కట్టడి చేస్తున్న టీమిండియా
మొహాలీ: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ కీలక మలుపు తిరుగుతుంది. ఈ మ్యాచ్లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. 32 పరుగలకే సౌతాఫ్రికా నాలుగు వికెట్లను కోల్పోయింది.
ప్రస్తుతం క్రీజులో స్టాయాన్ వాంజిల్(4), ఎల్గార్(14) ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన దిగ్గజ ఆటగాళ్లు ఫిలాందర్(1), డుప్లెసిస్(1), డివిలియర్స్(16) వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఆమ్లా డకౌట్ తో వెనుదిరిగాడు. మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుందనుకున్నప్పటికీ త్వరత్వరగా వికెట్లు సమర్పించుకుంది. లంచ్ విరామం తర్వాత 200 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా బ్యాటింగ్కు దిగి తడబడుతూ బ్యాటింగ్ చేస్తూ వికెట్లు కోల్పోతోంది.