తిరుగుతోంది..
మొహాలి: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు.. మూడో రోజు లంచ్ విరామానికి టీమిండియా.. 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 125 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన పుజారా, కొహ్లీ మూడో రోజు ఆటను దూకుడుగా ప్రారంభించారు. ఓవర్ నైట్ స్కోర్ కు 31 పరుగులు జోడించి.. భారీ లీడ్ దిశగా సాగుతున్నట్లు కనిపించారు.
ఈ దశలో వరసగా బౌండరీలు బాది జోరుమీదున్న కెప్టెన్ కొహ్లీ(29)ని వాన్ జిల్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత మూడు పరుగులకే పుజారా(77)ను తాహిర్ ఔట్ చేశాడు. మరుసటి ఓవర్ లోనే రెహానే ఔట్ కావడంతో.. టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ జడేజా, మిశ్రా, అశ్విన్ లు వెంట వెంటనే ఔట్ కావడంతో.. ఓ దశలో 160/3 తో పటిష్టంగా కనిపించిన భారత్ లంచ్ విరామానికి 8 వికెట్లకు 185 పరుగులు మాత్రమే చేసింది. ప్రొటీస్ బౌలర్లు హార్మర్, ఇమ్రాన్ తాహిర్ చెరో మూడు వికెట్లు కూల్చగా.. ఫిలాండర్ , వాన్ జిల్ చెరోక వికెట్ పడగొట్టారు.