mohali test match
-
రోహిత్ శర్మ కెప్టెన్సీపై దిగ్గజ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
కెప్టెన్‌గా అరంగేట్రం టెస్ట్‌లోనే అద్భుత విజయాన్ని అందుకున్న రోహిత్ శర్మపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌తోనే రోహిత్ ఆకట్టుకున్నాడని, అతను బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ అద్భుతంగా ఉన్నాయని, ఇందుకు రోహిత్‌కు 10కి 9.5 రేటింగ్ పాయింట్లు ఇస్తానని సన్నీ తెలిపాడు. రోహిత్ చాకచక్యంగా ఫీల్డింగ్ సెట్ చేయడంతో టీమిండియా ఆటగాళ్లు ఎక్కువగా కదలాల్సిన అవసరం రాలేదని, ఈ విషయంలో రోహిత్ తన ఐపీఎల్ అనుభవాన్నంతా ఉపయోగించాడని కితాబునిచ్చాడు. బౌలింగ్‌లో జడేజాను సరైన సమయంలో వాడుకున్నాడని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా రోహిత్ కెప్టెన్సీ కారణంగానే టీమిండియా మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించిందని కొనియాడాడు. రోహిత్ సొంత నిర్ణయాలు తీసుకుని జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని ప్రశంసించాడు. రోహిత్‌కు సీనియర్లు బాగా సహకరించారని, ఇది టీమిండియాకు శుభపరిణామమని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శన (175 నాటౌట్, 9 వికెట్లు)తో టీమిండియాకు మరపురాని విజయాన్నందించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 574-8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 174, రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు చాపచుట్టేసింది. అబ్బురపోయే ప్రదర్శనతో అదరగొట్టిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ పింక్ బాల్‌తో డే అండ్ నైట్ ఫార్మాట్లో జరగనుంది. చదవండి: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్‌పై విమర్శలు! -
రెండో రోజు ముగిసిన ఆట.. మెరిసిన జడ్డూ
-
IND VS SL 1st Test: ఒత్తిడిలో విరాట్..? ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆరుసార్లు క్లీన్ బౌల్డ్..!
మొహాలీ వేదికగా శ్రీలంకతో రేపటి (మార్చి 4) నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్ట్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్లో 100వ టెస్ట్ కానుందన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది. కరోనా ఆంక్షల కారణంగా తొలుత ప్రేక్షకులను అనుమతించేది లేదని ప్రకటించిన బీసీసీఐ, కోహ్లి అభిమానుల ఒత్తిళ్లకు దిగొచ్చింది. మైదానంలోని 50 శాతం ప్రేక్షకులను అనుమతిచ్చేందుకు ఒప్పుకుంది. ఇప్పటికే ఈ టెస్ట్‌కి సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇదిలా ఉంటే, కెరీర్లో మైలురాయి టెస్ట్‌కి ముందు పరుగుల యంత్రం కోహ్లి ఒత్తిడికి గురవుతున్నాడని తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందే మొహాలీ చేరుకున్న అతను... నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్స్‌లో కోహ్లి.. నెట్స్‌లో ఏకంగా ఆరుసార్లు బౌల్డ్ అయ్యాడని సమాచారం. తన కెరీర్లో చిరకాలం గుర్తండిపోయే టెస్ట్‌లో సరిగ్గా పెర్ఫార్మ్ చేస్తానా లేదా అన్న ఆందోళనలో కోహ్లి ఉన్నట్లు తెలుస్తోంది. పైగా అతను సెంచరీ బాది దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుండటంతో ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లి ఆ మార్కును అందుకోవాలని అతని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ అంచనాలే కోహ్లి ఒత్తిడికి కారణమని తెలుస్తోంది. కాగా, రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా రేపటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో రోహిత్ తొలిసారి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుండగా.. కోహ్లి కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. చదవండి: అంతా కోహ్లినే చేశాడు.. హిట్‌మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
అంతా కోహ్లినే చేశాడు.. హిట్‌మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Credit Goes To Virat Kohli For Indias Test Success Says Rohit Sharma: భారత్-శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లిను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్లో 100వ టెస్ట్ ఆడనున్న కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ.. టెస్ట్‌ల్లో టీమిండియా ఈ పరిస్ధితికి కోహ్లినే కారణమంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. కోహ్లి టెస్ట్ సారధ్య బాధ్యతలు చేపట్టే నాటికి టీమిండియా ఏడో ర్యాంకులో ఉందని, అలాంటి జట్టును కోహ్లి వరుసగా ఐదేళ్లు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిపాడని కొనియాడాడు. టెస్ట్ క్రికెట్లో కోహ్లి ఓ స్పెషల్ ప్లేయర్ అని, అలాంటి ఆటగాడి వందో టెస్ట్‌ను అంతకంటే స్పెషల్‌గా చేయాలని అనుకుంటున్నామని అన్నాడు. టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లి చిరస్మరణీయ విజయాలు సాధించాడని, 2018లో అతని సారధ్యంలో ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ విజయం చాలా ప్రత్యేకమని తెలిపాడు. 2013లో దక్షిణాఫ్రికాలోని బౌన్సీ పిచ్‌పై కోహ్లి చేసిన క్లాసీ టెస్ట్ సెంచరీలను (ఒకే ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు) నాతో పాటు ప్రతి క్రికెట్ అభిమాని చిరకాలం గుర్తించుకుంటాడని పేర్కొన్నాడు. అలాగే పెర్త్‌లో కోహ్లి ఇన్నింగ్స్ వేరే లెవెల్ అని కొనియాడాడు. టీమిండియా సాధించిన విజయాలు, సాధించబోయే విజయాల్లో కోహ్లికి కచ్ఛితంగా క్రెడిట్ దక్కుతుందని చెప్పుకొచ్చాడు. తొలి టెస్ట్ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన రోహిత్.. కోహ్లిపై ఇలా ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా శ్రీలంకతో రేపటి(మార్చి 4) నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుండగా.. కోహ్లి కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. చదవండి: 'వంద టెస్టులు ఆడతానని ఊహించలేదు' -
Ganguly: కోహ్లి వందో టెస్ట్‌లో సెంచరీ కొట్టాలి.. ఆ మ్యాచ్ చూసేందుకు నేను కూడా వస్తా..!
గతేడాది టీ20 ప్రపంచకప్ అనంతరం గంగూలీ-కోహ్లిల మధ్య కెప్టెన్సీ విషయంలో మొదలైన వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. ఈనెల 4 నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్ట్ కోహ్లి కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ కాగా, ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తాను కూడా హాజరవుతానని గంగూలీ స్వయంగా ప్రకటించాడు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన గంగూలీ.. బ్రిటిష్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. కోహ్లితో విభేదాల గురించి మీడియా ప్రశ్నించగా.. దాదా వాటిని కొట్టిపారేశాడు. వంద టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం ప్రస్తుత తరంలో అంత సులువు కాదని, భారత క్రికెట్లో అతి తక్కువ మంది మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారని పేర్కొన్నాడు. 100 టెస్ట్‌ల మైలురాయిని అందుకోవాలంటే సదరు వ్యక్తి గొప్ప ప్లేయర్ అయి ఉండాలని, కోహ్లి ఆ కోవలోకే వస్తాడని పరుగుల యంత్రాన్ని ఆకాశానికెత్తాడు. గత కొంతకాలంగా కోహ్లి ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, మొహాలీ టెస్ట్‌లో కోహ్లి శతక దాహాన్ని తప్పక తీర్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2014 ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా కోహ్లి ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డాడని, ఆ తర్వాత కొద్ది రోజులకే గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడని గుర్తు చేశాడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా 2002-2005 మధ్య గడ్డుకాలం ఎదుర్కున్నాడని,ఆ తర్వాత అతను కూడా తిరిగి పుంజుకున్నాడని, గొప్ప ఆటగాళ్ల కెరీర్లో ఇవన్నీ సహజమేనని చెప్పుకొచ్చాడు. కాగా, కోహ్లి వందో టెస్ట్‌ను ప్రత్యక్షంగా మైదానంలో వీక్షించేందుకు తొలుత ప్రేక్షకులను అనుమతించని బీసీసీఐ.. ఆ తర్వాత అభిమానుల నిరసనలతో దిగొచ్చింది. స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులకు అనుమతివ్వాలని నిర్ణయించింది. చదవండి: IND VS SL 1st Test: కోహ్లి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు దిగొచ్చిన బీసీసీఐ -
IND VS SL 1st Test: కపిల్ రికార్డుపై కన్నేసిన అశ్విన్.. మరో ఐదు వికెట్ల దూరంలో..!
మొహాలీ వేదికగా ఈనెల 4 నుంచి శ్రీలంకతో ప్రారంభంకానున్న తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ మరో ఐదు వికెట్లు తీస్తే.. లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొడతాడు. కపిల్ 131 టెస్ట్‌ల్లో 434 వికెట్లతో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉండగా.. అశ్విన్ కేవలం 84 మ్యాచ్‌ల్లోనే 430 వికెట్లు పడగొట్టి కపిల్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 132 టెస్ట్‌ల్లో 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్.. కపిల్ రికార్డును బద్దలు కొట్టే క్రమంలో మరో ఇద్దరు దిగ్గజ బౌలర్ల రికార్డులను కూడా అధిగమించనున్నాడు. మరో రెండు వికెట్లు తీస్తే న్యూజిలాండ్ మాజీ పేసర్ రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్టులలో 431 వికెట్లు)ని, మూడు వికెట్లు తీస్తే శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్ (93 టెస్టులలో 433 వికెట్లు)లను అధిగమిస్తాడు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు), ఆసీస్ గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు), జేమ్స్ అండర్సన్ (169 టెస్ట్‌ల్లో 640 వికెట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉండగా, ప్రస్తుతానికి ఈ జాబితాలో అశ్విన్ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, లంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో అశ్విన్ మరో 10 వికెట్లు తీయడం ఖాయంగా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో అశ్విన్ 10 వికెట్ల మార్కును దాటగలిగితే సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (93 టెస్ట్‌ల్లో 439 వికెట్లు)ను వెనక్కునెట్టి టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకుతాడు. స్వదేశంలో టెస్ట్‌ల్లో ఘనమైన రికార్డు కలిగిన అశ్విన్‌కు ఈ రికార్డును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇదిలా ఉంటే, ఈ రికార్డులతో పాటు అశ్విన్ మరో రెండు రికార్డులపై కూడా కన్నేశాడు. లంకపై భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ జాబితాలో అనిల్ కుంబ్లే (18 మ్యాచ్‌ల్లో 73 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో హర్భజన్ (16 మ్యాచ్‌ల్లో 53 వికెట్లు), అశ్విన్ (9 టెస్ట్‌ల్లో 50 వికెట్) ఉన్నారు. లంకతో సిరీస్‌లో యాష్ మరో నాలుగు వికెట్లు తీస్తే భజ్జీని అధిగమిస్తాడు. ఈ సిరీస్‌లో బౌలింగ్ రికార్డులతో పాటు ఓ బ్యాటింగ్ రికార్డుపై కూడా యాష్ గురిపెట్టాడు. లంకపై మరో 166 పరుగులు చేస్తే టెస్ట్‌ల్లో 3000 పరుగుల మైలరాయిని చేరుకుంటాడు. ప్రస్తుతం అశ్విన్.. 120 ఇన్నింగ్స్‌ల్లో 2844 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: రోహిత్ శర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోహ్లి చిన్ననాటి కోచ్..! -
IND VS SL 1st Test: కోహ్లి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు దిగొచ్చిన బీసీసీఐ
50 Percent Spectators Allowed For Virat Kohlis 100th Test: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌ను బీసీసీఐ ఎట్టకేలకు కనికరించింది. తమ అభిమాన క్రికెటర్ కెరీర్లో మైలురాయిగా నిలిచే వందో టెస్ట్‌ను స్టేడియంలో విక్షించేందుకు అనుమతిచ్చింది. మార్చి 4 నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే టెస్ట్ మ్యాచ్ కోహ్లి కెరీర్లో వందో మ్యాచ్ కాగా.. స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. టికెట్లన్నీ ఆన్లైన్లోనే విక్రయిస్తామని పేర్కొంది. బీసీసీఐ చేసిన ఈ ప్రకటనతో కోహ్లి ఫ్యాన్స్ సంబురాల్లో మునిగి తేలుతున్నారు. కరోనా నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిచ్చేది లేదని బీసీసీఐ తొలుత ప్రకటించింది. అయితే, కోహ్లికి కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతివ్వాలని అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఇదిలా ఉంటే, బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అంగీకరించింది. ఈ విషయాన్ని కేసీఏ కార్యదర్శి సంతోష్ మీనన్ ధృవీకరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని ఆయన ప్రకటించారు. మార్చి 12 నుంచి 16 వరకు జరగనున్న బెంగళూరు టెస్టు.. డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరగనున్న విషయం తెలిసిందే. చదవండి: కోహ్లి 100వ టెస్ట్ ప్రేక్షకులు లేకుండానే, ఆ మరుసటి మ్యాచ్‌కు మాత్రం..! -
కోహ్లి, శ్రేయస్ అయ్యర్ల మధ్య పోటీపై క్రికెట్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు
Virat Kohli Cant Be Replaced Says Sunil Gavaskar: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన టీమిండియా టాపార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, ఇటీవలి కాలంలో అశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సరైన రీప్లేస్మెంట్ అంటూ క్రికెట్ వర్గాల్లో హాట్ డిబేట్ నడుస్తున్న వేళ.. ఈ ఇద్దరి మధ్య పోటీపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. కెరీర్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న శ్రేయస్‌ను స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో పోల్చడం, పోటీపెట్టడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. ఫార్మాట్ ఏదైనా టీమిండియాలో కోహ్లి స్థానానికి ఎవ్వరూ పోటీ కారు, కాలేరని పేర్కొన్నాడు. కోహ్లి శతక దాహంతో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, జట్టులో నుంచి తప్పించే స్థాయి పేలవ ప్రదర్శనేమీ చేయడంలేదని టీమిండియా మాజీ కెప్టెన్‌ను వెనకేసుకొచ్చాడు. జట్టులో కోహ్లి స్థానం కోసం పోటీ నెలకొనడం శుభపరిణామమేనని, ఘన చరిత్ర కలిగిన కోహ్లిని తక్కువ అంచనా వేయడం సబబు కాదని కోహ్లి విమర్శకులకు చురకలంటించాడు. టీ20ల్లో కోహ్లి వన్‌డౌన్‌లోనే రావాలని, శ్రేయస్‌ను నాలుగు, లేదా ఐదో స్థానంలో బరిలోకి దించడం శ్రేయస్కరమని సూచించాడు. కోహ్లి, శ్రేయస్‌ల పోటీ విషయం పక్కన పెడితే, ఇటీవలి కాలంలో సూర్యకుమార్ యాదవ్ కూడా అదరగొడుతున్నాడని, తుది జట్టులో స్థానం కోసం అతనికి శ్రేయస్‌కు మధ్యే పోటీ ఉంటుందని తెలిపాడు. కాగా, టీ20ల్లో శ్రేయస్‌ను కోహ్లి రెగ్యులర్ స్థానమైన వన్‌డౌన్‌లో ఆడించి.. కోహ్లిని రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయిస్తే బెటర్ అంటూ టీమిండియా అభిమానుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ నుంచి స్వచ్చందంగా తప్పుకుని విరామంలో ఉన్న కోహ్లి మార్చి 4 నుంచి లంకతోనే ప్రారంభంకానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్ కోహ్లి కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. చదవండి: 'కోహ్లిపై కోపం తగ్గలేదా'.. బీసీసీఐని ఏకిపారేసిన క్రికెట్ ఫ్యాన్స్ -
రోహిత్ శర్మకు ఏమైంది.. ? ట్విట్టర్ అకౌంట్ నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు
Fans Feel Rohit Sharma Twitter Account Has Been Hacked: వరుస సిరీస్ విజయాలతో పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సోషల్‌మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హిట్‌మ్యాన్‌ను అనుసరించేవారు ట్విట్టర్లో 20.2 మిలియన్లు, ఇన్‌స్టాలో 22.6 మిలియన్ల మంది ఉన్నారు. ఇన్‌స్టా అకౌంట్‌ను వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసేందుకు మాత్రమే ఉపయోగించే హిట్‌మ్యాన్.. ట్విట్టర్లో మాత్రం క్రికెట్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంటాడు. Rohit sharma Account hacked maybe 🙄...weirds tweets ho re h bas 😂 #RohitSharma #hack pic.twitter.com/u1xzz9a80n — gungun♡ (@thoughtfulkid_) March 1, 2022 కాగా, ఇవాళ (మార్చి 1న) రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్లు అతని అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ‘నాకు కాయిన్ టాస్ అంటే ఇష్టం. ముఖ్యంగా అవి నా కడుపులోకి ఎప్పుడైతే చేరతాయో..’ అంటూ రోహిత్ అకౌంట్ నుంచి పలు అర్ధం పర్ధం లేని ట్వీట్లు వచ్చాయి. ఇవి చూసిన అభిమానులు రోహిత్ భాయ్‌కి ఏమైంది..? అర్ధం పర్ధం లేని ట్వీట్లతో తికమకపెడుతున్నాడంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పుడూ ఇలాంటి ట్వీట్లు చేయని రోహిత్ కొత్తగా పిచ్చి పిచ్చి మెసేజ్‌లు చేస్తుండటంతో అతని అకౌంట్ హ్యాక్ అయ్యిందేమోనన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. Is that rohit sharma Twitter got hacked ??? @ImRo45 pic.twitter.com/sfVDnIeqM1 — Mr Unknown (@MrUnknown812) March 1, 2022 ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత విరాట్ కోహ్లి నుంచి టీ20 పగ్గాలు చేపట్టిన రోహిత్.. తదనంతర పరిణామాల్లో టీమిండియా ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నియమించబడిన విషయం తెలిసిందే. రోహిత్.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక వరుసగా మూడు టీ20 సిరీస్‌లు, ఓ వన్డే సిరీస్ (విండీస్‌పై)ను క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు పొట్టి క్రికెట్లో వరుసగా 12 విజయాలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ ద్వారా రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టబోతున్నాడు. It's got to be hacked because his last two tweets were from TweetDeck while the rest are from an iPhone. pic.twitter.com/jTVVFGzH19 — Ishika (@IshikaMullick) March 1, 2022 చదవండి: కెప్టెన్సీ విషయంలో నాన్చుడేంది.. అర్థం కాని ఆర్సీబీ వైఖరి -
IND Vs SL:లంక క్రికెటర్లు ప్రయాణించిన బస్సులో బుల్లెట్ల కలకలం
భారత్-శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్‌కు ముందు ఓ షాకింగ్ వార్త అందరిని కలవరపెడుతుంది. టీ20 జట్టులో లేని లంక ఆటగాళ్లు ప్రయాణించిన వాహనంలో రెండు బుల్లెట్ షెల్స్ బయటపడటంతో లంక శిబిరంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. లంక క్రికెటర్లు ఓ ప్రైవేట్ బస్సులో తాము బస చేస్తున్న లలిత్ హోటల్ నుంచి టెస్ట్ మ్యాచ్ వేదిక అయిన పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) స్టేడియానికి వెళ్తుండగా, మార్గ మధ్యంలో జరిగిన సాధారణ పోలీసు తనిఖీల్లో రెండు ఖాళీ బుల్లెట్ షెల్స్ కనిపించాయి. మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేస్తుండగా బస్సు లగేజ్ కాంపార్ట్‌మెంట్‌లో బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. లంక ప్లేయర్ల కోసం బస్సును అద్దెకి తీసుకోవడానికి ముందు ఓ మ్యారేజ్ ఫంక్షన్ కోసం వాడినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. చండీఘర్‌లోని తారా బ్రదర్స్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి బస్సు అద్దెకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, మొహాలీలో జరగనున్న టెస్ట్ మ్యాచ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి వందో టెస్ట్ కావడంతో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. పంజాబ్‌లో ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా ఈ మ్యాచ్‌కి ప్రేక్షకులను అనుమతించబోమని పీసీఏ వెల్లడించింది. చదవండి: కోహ్లి 100వ టెస్ట్ ప్రేక్షకులు లేకుండానే, ఆ మరుసటి మ్యాచ్‌కు మాత్రం..! -
విరాట్ కోహ్లి 100వ టెస్ట్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్!
స్వదేశంలో శ్రీలంకతో భారత జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. మార్చి 4న మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్ట్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించట్లేదని స్పష్టం చేసింది. ఇది ఇలా వుంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన కేరిర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. కోహ్లి 100వ టెస్ట్ మ్యాచ్‌కు మొహాలీ అతిథ్యం ఇవ్వనుంది. ఇక స్టేడియంకు వెళ్లి ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని భావించిన విరాట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. "భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రేక్షకులు లేకుండానే జరగనుంది" అని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో దీపక్ శర్మ పేర్కొన్నారు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో ఓటమి తర్వాత భారత టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మను భారత టెస్ట్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. ఇక తన టెస్ట్ కేరిర్‌లో 99 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 7962 పరుగులతో పాటు 27 సెంచరీలు సాధించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు అయ్యింది. ఇక విరాట్ తన 100వ మ్యాచ్‌లో నైనా సెంచరీ సాధించాలని అభిమానులు అశిస్తున్నారు. చదవండి: భారత్, శ్రీలంక రెండో టీ20.. మ్యాచ్ జరిగేనా! -
టీమిండియా ఘనవిజయం
-
టీమిండియా ఘనవిజయం
మొహాలి:నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శనివారం మూడో రోజు 218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా 109 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో వేన్ జిల్(36) ఫర్వాలేదనిపించగా, డీన్ ఎల్గర్(16), ఫిలిండర్(1), డు ప్లెసిస్(1), హషీమ్ ఆమ్లా(0), ఏబీ డివిలియర్స్(16) , విలాస్(7), హర్మర్(11) లు ఘోరంగా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. టీమిండియా స్పిన్ త్రయం రాణించి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు కళ్లెం వేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు సాధించగా, అశ్విన్ కు మూడు వికెట్లు, అమిత్ మిశ్రాకు ఒక వికెట్ దక్కింది. మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు 125/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియా 200 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో టీమిండియాకు ఓవరాల్ గా 217 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా ఆటగాళ్లలో మురళీ విజయ్(47), చటేశ్వర పూజారా(77) లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. జట్టు స్కోరు 161 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లి(29) మూడో వికెట్ గా పెవిలియన్ కు చేరగా, ఆపై మరో 17 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది. కాగా వృద్ధిమాన్ సాహా(20) చివరి వరస బ్యాట్స్ మెన్ తో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. దీంతో టీమిండియా రెండొందల మార్కును చేరుకోగలిగింది. అశ్విన్, జడేజాలు తిప్పేశారు టీమిండియా ఘనవిజయంలో స్పిన్నర్ల పాత్రనే ప్రముఖం పేర్కొనాలి. తొలి ఇన్నింగ్స్ లో 51 పరుగులకే ఐదు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా రాణించాడు. 39 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. కాగా, జడేజా తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో 21 పరుగులిచ్చి ఐదు వికెట్లను సాధించాడు. వీరిద్దరికి జతగా స్పిన్నర్ అమిత్ మిశ్రాకు రెండు ఇన్నింగ్స్ లలో కలిపి మూడు వికెట్లు లభించాయి. మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లలో నలభై వికెట్లకు స్పిన్నర్లకు 34 వికెట్లు లభించడం విశేషం. యాభై వికెట్ల క్లబ్ లో జడేజా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో కలుపుకుని ఎనిమిది వికెట్లు సాధించిన రవీంద్ర జడేజా యాభై వికెట్ల క్లబ్ లో చేరాడు. 13 టెస్టు మ్యాచ్ లు ఆడిన జడేజా 53 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్ లీగ్ లో విశేషంగా రాణించి టెస్టుల్లో స్థానం సంపాదించిన జడేజా తదుపరి టెస్టుల్లో కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. -
విజయానికి నాలుగు వికెట్ల దూరంలో..
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించడానికి నాలుగు వికెట్లు దూరంలో నిలిచింది. 218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పయనిస్తోంది. 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. విలాస్(7)ఆరో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు డీన్ ఎల్గర్(16), ఫిలిండర్(1), డు ప్లెసిస్(1), హషీమ్ ఆమ్లా(0), ఏబీ డివిలియర్స్(16) పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు, అశ్విన్ , ఆరోన్, అమిత్ మిశ్రాలకు తలో వికెట్ లభించింది. -
విజయానికి నాలుగు వికెట్ల దూరంలో..
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించడానికి నాలుగు వికెట్లు దూరంలో నిలిచింది. 218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పయనిస్తోంది. 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. విలాస్(7)ఆరో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు డీన్ ఎల్గర్(16), ఫిలిండర్(1), డు ప్లెసిస్(1), హషీమ్ ఆమ్లా(0), ఏబీ డివిలియర్స్(16) పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు, అశ్విన్ , ఆరోన్, అమిత్ మిశ్రాలకు తలో వికెట్ లభించింది. -
విజయం దిశగా టీమిండియా
మొహాలి:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. మూడో రోజు 218 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. టీ విరామ సమయానికి 21 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం వేన్ జిల్(15), విలాస్(6)లు క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు డీన్ ఎల్గర్(16), ఫిలిండర్(1), డు ప్లెసిస్(1), హషీమ్ ఆమ్లా(0), ఏబీ డివిలియర్స్(16) పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు రెండు, అశ్విన్ , ఆరోన్, అమిత్ మిశ్రాలకు తలో వికెట్ లభించింది. సౌతాఫ్రికా విజయాన్ని అందుకోవాలంటే మరో 162 పరుగులు కావాలి. స్పిన్ బౌలర్లు రాణించడంతో బ్యాట్స్ మెన్ బ్యాట్ ఝులిపించడంలో విఫలమవుతున్నారు. -
వికెట్లే.. వికెట్లు
మొహాలీ: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ పరుగులకన్నా వికెట్ల వరద పారుతోంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా వరుసగా వికెట్లు సమర్పించుకోగా ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా పరిస్థితి అలాగే తయారైంది. పది పరుగులకే మూడు వికెట్లు సమర్పించుకున్న దక్షిణాఫ్రికా అతర్వాత తడబడుతూ బ్యాటింగ్ చేస్తూ 50 పరుగులు చేరుకునే సరికి ఐదు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా విజయాన్ని అందుకోవాలంటే మరో 160కిపైగా పరుగులు చేయాల్సి ఉంది. కానీ, బౌలర్లు ఈసారి విరుచుపడతుండటంతో బ్యాట్స్ మెన్ బ్యాట్ ఝలిపించడంలో విఫలమవుతున్నాడు. దీంతో మరో 20పరుగుల్లోపు 2వికెట్లు తీసుకుంటే భారత్‌కు తొలి టెస్టులో విజయం దక్కినట్లేనని భావించవచ్చు. ఇప్పటి వరకు జడేజా 2 వికెట్లు తీసుకోగా అశ్విన్, మిశ్రా, ఆరాన్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. -
కట్టడి చేస్తున్న టీమిండియా
మొహాలీ: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ కీలక మలుపు తిరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. 32 పరుగలకే సౌతాఫ్రికా నాలుగు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో స్టాయాన్ వాంజిల్(4), ఎల్గార్(14) ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన దిగ్గజ ఆటగాళ్లు ఫిలాందర్(1), డుప్లెసిస్(1), డివిలియర్స్(16) వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఆమ్లా డకౌట్ తో వెనుదిరిగాడు. మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుందనుకున్నప్పటికీ త్వరత్వరగా వికెట్లు సమర్పించుకుంది. లంచ్ విరామం తర్వాత 200 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగి తడబడుతూ బ్యాటింగ్ చేస్తూ వికెట్లు కోల్పోతోంది. -
టీమిండియా ఆలౌట్.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్
మొహాలి: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు.. మూడో రోజు లంచ్ విరామం తర్వాత టీమిండియా ఆలౌట్ అయింది. టీమిండియా అన్ని వికెట్లను కోల్పోయి 200 పరుగులు చేసింది. చివరగా ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతికి సాహ వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా 217 పరుగుల ఆధిక్యం నమోదుచేసుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 125 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన పుజారా, కొహ్లీ మూడో రోజు ఆటను దూకుడుగా ప్రారంభించారు. ఓవర్ నైట్ స్కోర్ కు 31 పరుగులు జోడించి.. భారీ లీడ్ దిశగా సాగుతున్నట్లు కనిపించారు. ఈ దశలో వరసగా బౌండరీలు బాది జోరుమీదున్న కెప్టెన్ కొహ్లీ(29)ని వాన్ జిల్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత మూడు పరుగులకే పుజారా(77)ను తాహిర్ ఔట్ చేశాడు. మరుసటి ఓవర్ లోనే రెహానే ఔట్ కావడంతో.. టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ జడేజా, మిశ్రా, అశ్విన్ లు వెంట వెంటనే ఔట్ కావడంతో.. ఓ దశలో 160/3 తో పటిష్టంగా కనిపించిన భారత్ లంచ్ విరామానికి 8 వికెట్లకు 185 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం మరి కాసేపటికే 200 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రొటీస్ బౌలర్లు హార్మర్ 4, ఇమ్రాన్ తాహిర్ చెరో4 వికెట్లు కూల్చగా.. ఫిలాండర్, వాన్ జిల్ చెరోక వికెట్ పడగొట్టారు. దీంతో దక్షిణాఫ్రికా తిరిగి బ్యాటింగ్ ప్రారంభించి రెండో ఓవర్లోనే తొలి వికెట్ సమర్పించుకుంది. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్, ఎల్గార్ ఉన్నారు. -
తిరుగుతోంది..
మొహాలి: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు.. మూడో రోజు లంచ్ విరామానికి టీమిండియా.. 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 125 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన పుజారా, కొహ్లీ మూడో రోజు ఆటను దూకుడుగా ప్రారంభించారు. ఓవర్ నైట్ స్కోర్ కు 31 పరుగులు జోడించి.. భారీ లీడ్ దిశగా సాగుతున్నట్లు కనిపించారు. ఈ దశలో వరసగా బౌండరీలు బాది జోరుమీదున్న కెప్టెన్ కొహ్లీ(29)ని వాన్ జిల్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత మూడు పరుగులకే పుజారా(77)ను తాహిర్ ఔట్ చేశాడు. మరుసటి ఓవర్ లోనే రెహానే ఔట్ కావడంతో.. టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ జడేజా, మిశ్రా, అశ్విన్ లు వెంట వెంటనే ఔట్ కావడంతో.. ఓ దశలో 160/3 తో పటిష్టంగా కనిపించిన భారత్ లంచ్ విరామానికి 8 వికెట్లకు 185 పరుగులు మాత్రమే చేసింది. ప్రొటీస్ బౌలర్లు హార్మర్, ఇమ్రాన్ తాహిర్ చెరో మూడు వికెట్లు కూల్చగా.. ఫిలాండర్ , వాన్ జిల్ చెరోక వికెట్ పడగొట్టారు. -
టపటపా వికెట్లు సమర్పిస్తున్నారు..
మొహాలి: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ టెన్షన్ పుట్టిస్తోంది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీం ఇండియా కాస్త నిలకడగా ఆడినట్లు కనపించినా శనివారం ఆట మొదలైన తర్వాత కాసేపటికే వరుసగా మూడు వికెట్లు సమర్పించుకుంది. తొలుత విరాట్ కోహ్లీ పెవిలియన్ బాట పట్టగా.. ఇమ్రా తాహిర్ ఆమ్లా వేసిన బంతికి పుజారా క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో అతడు సెంచరీ చేసే అవకాశం కోల్పోయి 77పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఆ వెంటనే, కోహ్లీ అవుటయిన అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రహానే కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి బీహామర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం సాహ, జడేజాలు క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 62 ఓవర్లలో టీమిండియా 171/5పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. -
కోహ్లీ అవుట్..
మొహాలి: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ హోరా హోరీగా సాగుతోంది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీం ఇండియా శనివారం ఆట మొదలై డ్రింక్స్ విరామ సమాయానికి మూడు వికెట్లను కోల్పోయి 162 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(1), పుజారా(76) బ్యాటింగ్ చేస్తున్నారు. కాగా, అంతకుముందు వాన్ జిల్ వేసిన బంతికి విరాట్ కోహ్లీ(29) అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరిగిన ఓపెనర్ శిఖర్ ధవన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరిన విషయం తెలిసిందే విజయ్ (47) పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరగగా.. కోహ్లీ మూడో వికెట్ సమర్పించుకున్నాడు. -
దూకుడుగా ఆడుతున్న టీమిండియా
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇప్పటికే 150 పరుగులకు పైగా లీడ్ ఉండటంతో.. టాపార్డర్ బ్యాట్స్ మెన్ ఇద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆట తొలి గంటలోనే ప్రొటీస్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. అంతకు ముందు రెండో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా 125 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. -
టీమిండియాను ఊరిస్తున్న మొహాలి!
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తోంది. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా బ్యాటింగ్ కొనసాగించడమే ఇందుకు కారణం. ప్రస్తుతం 142 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. మూడో రోజు సాధ్యమైనంత సమయం క్రీజ్ లో ఉండి మరో 100 పరుగులు చేసినా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆది నుంచి చర్చల్లో నిలిచిన మొహాలి పిచ్ లో తొలుత స్పిన్నర్లే హవానే కొనసాగినా.. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో సఫారీల స్పిన్ ను దిగ్విజయంగా అడ్డుకుందనే చెప్పాలి. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కోల్పోయిన రెండు వికెట్లలో ఒక వికెట్ మాత్రమే స్పిన్నర్ తాహీర్ కు లభించింది. ఈ మ్యాచ్ ను ఇప్పటివరకూ చూస్తే టీమిండియానే పైచేయి సాధించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 125 పరుగులు చేసి ఆధిక్యం దిశగా ముందుకు సాగుతోంది. ఓపెనర్ శిఖర్ ధవన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా డకౌట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచినా.. మరో ఓపెనర్ మురళీ విజయ్ (47) హాఫ్ సెంచరీ అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. టీమిండియా స్కోరు 95 పరుగుల వద్ద ఉండగా మురళీ విజయ్ రెండో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆ తరుణంలో చటేశ్వరా పూజారాకు జత కలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఆట ముగిసే సమయానికి పూజారా(63 బ్యాటింగ్), విరాట్ కోహ్లి(11 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు 28/2 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 184 పరుగులకు చాపచుట్టేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డివిలియర్స్ (63), ఆమ్లా(43), ఎల్గర్(37) తప్పా మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ నంబర్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు నేలకూల్చాడు. రవీంద్ర జడేజా 3, అమిత్ మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు. -
హోరాహోరీగా తొలి టెస్టు
-
హోరాహోరీగా తొలి టెస్టు
మొహాలి: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ హోరా హోరీగా సాగుతోంది. 28/2 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 184 పరుగులకు పరిమితం కాగా, ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా టీ విరామ సమయానికి వికెట్ నష్టానికి 13 పరుగులతో ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరిగిన ఓపెనర్ శిఖర్ ధవన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరాడు. మురళీ విజయ్(11), చటేశ్వర పూజారా(2) క్రీజ్ లో ఉన్నారు. దీంతో టీమిండియాకు ప్రస్తుతం 30 పరుగుల ఆధిక్యం లభించింది. రెండు రోజులు ముగియకుండానే 21 వికెట్లు నేలరాలడంతో మ్యాచ్ లో ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డివిలియర్స్ (63), ఆమ్లా(43), ఎల్గర్(37) తప్పా మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ నంబర్ స్కోరుకే పరిమితమయ్యారు. భారీ భాగస్వామ్యాలు నమోదు కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ప్రొటీస్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు నేలకూల్చాడు. రవీంద్ర జడేజా 3, అమిత్ మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 201 పరుగులకు ఆలౌటైంది. -
స్వల్ప స్కోరుకే సౌతాఫ్రికా ఆలౌట్
మొహాలి: భారత స్పిన్నర్లకు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ దాసోహమయ్యారు. సిసలైన 'స్పిన్'తో సఫారీలను టీమిండియా స్పిన్నర్లు చుట్టేశారు. స్పిన్నర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్ లో 184 పరుగులకే ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికాపై కోహ్లి సేనకు 17 పరుగుల ఆధిక్యం లభించింది. డివిలియర్స్(63), ఆమ్లా(43), ఎల్గర్(37) తప్పా మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ నంబర్ స్కోరుకే పరిమితమయ్యారు. భారీ భాగస్వామ్యాలు నమోదు కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ప్రొటీస్ టీమ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు నేలకూల్చాడు. రవీంద్ర జడేజా 3, అమిత్ మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 201 పరుగులకు ఆలౌటైంది. -
అశ్విన్ అదుర్స్
మొహాలి: టీమిండియా స్పిన్నర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ భరతం పడుతున్నారు. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు సఫారీ ఆటగాళ్లు సతమతవుతున్నారు. 28/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా లంచ్ విరామానికి ముందు మరో 3 వికెట్లు చేజార్చుకుంది. భోజన విరామానికి 127/5 స్కోరు చేసింది. డివిలియర్స్(26), ఫిలాండర్(2) క్రీజ్ లో ఉన్నారు. ఎల్గర్ 37, ఆమ్లా 43, విలాస్ 1, వాన్ జిల్ 5, ప్లెసిస్ 0 అవుటయ్యారు. తనపై ఉంచిన నమ్మకాన్ని అశ్విన్ నిలబెట్టుకున్నాడు. సిసలైన బౌలింగ్ తో సఫారీ బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. 4 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 201 పరుగులకు ఆలౌటైంది. -
భారత్ తో తొలి టెస్టు:దక్షిణాఫ్రికా 28/2
మొహాలి: టీమిండియాతో జరుగుతున్న మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డియాన్ ఎల్గర్(13 బ్యాటింగ్), హషీమ్ ఆమ్లా(9 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు వేన్ జిల్(5), డు ప్లెసిస్(0) లు పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ లభించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 201 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(75) మినహా ఎవరూ హాఫ్ సెంచరీ మార్కును చేరలేదు. ఆదిలోనే శిఖర్ ధవన్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరగా, ఆ తరువాత చటేశ్వర పూజారా(31), కెప్టెన్ విరాట్ కోహ్లి(1), అజింక్యా రహానే(15), సాహా(0)లు వరుసగా విఫలమయ్యారు. కాగా, చివర్లో అజయ్ జడేజా(38), రవి చంద్రన్ అశ్విన్(20) కాసేపు దక్షిణాఫ్రికా బౌలర్లను ప్రతిఘటించారు. అయితే జట్టు స్కోరు 196 పరుగుల వద్ద జడేజా ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరడంతో మిగతా రెండు వికెట్లు ఐదు పరుగుల వ్యవధిలో నేలకూలాయి. టీమిండియా జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. -
తీరు మారని టీమిండియా
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ 20 సిరీస్, వన్డే సిరీస్ ల లో పేలవమైన ఆటను కొనసాగించి వరుస సిరీస్ లను కోల్పోయిన టీమిండియా.. టెస్టుల్లో కూడా అదే ఆట తీరును కొనసాగిస్తోంది. నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇక్కడ గురువారం ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకే ఆలౌటయ్యింది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(75) మినహా ఎవరూ హాఫ్ సెంచరీ మార్కును చేరలేదు. ఆదిలోనే శిఖర్ ధవన్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరగా, ఆ తరువాత చటేశ్వర పూజారా(31), కెప్టెన్ విరాట్ కోహ్లి(1), అజింక్యా రహానే(15), సాహా(0)లు వరుసగా విఫలమయ్యారు. కాగా, చివర్లో అజయ్ జడేజా(38), రవి చంద్రన్ అశ్విన్(20) కాసేపు దక్షిణాఫ్రికా బౌలర్లను ప్రతిఘటించారు. అయితే జట్టు స్కోరు 196 పరుగుల వద్ద జడేజా ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరడంతో మిగతా రెండు వికెట్లు ఐదు పరుగుల వ్యవధిలో నేలకూలాయి. టీమిండియా జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎల్గర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా, ఇమ్రాన్ తాహీర్, ఫిలిందర్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. -
టీమిండియా తడబాటు
మొహాలి:నాలుగు టెస్టు సిరీస్ లో భాగంగా ఇక్కడ దక్షిణాఫ్రికాతో గురువారం ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధవన్ పరుగులేమీ చేయకుండానే ఫిలిండర్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. అనంతరం ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను మరో ఓపెనర్ మురళీ విజయ్, చటేశ్వర పూజారాలు తీసుకున్నారు. కాగా, పూజారా(31) రెండో వికెట్ గా అవుట్ అయ్యాడు. అటు తరువాత రెండో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(1) నిరాశపరిచి మూడో వికెట్ గా పెవిలియన్ బాట పట్టాడు. దాంతో టీమిండియా 65 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లోకి వెళ్లింది. ఆ తరుణంలో మురళీ విజయ్ -అజింక్యా రహానేల జోడి కాసేపు దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ప్రతిఘటించింది.. అయితే రహానే(15) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై టీమిండియా వరుసగా ప్రధాన వికెట్లను చేజార్చుకుంది. సాహా(0) , మురళీ విజయ్ (75) లు స్వల్ప పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. దీంతో టీమిండియా 154 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం టీమిండియా టీ విరామ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రవీంద్ర జడేజా(26), అశ్విన్(4) క్రీజ్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డియాన్ ఎల్గర్ నాలుగు వికెట్లు సాధించగా,ఫిలిందర్, రబడా, హర్మర్ లకు తలో వికెట్ దక్కింది. -
ఒక్క పరుగుకే బర్త్ డే బాయ్ అవుట్
మొహాలి: దక్షిణాఫ్రికా తో గురువారమిక్కడ ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియా తడబడింది. లంచ్ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ పరుగులేమీ చేయకుండానే మొదటి వికెట్ గా వెనుదిరిగాడు. పుజారాతో కలిసి మరో ఓపెనర్ మురళీ విజయ్ స్కోరు బోర్డును 60 పరుగులు దాటించాడు. 63 పరుగుల వద్ద పుజారా(31) రెండో వికెట్ గా అవుటయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన బర్త్ డే బాయ్ విరాట్ కోహ్లి ఇలా వచ్చి అలా వెళ్లాడు. 4 బంతులు ఆడిన కోహ్లి ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్, రబడా, ఎలగార్ తలో వికెట్ తీశారు. టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లి నేడు 27వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. -
ధావన్ డకౌట్
మొహాలి: దక్షిణాఫ్రికా తో గురువారమిక్కడ ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్ చేజార్చుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌటయ్యాడు. 1.4 ఓవర్ లో ఫిలాండర్ బౌలింగ్ లో ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మురళీ విజయ్(4), చతేశ్వర్ పుజారా(9) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. టీమిండియా 5 ఓవర్లలో 13/1 స్కోరు చేసింది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నాడు. -
టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
మొహాలి: దక్షిణాఫ్రికా తో గురువారమిక్కడ ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేయడానికి పిచ్ అనుకూలంగా ఉందని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. తాము బాగా బ్యాటింగ్ చేస్తే తనకు బర్త్ డే గిఫ్ట్ అవుతుందని అన్నాడు. టాస్ గెలవడంతోనే మ్యాచ్ తమ చేతుల్లోకి వచ్చినట్టు కాదని చెప్పాడు. భువనేశ్వర్, రోహిత్, కేఎల్ రాహుల్, స్టువర్ట్ బిన్నీ, ఇషాంత్ శర్మ మ్యాచ్ లో లేరని తెలిపాడు. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని సౌతాఫ్రికా కెప్టెన్ హషిమ్ ఆమ్లా అన్నాడు. ఈ మ్యాచ్ తో బౌలర్ రబడా టెస్టుల్లో అరంగ్రేటం చేస్తున్నాడని తెలిపాడు. కాగా, నేడు విరాట్ కోహ్లి 27వ బర్త్ డే. ఈ మ్యాచ్ లో గెలిచి పుట్టినరోజు కానుక అందుకోవాలని కోహ్లి భావిస్తున్నాడు. ఇక టెస్టు కెప్టెన్ గా స్వదేశంలో ఇదే తొలి మ్యాచ్.