
డబ్లిన్: అరంగేట్ర టెస్టులోనే ఐర్లాండ్ ఆకట్టుకుంది. పాకిస్తాన్‌ను ఆ జట్టు కట్టడి చేసింది. వర్షంతో తొలి రోజు ఆట రద్దవగా, రెండో రోజు శనివారం బ్యాటింగ్‌కు దిగిన పాక్... ఐర్లాండ్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్‌లో అసద్ షఫీఖ్ (62; 8 ఫోర్లు) నిలిచినా ఓపెనర్లు అజహర్ అలీ (4), ఇమాముల్ హక్ (7)తో పాటు సొహైల్ (31; 2 ఫోర్లు), ఆజమ్ (14), కెప్టెన్ సర్ఫరాజ్ (20) విఫలమయ్యారు. దీంతో జట్టు 159 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
షాదాబ్ ఖాన్ (52 బ్యాటింగ్), అష్రఫ్ (61 బ్యాటింగ్) దూకుడుతో ఆట ముగిసే సమయానికి 76 ఓవర్లలో 6 వికెట్లకు 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో రాన్‌కిన్ రెండు దేశాల తరఫున టెస్టు క్రికెట్ ఆడిన 15వ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment