అశ్విన్ అదుర్స్ | Ravichandran Ashwin Double-Strike Sinks Proteas | Sakshi
Sakshi News home page

అశ్విన్ అదుర్స్

Published Fri, Nov 6 2015 11:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

అశ్విన్ అదుర్స్

అశ్విన్ అదుర్స్

మొహాలి: టీమిండియా స్పిన్నర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ భరతం పడుతున్నారు. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు సఫారీ ఆటగాళ్లు సతమతవుతున్నారు. 28/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా లంచ్ విరామానికి ముందు మరో 3 వికెట్లు చేజార్చుకుంది. భోజన విరామానికి 127/5 స్కోరు చేసింది. డివిలియర్స్(26), ఫిలాండర్(2) క్రీజ్ లో ఉన్నారు. ఎల్గర్ 37, ఆమ్లా 43, విలాస్ 1, వాన్ జిల్ 5, ప్లెసిస్ 0 అవుటయ్యారు.

తనపై ఉంచిన నమ్మకాన్ని అశ్విన్ నిలబెట్టుకున్నాడు. సిసలైన బౌలింగ్ తో సఫారీ బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. 4 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 201 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement