మొహాలీ వేదికగా శ్రీలంకతో రేపటి (మార్చి 4) నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్ట్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్‌లో 100వ టెస్ట్ కానుందన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది. కరోనా ఆంక్షల కారణంగా తొలుత ప్రేక్షకులను అనుమతించేది లేదని ప్రకటించిన బీసీసీఐ, కోహ్లి అభిమానుల ఒత్తిళ్లకు దిగొచ్చింది. మైదానంలోని 50 శాతం ప్రేక్షకులను అనుమతిచ్చేందుకు ఒప్పుకుంది. ఇప్పటికే ఈ టెస్ట్‌కి సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.
ఇదిలా ఉంటే, కెరీర్‌లో మైలురాయి టెస్ట్‌కి ముందు పరుగుల యంత్రం కోహ్లి ఒత్తిడికి గురవుతున్నాడని తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందే మొహాలీ చేరుకున్న అతను... నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్స్‌లో కోహ్లి.. నెట్స్‌లో ఏకంగా ఆరుసార్లు బౌల్డ్ అయ్యాడని సమాచారం. తన కెరీర్‌లో చిరకాలం గుర్తండిపోయే టెస్ట్‌లో సరిగ్గా పెర్ఫార్మ్ చేస్తానా లేదా అన్న ఆందోళనలో కోహ్లి ఉన్నట్లు తెలుస్తోంది.
పైగా అతను సెంచరీ బాది దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుండటంతో ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లి ఆ మార్కును అందుకోవాలని అతని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ అంచనాలే కోహ్లి ఒత్తిడికి కారణమని తెలుస్తోంది. కాగా, రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా రేపటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో రోహిత్ తొలిసారి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుండగా.. కోహ్లి కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు.
చదవండి: అంతా కోహ్లినే చేశాడు.. హిట్‌మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment