో ఇక్కడి పీసీఏ స్టేడియంలో తొలి రోజే 12 వికెట్లు నేలకూలగా, అందులో 9 స్పిన్నర్లే తీశారు. గురువారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే కుప్పకూలింది. ఒంటరి పోరాటం చేసిన మురళీ విజయ్ (136 బంతుల్లో 75; 12 ఫోర్లు)కు తోడు చివర్లో జడేజా (92 బంతుల్లో 38; 4 ఫోర్లు) కాస్త ప్రతిఘటించడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌తో డీన్ ఎల్గర్ (4/22) సంచలన ప్రదర్శన చేయగా, తాహిర్, ఫిలాండర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా కూడా భారత స్పిన్ ముందు తీవ్రంగా ఇబ్బంది పడింది. 20 ఓవర్ల పాటు ఆడిన ఆ జట్టు కేవలం 28 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఎల్గర్ (13 బ్యాటింగ్), ఆమ్లా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. తొలి సెషన్ కీలక భాగస్వామ్యం టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగడంతో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. అటు దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో చెలరేగిన రబడకు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. ఫిలాండర్ తన తొలి ఓవర్లోనే చక్కటి బంతితో ధావన్ (0)ను అవుట్ చేసి సఫారీలకు శుభారంభం అందించాడు. ఈ దశలో విజయ్, పుజారా (66 బంతుల్లో 31; 6 ఫోర్లు) మంచి సమన్వయంతో ఆడారు. వీరిద్దరు చక్కటి షాట్లతో ఆకట్టుకున్నారు. అయితే పార్ట్ టైమర్ ఎల్గర్‌కు ఆమ్లా బంతినివ్వడం ఆ జట్టుకు కలిసొచ్చింది. తన నాలుగో బంతికే అతను పుజారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని 63 పరుగుల భాగస్వామ్యాన్ని ముగించగా... మరో నాలుగు బంతులకే బర్త్‌డే బాయ్ కోహ్లి (1)ని అవుట్ చేసి రబడ కెరీర్లో తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవర్లు: 27, పరుగులు: 82, వికెట్లు: 3 రెండో సెషన్: ఎల్గర్ మ్యాజిక్ లంచ్ తర్వాత భారత్ కోలుకున్నట్లే కనిపించింది. పిచ్ ఎలా ఉన్నా ఇబ్బంది పడకుండా ఓపిగ్గా ఆడిన విజయ్ 115 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఎల్గర్ భారత్‌ను మళ్లీ దెబ్బ కొట్టాడు. అతని వరుస బంతుల్లో రహానే (15), సాహా (0) స్లిప్‌లో ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో కష్టాలు పెరిగాయి. విజయ్, జడేజా కొద్ది సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేసి 45 బంతుల్లో 38 పరుగులు జత చేశారు. అయితే హార్మర్ బౌలింగ్‌లో స్వీప్‌కు ప్రయత్నించి విజయ్ అవుట్ కాగా... ఆ వెంటనే మిశ్రా (6)ను కూడా ఎల్గర్ పెవిలియన్ చేర్చాడు. ఓవర్లు: 28, పరుగులు: 86, వికెట్లు: 4 మూడో సెషన్: ఉత్కంఠ బ్రేక్ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగలేదు. సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలిచిన జడేజాను ఫిలాండర్ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఒక ఎండ్‌లో అశ్విన్ (20 నాటౌట్) కొన్ని పరుగులు జోడించినా... తాహిర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్ ముగించాడు. స్పిన్ బలం చూసిన కోహ్లి మరో ఆలోచన లేకుండా అశ్విన్‌తోనే మొదటి ఓవర్ వేయించాడు. ఆ నమ్మకం నిలబెడుతూ అశ్విన్...తన నాలుగో ఓవర్లో వాన్‌జిల్ (5)ను అవుట్ చేశాడు. జడేజా తన రెండో బంతికే డు ప్లెసిస్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో భారత్ శిబిరంలో ఆనందం నెలకొంది. అనూహ్యంగా తిరుగుతున్న బంతిని అతి కష్టమ్మీద ఎదుర్కొంటూ ఎల్గర్, ఆమ్లా రోజును ముగించారు. వీరిద్దరు కలిసి 70 బంతులు ఆడి 19 పరుగులు మాత్రం జోడించగలిగారు. కోహ్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా మూడో వికెట్ దక్కలేదు. ఓవర్లు: 13, పరుగులు: 33, వికెట్లు: 3 (భారత్). ఓవర్లు: 20, పరుగులు: 28, వికెట్లు: 2 (దక్షిణాఫ్రికా) టాస్ గెలవడంతో వచ్చిన అవకాశం వృథా చేసుకున్న మాట కొంత వరకు వాస్తవం. అయితే 20 ఓవర్ల తర్వాత ప్రత్యర్థి స్కోరు చూస్తే ఇలాంటి పిచ్‌పై మా 201 చాలా పెద్ద స్కోరు. ఇప్పటికే 2 వికెట్లు తీశాం కాబట్టి మ్యాచ్ సమాన స్థితిలోనే ఉంది. బంతి నెమ్మదిగా వస్తున్న ఈ వికెట్‌పై పరుగులు చేయడం అంత సులువు కాదు. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకు కూడా ఇది సవాల్‌లాంటిదే. ఓపిగ్గా ఆడితే ఫలితం వస్తుందని విజయ్ రుజువు చేశాడు. అయితే దక్షిణాఫ్రికా చాలా చక్కటి ప్రణాళికతో బౌలింగ్ చేసింది. మా బ్యాట్స్‌మెన్ ఇప్పుడు చేసిన పొరపాట్లు తర్వాతి ఇన్నింగ్స్‌లో పునరావృతం చేయరని నమ్ముతున్నా. - సంజయ్ బంగర్, భారత బ్యాటింగ్ కోచ్ మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం ఉన్నా నా దృష్టిలో ఇదో చెత్త వికెట్. ఇక ముందు కూడా భారత్‌లో మా కోసం ఇలాంటి పిచ్లే సిద్ధం చేస్తారని అనిపిస్తోంది (వ్యంగ్యంగా). ఇప్పుడున్న స్థితిని బట్టి మ్యాచ్ ఎవరి వైపు అయినా మొగ్గవచ్చు. నాకు దక్కిన నాలుగు వికెట్ల పట్ల నేనే ఆశ్చర్యంగా ఉన్నా. అయితే భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడం సంతోషం. రెండో రోజు మాకు బ్యాటింగ్ కష్టం కావడం ఖాయం. నా కెరీర్లో ఇది కఠినమైన టెస్టు మ్యాచ్. అయితే సొంతగడ్డపై ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే భారత్ వ్యూహం ఈ సారి విఫలం కావాలని ఆశిస్తున్నా. - డీన్ ఎల్గర్, దక్షిణాఫ్రికా ఆటగాడు 2008లో దక్షిణాఫ్రికా చేతిలో 76కు ఆలౌట్ అయిన తర్వాత భారత్ సొంతగడ్డపై తొలి రోజే ఆలౌట్ కావడం ఇదే మొదటి సారి. -
లంచ్ విరామ సమయానికి భారత్ స్కోరు 105/2
భారత్-ఆస్ట్రేలియాల మధ్య మొదటి టెస్టు రసకందాయంలో పడింది. రెండో ఇన్నింగ్స్‌ను 290/5 వద్ద డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా, భారత్ ముందు 364 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్‌ను 16 పరుగులకే కోల్పోయిన టీమిండియా, రెండో వికెట్‌ను మాత్రం 57 పరుగుల వరకు కాపాడుకుంది. లంచ్ విరామ సమయానికి 2 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే మరో 259 పరుగులు అవసరం. ఓపెనర్ శిఖర్ ధవన్ 8 బంతుల్లో ఒక ఫోర్ కొట్టి 9 పరుగులు చేసి, జాన్సన్ బౌలింగ్‌లో వికెట్ల వెనక దొరికిపోయాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ మాత్రం 121 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 47 పరుగులు చేసి క్రీజును అంటిపెట్టుకుని ఉన్నాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన ఛటేశ్వర్ పుజారా 38 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసి లియన్ బౌలింగులో వికెట్ కీపర్ హాడిన్‌కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 3 ఫోర్లతో చకచకా 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విజయమో.. వీరస్వర్గమో తేల్చుకోవాల్సిన స్థితిలో భారత బ్యాట్స్‌మన్ ఉన్నారు. -
యువ ‘ముద్ర’ వేస్తారా!
కోటి ఆశలతో భారత బృందం ఇంగ్లండ్‌పై ప్రతీకారానికి సన్నద్ధం! నేటినుంచి తొలి టెస్టు మ. గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం సరిగ్గా మూడేళ్ల క్రితం... అద్భుత ఫామ్‌తో, అగ్రస్థానంతో ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన భారత క్రికెట్ జట్టు పర్యటన ముగిసే సరికి అన్నీ కోల్పోయి అవమాన భారంతో వెనుదిరిగింది. 0-4 తేడాతో ఎదురైన ఆ పరాజయం విదేశాల్లో భారత్ బలహీనతను బయట పెట్టింది. తర్వాతి ఏడాదే ఇంగ్లండ్ మన దగ్గరికి వచ్చింది. ఇంతకింతా బదులు తీర్చుకుంటామంటూ గొప్పలు పోయిన ధోనిసేన అనూహ్యంగా చేతులెత్తేసింది. సొంతగడ్డపై కూడా ఓటమితో తలదించుకునేలా చేసింది. ఇప్పుడు ప్రతీకారం అంటే ఎలా ఉండాలి? గత అనుభవాలకు రెట్టింపు సమాధానమివ్వాలి. దిమ్మ తిరిగేలా బదులు తీర్చుకోవాలి. తిరుగులేని విజయాలతో సత్తా చూపించాలి. ఇదే లక్ష్యంతో భారత కుర్రాళ్లు ఇంగ్లండ్‌లో సిరీస్‌కు సిద్ధమయ్యారు. మరి ధోనిసేన ఆశ తీరుతుందా? ఇంగ్లండ్‌ను వాళ్ల దేశంలోనే ఓడిస్తారా? నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ గడ్డపై పాత పరాభవాలను మరచి కొత్తగా విజయాల బాట పట్టేందుకు భారత క్రికెట్ జట్టు ముందు అవకాశం వచ్చింది. యువ ఆటగాళ్లతో నిండిన టీమ్ ఇప్పుడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తమ ప్రతిభను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. మరో వైపు యాషెస్‌లో చిత్తుగా ఓడిన తర్వాత ఇటీవలే శ్రీలంక చేతిలోనూ సిరీస్ కోల్పోయి ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. చాలా మంది సీనియర్లూ ఆ జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పని పట్టి, పట్టు సాధించేందుకు... పనిలో పనిగా గత పరాజయాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు కూడా ధోనిసేనకు ఇదే సరైన తరుణంగా చెప్పవచ్చు. యువ బలగమే బలం గత పర్యటనలో దిగ్గజాలు ఉన్నా... భారత జట్టుకు ఘోర పరాజయం తప్పలేదు. కానీ ఈ సారి మాత్రం జట్టు పూర్తిగా యువ ఆటగాళ్ల శక్తి సామర్థ్యాలపైనే ఆధార పడుతోంది. జట్టులోని ఆటగాళ్లలో ధోని, గంభీర్, ఇషాంత్‌లకు మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. అయితే గత మూడేళ్ల కాలంలో దూసుకొచ్చిన కోహ్లి, పుజారా జట్టుకు మూలస్థంభాలుగా నిలిచారు. వీరిద్దరికి సిరీస్ గమనాన్ని మార్చగల సత్తా ఉందంటే ఆశ్చర్యం లేదు. రహానే కూడా కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఈ ముగ్గురు గత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనల్లో చక్కగా రాణించారు. బౌలింగ్‌లో ఇషాంత్ ఒక్కడే అనుభవజ్ఞుడు. దాంతో షమీ, భువనేశ్వర్‌లపై పెద్ద బాధ్యత ఉంది. ఇతర యువ పేసర్లు ఆరోన్, పాండే, పంకజ్సింగ్లకు ఎన్ని అవకాశాలు లభిస్తాయో చెప్పలేము. మొత్తానికి భారత జట్టు అన్ని విధాలుగా పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. భారత్ ఐదుగురు బౌలర్లలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంగ్లండ్ తడబాటు... కెప్టెన్ అలిస్టర్ కుక్ భారత్‌పై గత రెండు సిరీస్‌లలో కలిపి 14 ఇన్నింగ్స్‌లలో 910 పరుగులు చేశాడు. కానీ గత 25 ఇన్నింగ్స్‌లుగా అతను ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం జట్టుపై ప్రభావం చూపిస్తోంది. ఇక సీనియర్లు పీటర్సన్, ట్రాట్, స్వాన్ దూరం కావడంతో ఇంగ్లండ్ జట్టు కూడా కుర్రాళ్లతో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది. ఇటీవల లంక చేతిలో పరాజయం పాలు కావడం పరిస్థితిని సూచిస్తోంది. అండర్సన్, బ్రాడ్, ప్లంకెట్లతో ఆ జట్టు పేస్ భారత్‌ను కట్టడి చేయడంపై దృష్టి పెట్టింది. స్వాన్ స్థాయి స్పిన్నర్ లేకపోవడం ఆ జట్టుకు ప్రధాన సమస్య. అయితే బలాన్స్, రాబ్సన్, మొయిన్ లాంటి యువ ఆటగాళ్లు వెలుగులోకి రావడం ఇంగ్లండ్‌కు కలిసి రావచ్చు. బిన్నీకి చాన్స్! ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో రాణించిన స్టువర్ట్ బిన్నీకి తొలి టెస్టు ఆడే అవకాశం లభించవచ్చు. బౌలింగ్‌ను పటిష్టం చేసుకోవడంలో భాగంగా రోహిత్‌శర్మకు బదులుగా ఆల్‌రౌండర్‌గా బిన్నీకి అవకాశం దక్కొచ్చు. స్పిన్నర్‌గా కూడా అశ్విన్‌కంటే ఆల్‌రౌండర్ జడేజాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో ఆడిన తొలి టెస్టుకు, న్యూజిలాండ్‌లో ఆడిన చివరి టెస్టును పోలిస్తే మేం ఎంతో మెరుగుపడాలని అర్థమవుతుంది. ఇక మరింత ముందుకు వెళతాం. ఉపఖండం బయట ఐదుగురు బౌలర్లతో ఆడటం పెద్ద సవాలే. నేను ఆరోస్థానంలో ఆడేందుకు సిద్ధం -ఎం.ఎస్. ధోని, భారత కెప్టెన్ పిచ్, వాతావరణం పిచ్‌పై మంగళవారం పూర్తిగా పచ్చిక తొలగించారు. బౌన్స్‌కు అవకాశం లేని, పూర్తిగా పొడిగా ఉపఖండపు వికెట్‌గా కనిపిస్తోంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు. -
'ఆ టైటిల్ కంటే.. ఇదే బెస్ట్!
బెంగళూర్:గతంలో గెలిచిన ఐపీఎల్ టైటిల్ కంటే.. ప్రస్తుతం గెలిచిన ఈ టైటిలే ఎక్కువ ఆనందాన్నిచ్చిందని ఆ జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్ అభిప్రాయపడ్డాడు. 2012 లో కోల్ కతా టైటిల్ ను గెలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూనే తనకు అధిక సంతృప్తినిచ్చింది మాత్రం నిన్న గెలిచిన టైటిలేనని తెలిపాడు. తమ టీం సభ్యుల పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్నాడు. పంజాబ్ విసిరిన 200 స్కోరును ఛేజ్ చేయడం సాధారణ విషయం కాదన్నాడు. జూన్ 8 నుంచి వెస్టిండీస్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్ కు ముందు నిర్వహించే శిక్షణా క్యాంపుకు కూడా కాదనుకుని ఐపీఎల్ ఫైనల్లో ఆడిన నరైన్.. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా గుర్తింపు పొందాడు. ఈ సీజన్ లో 21 వికెట్లు తీసి ఆకట్టుకున్న నరైన్..కోల్ కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీని పేలవమైన ఆటతో ఆరంభించిన కోల్ కతా.. అసలు ప్లే ఆఫ్ కు వెళ్లడమే కష్టమని అంతా భావించారు. కాగా, భారత్ లో జరిగిన వరుస తొమ్మిది మ్యాచ్ ల్లో అనూహ్యం విజయం సాధించి ఏకంగా టైటిల్ ను చేజిక్కించుకుని అందరికీ షాకిచ్చింది. -
వెస్టిండీస్ వద్దు..ఈస్టిండీసే ముద్దు!
అంటిగ్వా: త్వరలో న్యూజిలాండ్ తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్ కు ముందు జరిగే శిక్షణా క్యాంపుకు తాను అందుబాటులో ఉండటం లేదని వెస్టిండీస్ క్రికెటర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు సమాచారం అందించాడు. జూన్ 8 నుంచి వెస్టిండీస్, న్యూజిలాండ్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. అంతకు ముందు విండీస్‌కు క్యాంప్ నిర్వహించనున్నారు. ఆటగాళ్లు జట్టుతో చేరేందుకు జూన్ 1ను తుది గడువుగా నిర్ణయించారు. ఆ తేదీలోపు తాను అందుబాటులో ఉండలేనని విండీస్ క్రికెట్ పెద్దలకు తెలియజేశాడు. అదే రోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న కారణంగానే ఆ శిక్షణా క్యాంపుకు హాజరుకాలేక పోతున్నానని తెలిపాడు. అంతకముందు గడవు తేదీలోగా క్యాంపులో చేరకపోతే తొలి టెస్టులో ఆడే అవకాశం దక్కదని విండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ మైకేల్ మూర్హెడ్ స్పష్టం చేశారు. మరోవైపు నైట్‌రైడర్స్ యాజమాన్యం మాత్రం నరైన్‌ను వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు. ఫైనల్ ముగియగానే అందు బాటులో ఉన్న తొలి ఫ్లయిట్‌కు నరైన్ పంపిస్తామని కోల్‌కతా సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించినా అది కూడా బెడిసికొట్టింది. దీంతో సందిగ్ధంలో పడ్డ నరైన్. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కే మొగ్గు చూపాడు. -
సందిగ్ధంలో నరైన్
ఐపీఎల్ ఫైనలా... వెస్టిండీస్ టెస్టా? న్యూఢిల్లీ: ఐపీఎల్లో కోల్‌కతా ఫైనల్‌కు చేరడంలో సునీల్ నరైన్ మ్యాజిక్ బౌలింగ్ కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు టైటిల్ పోరుకు అతను కోల్‌కతా జట్టుతో అందుబాటులో ఉంటాడా లేదా అనేది సందేహంగా మారింది. జూన్ 8 నుంచి వెస్టిండీస్, న్యూజిలాండ్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. అంతకు ముందు విండీస్‌కు క్యాంప్ నిర్వహించనున్నారు. ఆటగాళ్లు జట్టుతో చేరేందుకు జూన్ 1ను తుది గడువుగా నిర్ణయించారు. అయితే అదే రోజు ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో నరైన్ లేకపోతే అది నైట్‌రైడర్స్ అవకాశాలను దెబ్బ తీస్తుంది. అయితే క్యాంపులో చేరకపోతే తొలి టెస్టులో ఆడే అవకాశం దక్కదని విండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ మైకేల్ మూర్హెడ్ స్పష్టం చేశారు. మరోవైపు నైట్‌రైడర్స్ యాజమాన్యం మాత్రం నరైన్‌ను వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు. ఫైనల్ ముగియగానే అందు బాటులో ఉన్న తొలి ఫ్లయిట్‌కు నరైన్ పంపిస్తామని కోల్‌కతా సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించారు. -
విజయం ఊరిస్తోంది
మరో ఎనిమిది వికెట్లు...భారత్‌ను బెంబేలెత్తించేందుకు దక్షిణాఫ్రికా తయారు చేసిన ‘పిచ్’లో వారినే పడగొట్టేందుకు... భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ యువ ఆటగాళ్ల చేతుల ద్వారా విజయం అందుకునేందుకు... అవును... జొహన్నెస్‌బర్గ్ టెస్టు ఇప్పుడు దాదాపుగా భారత్ ఆధీనంలోకి వచ్చేసింది. రికార్డుల ప్రకారం చరిత్రలో ఏ జట్టూ ఛేదించని లక్ష్యాన్ని ముందుంచుకొని దక్షిణాఫ్రికా తడబడుతోంది. ఇప్పటికే రెండు ప్రధాన వికెట్లు కోల్పోయిన ఆ జట్టు పరువు కాపాడుకునేందుకు పోరాడుతోంది. నాలుగు రోజులుగా ఆటపై ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చివరి రోజు అదే పట్టుదలతో శ్రమిస్తే చిరస్మరణీయ విజయం చేజిక్కుతుంది. జొహన్నెస్‌బర్గ్: తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టును విజయం ఊరిస్తోంది. 458 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అల్విరో పీటర్సన్ (148 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు) తోపాటు డుప్లెసిస్ (10 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. పీటర్సన్, స్మిత్ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి శుభారంభం చేసినా....వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. విజయానికి సఫారీలు మరో 320 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్ వెనుదిరిగిన నేపథ్యంలో ఆ జట్టు విజయావకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. అయితే చెలరేగుతున్న భారత పేసర్లను ఎదుర్కొని దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను డ్రా చేసుకోగలదా అనేది ఆసక్తికరం. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 421 పరుగులకు ఆలౌటైంది. నాలుగోరోజు భారత్ మరో 137 పరుగులు జత చేసింది. పుజారా (270 బంతుల్లో 153; 21 ఫోర్లు), కోహ్లి (193 బంతుల్లో 96; 9 ఫోర్లు) మూడో వికెట్‌కు 222 పరుగులు జోడించారు. కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ సెంచరీ కోల్పోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్, కలిస్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కోహ్లి సెంచరీ మిస్ 284/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో భారత ద్వయం పుజారా, కోహ్లి నాలుగో రోజు ఆటను కొనసాగించారు. కొద్దిసేపటికే స్టెయిన్ బౌలింగ్‌లో పాయింట్ దిశగా సింగిల్ తీసి పుజారా 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఎట్టకేలకు కలిస్ 222 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కలిస్ బౌలింగ్‌లో కట్ చేయబోయి పుజారా కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ (6)ను క్లీన్‌బౌల్డ్ చేసి కలిస్ మళ్లీ దెబ్బ తీశాడు. అయితే తర్వాతి ఓవర్లో భారత్‌కు మరో షాక్ తగిలింది. టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీ సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరదామనుకున్న కోహ్లి ఆశ నెరవేరలేదు. డుమిని బౌలింగ్‌లో లేట్ కట్ ఆడబోయిన కోహ్లి, కీపర్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. రహానే (15)ను కూడా డుమిని అవుట్ చేయడంతో భారత్ 358/6 స్కోరుతో తొలి సెషన్ ముగించింది. జహీర్ మెరుపులు లంచ్ విరామం తర్వాత కెప్టెన్ ధోని (44 బంతుల్లో 29; 3 ఫోర్లు) సాధ్యమైనంత వేగంగా ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నించాడు. భారత్ ఓవరాల్ ఆధిక్యం 400 పరుగులు దాటగానే అశ్విన్ (7) అవుట్ కాగా...ధాటిగా ఆడే ప్రయత్నంలో భారీ షాట్‌కు యత్నించి ధోని డీప్ పాయింట్లో క్యాచ్ ఇచ్చాడు. అయితే అనూహ్యంగా జహీర్ ఖాన్ (31 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. తాహిర్, స్టెయిన్ల బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్ బాది ప్రేక్షకులను అలరించాడు. మరో వైపు ఇషాంత్ (4), షమీ (4)లను వరుస ఓవర్లలో తాహిర్ అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు టీ విరామం వరకు 11 ఓవర్లు జాగ్రత్తగా ఆడారు. జహీర్ వేసిన రెండో ఓవర్లో కష్టసాధ్యమైన క్యాచ్‌ను అందుకోవడంలో కోహ్లి విఫలం కావడంతో స్మిత్ బతికిపోయాడు. శతక భాగస్వామ్యం టీ విరామం తర్వాత దక్షిణాఫ్రికా చక్కటి ఆటతీరు కనబర్చింది. పీటర్సన్ ధాటిగా ఆడగా, స్మిత్ (73 బంతుల్లో 44; 6 ఫోర్లు) జాగ్రత్తగా ఆడుతూ క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలో 84 బంతుల్లో పీటర్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. అయితే ఆ వెంటనే స్మిత్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో మిడాన్ వైపు కొట్టి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే దూసుకొచ్చిన రహానే నేరుగా వికెట్లపైకి బంతిని విసరడంతో భారత్‌కు బ్రేక్ లభించింది. ఆ వెంటనే ఆమ్లా (4) కూడా వెనుదిరగడం భారత్ శిబిరంలో ఆనందం నింపింది. షమీ వేసిన బంతి బౌన్స్‌ను అంచనా వేయడంలో విఫలమై తొలి ఇన్నింగ్స్‌లాగే షాట్‌కు ప్రయత్నించకుండా ఆమ్లా వెనుదిరగడం విశేషం. ఆ తర్వాత పీటర్సన్, డుప్లెసిస్ కలిసి మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 280 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 244 భారత్ రెండో ఇన్నింగ్స్: ధావన్ (సి) కలిస్ (బి) ఫిలాండర్ 15; విజయ్ (సి) డివిలియర్స్ (బి) కలిస్ 39; పుజారా (సి) డివిలియర్స్ (బి) కలిస్ 153; కోహ్లి (సి) డివిలియర్స్ (బి) డుమిని 96; రోహిత్ (బి) కలిస్ 6; రహానే (సి) స్మిత్ (బి) డుమిని 15; ధోని (సి) (సబ్) ఎల్గర్ (బి) ఫిలాండర్ 29; అశ్విన్ (సి) డుప్లెసిస్ (బి) ఫిలాండర్ 7; జహీర్ (నాటౌట్) 29; ఇషాంత్ (ఎల్బీ) (బి) తాహిర్ 4; షమీ (బి) తాహిర్ 4; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (120.4 ఓవర్లలో ఆలౌట్) 421. వికెట్ల పతనం: 1-23; 2-93; 3-315; 4-325; 5-327; 6-358; 7-369; 8-384; 9-405; 10-421. బౌలింగ్: స్టెయిన్ 30-5-104-0; ఫిలాండర్ 28-10-68-3; మోర్కెల్ 2-1-4-0; కలిస్ 20-5-68-3; తాహిర్ 15.4-1-69-2; డివిలియర్స్ 1-0-5-0; డుమిని 24-0-87-2. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: పీటర్సన్ (బ్యాటింగ్) 76; స్మిత్ (రనౌట్) 44; ఆమ్లా (బి) షమీ 4; డుప్లెసిస్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (45 ఓవర్లలో 2 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1-108; 2-118. బౌలింగ్: జహీర్ 9-0-29-0; ఇషాంత్ 9-2-28-0; షమీ 8-1-30-1; అశ్విన్ 16-2-42-0; విజయ్ 1-0-3-0; ధోని 2-0-4-0. తొలి గంటే కీలకం! రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు కొంత పోరాటపటిమ కనబర్చింది. భారత బౌలర్ల వైఫల్యమో, అలసటో గానీ చివర్లో కాస్త ఉదాసీనత ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా పతనం 2 వికెట్లకే పరిమితమైంది. ఇక మిగిలింది చివరి రోజు ఆట. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం చూస్తే పూర్తిగా మొగ్గు భారత్ వైపే ఉంది. మన బౌలర్ల తొలి ఇన్నింగ్స్ ప్రదర్శనను గమనిస్తే ఒక రోజు అందుబాటులో ఉండే కనీస 90 ఓవర్లలో ఎనిమిది వికెట్లు తీయడం సాధ్యమే. పైగా మోర్నీ మోర్కెల్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం తక్కువగా ఉండటంతో ఇక ఏడు వికెట్లే అని చెప్పవచ్చు. మరో వైపు దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ గెలవాలంటే రికార్డు స్థాయిలో మరో 320 పరుగులు చేయాలి. దానికంటే కూడా ఆ జట్టు డ్రా గురించే ఎక్కువగా ఆలోచించవచ్చు. గత నాలుగు రోజుల ఆటను పరిశీలిస్తే...ప్రతీ రోజు తొలి గంట కీలకంగా మారింది. ఆ సమయంలో పిచ్‌పై తేమ ఎక్కువగా ఉంటుండటంతో పరిస్థితిని బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. తొలి రోజు భారత్ 15.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు గంటలోపే భారత్ 5 వికెట్లు నేలకూలాయి. మూడో రోజు పది ఓవర్ల లోపే దక్షిణాఫ్రికా 4 వికెట్లు నష్టపోగా...నాలుగో రోజు పుజారా, కోహ్లి పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ గంట గడిస్తే చాలనే స్థితి ఇప్పుడూ ఉంది. ఆ సమయంలో వరుసగా వికెట్లు తీస్తే మ్యాచ్ భారత్‌దే. దక్షిణాఫ్రికా ఆ సమయంలో నిలదొక్కుకోగలిగితే మ్యాచ్‌ను డ్రా వైపు నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌ను సఫారీ జట్టు డ్రా చేసుకున్నా అది అద్భుతమే అనుకోవాలి. మీరలా చేస్తే... మేమిలా చేస్తాం నాలుగో రోజు ఆటలో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల ఆధిక్యంతో సీరియస్‌గా సాగుతున్న సమయాన దక్షిణాఫ్రికా కెప్టెన్ స్మిత్, డివిలియర్స్‌కు బంతి అందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏడేళ్ల తర్వాత డివిలియర్స్ తొలిసారి బౌలింగ్ చేయడానికి దిగితే ఆమ్లా వికెట్ కీపర్ పాత్ర పోషించాడు. భారత్ జోరును అడ్డుకునే వ్యూహాలకు కొదవ కావడంతో అలా చేశాడని స్మిత్‌పై విమర్శలూ వచ్చాయి. అయితే శనివారం ఆటలో భారత కెప్టెన్ ధోని మరో ఆసక్తికర ప్రయత్నం చేశాడు. తన టెస్టు, వన్డే కెరీర్లో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయని మురళీ విజయ్‌తో ఒక ఓవర్ బౌలింగ్ చేయించాడు. అంతటితో ఆగిపోలేదు...తాను కీపింగ్ ప్యాడ్స్ విప్పేసి బౌలింగ్ చేసేందుకు సిద్ధమైపోయాడు. కీపింగ్ గ్లవ్స్ విరాట్ కోహ్లి వద్దకు వెళ్లాయి. ఇది ఆమ్లాకు కాపీనేమో! తొలి ఓవర్ తర్వాత ధోని తన కీపింగ్ ప్యాడ్లు కూడా ఓజాకిచ్చి పంపించేశాడు. బౌలింగ్ చేయని తర్వాతి రెండు ఓవర్లు ప్యాడ్లు లేకుండానే ధోని కీపింగ్ చేశాడు. ఇరు జట్లు ఇన్నింగ్స్‌లు సీరియస్‌గా సాగుతున్న వేళ, ప్రత్యర్థిని కట్టడి చేయాల్సిన, వికెట్లు తీయాల్సిన సమయంలో ఇది జరగడం ఆశ్చర్యం కలిగించేదే! అన్నట్లు ఇరు జట్ల వికెట్ కీపర్లు ఒకే టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘టెస్టు మ్యాచ్ గెలిచేందుకు కావాల్సినంత స్కోరు మా వద్ద ఉంది. రెండు వికెట్లు పడగొట్టడం సంతోషంగా ఉంది. ఆఖరి రోజు పరిస్థితి మరింత కఠినంగా ఉండవచ్చు. అయితే తొలి సెషన్లో చకచకా వికెట్లు తీయడం ముఖ్యం. వికెట్‌పై బౌన్స్‌లో తేడా, పగుళ్లు కనిపిస్తున్నాయి. బంతి బాగా తిరుగుతుందని ఆశిస్తున్నాం’ - చతేశ్వర్ పుజారా, భారత బ్యాట్స్‌మన్ ‘ప్రస్తుతం మేము ‘డ్రా’ కోసమే ఆడుతున్నాం. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టే సమయానికి పూర్తిగా 135 ఓవర్లు ఆడాలనే లక్ష్యంతో బరిలోకి దిగలేదు. టీ విరామం వరకు వికెట్ కోల్పోకుండా ఆడాలని అనుకున్నాం. రెండు వికెట్లు కోల్పోయినా మంచి స్థితిలో ఉన్నాం. ఆదివారం ఆటలో లంచ్ వరకు వికెట్ కోల్పోకపోతే విజయం గురించి ఆలోచిస్తాం’ - బిరెల్, దక్షిణాఫ్రికా అసిస్టెంట్ కోచ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదన రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. 2003లో సెయింట్ జాన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ నాలుగో ఇన్నింగ్స్‌లో 418/7 స్కోరు చేసి విజయాన్నందుకుంది. 2008లో ఆస్ట్రేలియాపై (పెర్త్) 414/4 పరుగులు చేసి విజయం సాధించడం ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా అత్యధిక లక్ష్య ఛేదన. జొహన్నెస్‌బర్గ్‌లో అత్యధిక ఛేదన ఆస్ట్రేలియా (2011లో దక్షిణాఫ్రికాపై-310/8) పేరిట ఉండగా...ఈ మైదానంలో 396 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో (ఇంగ్లండ్‌పై) దక్షిణాఫ్రికా 304 పరుగులు చేసి (1914లో) ఓటమిపాలైంది. -
ముగిసిన నాలుగోరోజు ఆట: సౌతాఫ్రికా 138/2
జోహన్స్‌బర్గ్: భారత్ -దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. 457 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు నిలకడగా ఆడుతున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన సఫారీలు 138 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. దీంతో దక్షిణాఫ్రికా విజయం సాధించడానికి 320 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్లు పీటర్సన్(76) పరుగులతో అజేయంగా ఉండగా, స్మిత్ (44) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన హషీమ్ ఆమ్లా(4) పరుగులకే పరిమితమైయ్యాడు. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో భారత్ బౌలర్లకు అసలు పరీక్ష ఎదురుకానుంది. తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకే ఆలౌటయిన భారత బ్యాట్స్‌మన్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సౌతాఫ్రికన్ బౌలర్లకు వాళ్ల సొంత గడ్డ మీదే చుక్కలు చూపించారు. పుజారా సెంచరీ చేయగా, కోహ్లీ కొద్దిలో శతకం మిస్సయ్యాడు. శిఖర్ ధావన్ 15 పరుగులు మాత్రమే చేసి ఫిలాండర్ బౌలింగ్‌లో కలిస్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. మురళీ విజయ్ 39 పరుగులు చేసి డి విలియర్స్ క్యాచ్‌తో పెవిలియన్ బాట పట్టాడు. ఆ సమయంలో వచ్చిన ఛటేశ్వర్ పుజారా సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 270 బంతులు ఎదుర్కొన్న పుజారా సుదీర్ఘ కాలం పాటు క్రీజ్‌కు అతుక్కుపోయాడు. 21 ఫోర్లతో 153 పరుగులు చేసి, చివరకు కలిస్ బౌలింగ్‌లోనే డి విలియర్స్ క్యాచ్‌తో ఔటయ్యాడు. -
భారత్ 421 ఆలౌట్.. సౌతాఫ్రికాపై 457 పరుగుల ఆధిక్యం
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్ లో 421 పరుగుల స్కోరు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం 36 పరుగులతో కలిపి 457 పరుగుల ఆధిక్యం టీమిండియాకు దక్కింది. ఇక ఆట ఒకటిన్నర రోజు కూడా పూర్తిగా లేకపోవడంతో సౌతాఫ్రికా పని పట్టడమే మిగిలింది. మొదటి ఇన్నింగ్స్ హీరోలు జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ మరోసారి జూలు విదిలించి, వారికి షమీ లాంటి వాళ్లు కూడా తోడైతే ఇక భారత్ విజయం నల్లేరు మీద బండి నడకే అని చెప్పుకోవచ్చు. తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకే ఆలౌటయిన భారత బ్యాట్స్‌మన్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సౌతాఫ్రికన్ బౌలర్లకు వాళ్ల సొంత గడ్డ మీదే చుక్కలు చూపించారు. పుజారా సెంచరీ చేయగా, కోహ్లీ కొద్దిలో శతకం మిస్సయ్యాడు. శిఖర్ ధావన్ 15 పరుగులు మాత్రమే చేసి ఫిలాండర్ బౌలింగ్‌లో కలిస్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. మురళీ విజయ్ 39 పరుగులు చేసి డి విలియర్స్ క్యాచ్‌తో పెవిలియన్ బాట పట్టాడు. ఆ సమయంలో వచ్చిన ఛటేశ్వర్ పుజారా సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 270 బంతులు ఎదుర్కొన్న పుజారా సుదీర్ఘ కాలం పాటు క్రీజ్‌కు అతుక్కుపోయాడు. 21 ఫోర్లతో 153 పరుగులు చేసి, చివరకు కలిస్ బౌలింగ్‌లోనే డి విలియర్స్ క్యాచ్‌తో ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించినా, 96 పరుగుల వద్ద ఔటవ్వడంతో అభిమానులు నిరాశ చెందారు. 193 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లతో భారీ స్కోరు అందించిన కోహ్లీ బ్యాటు నుంచి శతకం జాలువారుతుందని, సౌతాఫ్రికాకు దీంతో గట్టిగా బుద్ధి వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే, డుమినీ బౌలింగ్‌లో మళ్లీ డి విలియర్స్ క్యాచ్ పట్టి కోహ్లీని పెవిలియన్‌కు పంపాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మన్ కేవలం డి విలియర్స్ క్యాచ్‌ల వల్లే ఔటవ్వడం గమనార్హం. ఆ తర్వాత వచ్చిన రోహిత్ శర్మ ఆరు పరుగులకే వెనుదిరగగా, తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగులతో ఆశలు రేకెత్తించిన అజింక్య రహానే 15 పరుగులకే ఔటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ కూడా 7 పరుగులే చేసి ఫిలాండర్ బౌలింగ్‌లో ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత కెప్టెన్ ధోనీ కూడా వెనుదిరిగాడు. ధోనీ 44 బంతుల్లో మూడు ఫోర్లతో 29 పరుగులు మాత్రమే చేశాడు. భోజన విరామ సమయానికి భారత్ ఆరు వికెట్లు నష్టపోయి 358 పరుగులు చేసింది. తిరిగి వచ్చిన తర్వాత ఆట నెమ్మదిగా మొదలైంది. ఆ తర్వాతే అశ్విన్ వికెట్ పడింది. ఆ తరుణంలో వచ్చిన జహీర్ ఖాన్ స్కోరుబోర్డును వేగంగా కదిలించాడు. రెండో ఎండ్ నుంచి పెద్దగా మద్దతు లభించకపోయినా ఒంటి చేత్తో పోరాటం సాగించాడు. 31 బంతుల్లోనే 29 పరుగులు చేసి తనలోని ఆల్ రౌండ్ నైపుణ్యాన్ని చూపించాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్సులు కూడా ఉన్నాయి. అయితే, మరోవైపు బౌలర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ కూడా నాలుగేసి పరుగులకే ఔటవ్వడంతో భారత ఇన్నింగ్స్ 421 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కొద్దిగానే ఉన్నా, రెండో ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మన్ విజృంభణ టీమిండియాకు బాగా ఉపయోగపడింది.