Fans Feel Rohit Sharma Twitter Account Has Been Hacked: వరుస సిరీస్ విజయాలతో పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సోషల్‌మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హిట్‌మ్యాన్‌ను అనుసరించేవారు ట్విట్టర్‌లో 20.2 మిలియన్లు, ఇన్‌స్టాలో 22.6 మిలియన్ల మంది ఉన్నారు. ఇన్‌స్టా అకౌంట్‌ను వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసేందుకు మాత్రమే ఉపయోగించే హిట్‌మ్యాన్.. ట్విట్టర్‌లో మాత్రం క్రికెట్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంటాడు.
Rohit sharma Account hacked maybe 🙄...weirds tweets ho re h bas 😂
— gungun♡ (@thoughtfulkid_) March 1, 2022
#RohitSharma #hack pic.twitter.com/u1xzz9a80n
కాగా, ఇవాళ (మార్చి 1న) రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్లు అతని అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ‘నాకు కాయిన్ టాస్ అంటే ఇష్టం. ముఖ్యంగా అవి నా కడుపులోకి ఎప్పుడైతే చేరతాయో..’ అంటూ రోహిత్ అకౌంట్ నుంచి పలు అర్ధం పర్ధం లేని ట్వీట్లు వచ్చాయి. ఇవి చూసిన అభిమానులు రోహిత్ భాయ్‌కి ఏమైంది..? అర్ధం పర్ధం లేని ట్వీట్లతో తికమకపెడుతున్నాడంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పుడూ ఇలాంటి ట్వీట్లు చేయని రోహిత్ కొత్తగా పిచ్చి పిచ్చి మెసేజ్‌లు చేస్తుండటంతో అతని అకౌంట్ హ్యాక్ అయ్యిందేమోనన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
Is that rohit sharma Twitter got hacked ??? @ImRo45 pic.twitter.com/sfVDnIeqM1
— Mr Unknown (@MrUnknown812) March 1, 2022
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత విరాట్ కోహ్లి నుంచి టీ20 పగ్గాలు చేపట్టిన రోహిత్.. తదనంతర పరిణామాల్లో టీమిండియా ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నియమించబడిన విషయం తెలిసిందే. రోహిత్.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక వరుసగా మూడు టీ20 సిరీస్‌లు, ఓ వన్డే సిరీస్ (విండీస్‌పై)ను క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు పొట్టి క్రికెట్‌లో వరుసగా 12 విజయాలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ ద్వారా రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టబోతున్నాడు.
It's got to be hacked because his last two tweets were from TweetDeck while the rest are from an iPhone. pic.twitter.com/jTVVFGzH19
— Ishika (@IshikaMullick) March 1, 2022
చదవండి: కెప్టెన్సీ విషయంలో నాన్చుడేంది.. అర్థం కాని ఆర్‌సీబీ వైఖరి
Comments
Please login to add a commentAdd a comment