స్వల్ప స్కోరుకే సౌతాఫ్రికా ఆలౌట్ | south africa all out at 184 | Sakshi
Sakshi News home page

స్వల్ప స్కోరుకే సౌతాఫ్రికా ఆలౌట్

Published Fri, Nov 6 2015 1:46 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

స్వల్ప స్కోరుకే సౌతాఫ్రికా ఆలౌట్

స్వల్ప స్కోరుకే సౌతాఫ్రికా ఆలౌట్

మొహాలి: భారత స్పిన్నర్లకు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ దాసోహమయ్యారు. సిసలైన 'స్పిన్'తో సఫారీలను టీమిండియా స్పిన్నర్లు చుట్టేశారు. స్పిన్నర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్ లో 184 పరుగులకే ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికాపై కోహ్లి సేనకు 17 పరుగుల ఆధిక్యం లభించింది.

డివిలియర్స్(63), ఆమ్లా(43), ఎల్గర్(37) తప్పా మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ నంబర్ స్కోరుకే పరిమితమయ్యారు. భారీ భాగస్వామ్యాలు నమోదు కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ప్రొటీస్ టీమ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

భారత బౌలర్లలో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు నేలకూల్చాడు. రవీంద్ర జడేజా 3, అమిత్ మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 201 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement