భారత్-శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్‌కు ముందు ఓ షాకింగ్ వార్త అందరిని కలవరపెడుతుంది. టీ20 జట్టులో లేని లంక ఆటగాళ్లు ప్రయాణించిన వాహనంలో రెండు బుల్లెట్ షెల్స్ బయటపడటంతో లంక శిబిరంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. లంక క్రికెటర్లు ఓ ప్రైవేట్ బస్సులో తాము బస చేస్తున్న లలిత్ హోటల్ నుంచి టెస్ట్ మ్యాచ్ వేదిక అయిన పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) స్టేడియానికి వెళ్తుండగా, మార్గ మధ్యంలో జరిగిన సాధారణ పోలీసు తనిఖీల్లో రెండు ఖాళీ బుల్లెట్ షెల్స్ కనిపించాయి.
మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేస్తుండగా బస్సు లగేజ్ కాంపార్ట్‌మెంట్‌లో బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. లంక ప్లేయర్ల కోసం బస్సును అద్దెకి తీసుకోవడానికి ముందు ఓ మ్యారేజ్ ఫంక్షన్ కోసం వాడినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. చండీఘర్‌లోని తారా బ్రదర్స్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి బస్సు అద్దెకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, మొహాలీలో జరగనున్న టెస్ట్ మ్యాచ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి వందో టెస్ట్ కావడంతో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. పంజాబ్‌లో ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా ఈ మ్యాచ్‌కి ప్రేక్షకులను అనుమతించబోమని పీసీఏ వెల్లడించింది.
చదవండి: కోహ్లి 100వ టెస్ట్ ప్రేక్షకులు లేకుండానే, ఆ మరుసటి మ్యాచ్‌కు మాత్రం..!
Comments
Please login to add a commentAdd a comment