విజయం దిశగా టీమిండియా
మొహాలి:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. మూడో రోజు 218 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. టీ విరామ సమయానికి 21 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం వేన్ జిల్(15), విలాస్(6)లు క్రీజ్ లో ఉన్నారు.
అంతకుముందు డీన్ ఎల్గర్(16), ఫిలిండర్(1), డు ప్లెసిస్(1), హషీమ్ ఆమ్లా(0), ఏబీ డివిలియర్స్(16) పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు రెండు, అశ్విన్ , ఆరోన్, అమిత్ మిశ్రాలకు తలో వికెట్ లభించింది. సౌతాఫ్రికా విజయాన్ని అందుకోవాలంటే మరో 162 పరుగులు కావాలి. స్పిన్ బౌలర్లు రాణించడంతో బ్యాట్స్ మెన్ బ్యాట్ ఝులిపించడంలో విఫలమవుతున్నారు.