ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పె...
కృష్ణా, సాక్షి: గన్నవరం ఎయిర్‌పోర్టు�...
ఏలూరు, సాక్షి: ఏపీ బీజేపీలో అసంతృప్తి ...
బెంగళూరు, సాక్షి: కర్ణాటక రోడ్డు మరోస�...
హైదరాబాద్, సాక్షి: సంక్షేమ పథకాల లబ్�...
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోన�...
విజయవాడ, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధ�...
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజర�...
పగలు మనుషులకేనా? ప్రకృతిలో ఉన్న ప్రత�...
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్య పేరుతో ...
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో వ�...
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి రాజకీయం మారుత�...
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ...
Published Sat, Mar 5 2022 9:25 AM | Last Updated on Sat, Mar 5 2022 5:17 PM
రెండో రోజు ముగిసిన ఆట.. మెరిసిన జడ్డూ
శ్రీలంక, టీమిండియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ధనుంజయ డిసిల్వా 1, చరిత్ అసలంక 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ రెండు, జడేజా, బుమ్రా చెరొక వికెట్ తీశారు. ప్రస్తుతం లంక తొలి ఇన్నింగ్స్‌లో 466 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకముందు 6 వికెట్ల నష్టానికి 357 పరుగుల క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలిరోజు పూర్తి ఆధిపత్యం చూపించిన టీమిండియా రెండో రోజు ఆటలోనూ అదే జోరు కనబరిచింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా 175 పరుగులు నాటౌట్‌తో రెండో రోజు హైలెట్‌గా నిలిచాడు. అశ్విన్ కూడా 61 పరుగులతో రాణించడం విశేషం.
టీమిండియా బౌలర్ల దాటికి శ్రీలంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. 1 పరుగు చేసిన ధనుంజయ డిసిల్వా అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో లంక 103 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంక మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆట ముగించడానికి మరో మూడు ఓవర్లు ఆడాల్సి ఉంది.
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక బ్యాటింగ్‌లో తడబడుతుంది. 28 పరుగులు చేసిన కెప్టెన్ దిముత్ కరుణరత్నే జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం శ్రీలంక 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక 14, మాథ్యూస్ 9 పరుగులతో ఆడుతున్నారు.
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. లంక స్కోరు 48 పరుగుల వద్ద ఓపెనర్ తిరిమన్నే 17 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక జట్టు 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో దిమిత్ కరుణరత్నే(15), తిరుమానే(9) పరుగులతో క్రీజులో ఉన్నారు.
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. 572/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను భారత్ డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా, పంత్ చెలరేగి ఆడాడు. పంత్ 96 పరుగులు సాదించగా.. జడేజా 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 357 పరుగులతో రెండో రోజు ఆటను టీమిండియా ఆరంభించింది. ఇక శ్రీలంక బౌలర్లలో లక్మల్,ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దేనియా చెరో రెండు వికెట్లు సాధించారు.
శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 500 పరుగుల మార్క్‌ను దాటింది. భారత బ్యాటర్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. 155 పరుగులతో జడేజా నాటౌట్‌గా ఉన్నాడు. 123 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 8 వికెట్ల నస్టానికి 525 పరుగులు చేసింది.
471 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జయంత్ యాదవ్(2) ఫెర్నాండో బౌలింగ్‌లో తిరుమానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 115 ఓవర్లు ముగిసేసరికి భారత్ 472 పరుగులు చేసింది. క్రీజులో జడేజా, మహ్మద్ షమీ ఉన్నారు.
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో మెరిశాడు. 166 బంతుల్లో జడేజా 102 పరుగులు సాధించి నాటౌట్‌గా ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి.
462 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 61 పరుగులు చేసిన అశ్విన్.. లక్మల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 110 ఓవర్లు ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 462 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(99), జయాంత్ యాదవ్ ఉన్నారు.
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకు పోతుంది. 107 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(90), రవిచంద్రన్ అశ్విన్(55) పరుగులతో ఉన్నారు.
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 400 పరుగుల మార్క్‌ను దాటింది. 98 ఓవర్లు ముగిసేసరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 403 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(77),అశ్విన్(24) పరుగులతో ఉన్నారు.
శ్రీలంకతో జరగుతోన్న తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆర్ధ సెంచరీతో మెరిశాడు. 87 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(50),అశ్విన్(10) పరుగులతో ఉన్నారు.
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్ట్ మొదటి రోజు 357 పరుగులతో పటిష్ట స్ధితిలో నిలిచిన భారత్ రెండో రోజు ఆటను ప్రారంభించింది. క్రీజులో రవీంద్ర జడేజా(45), రవిచంద్రన్ అశ్విన్(10) పరుగులతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment