
50 Percent Spectators Allowed For Virat Kohlis 100th Test: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌ను బీసీసీఐ ఎట్టకేలకు కనికరించింది. తమ అభిమాన క్రికెటర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే వందో టెస్ట్‌ను స్టేడియంలో విక్షించేందుకు అనుమతిచ్చింది. మార్చి 4 నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే టెస్ట్ మ్యాచ్ కోహ్లి కెరీర్‌లో వందో మ్యాచ్ కాగా.. స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తామని పేర్కొంది.
బీసీసీఐ చేసిన ఈ ప్రకటనతో కోహ్లి ఫ్యాన్స్ సంబురాల్లో మునిగి తేలుతున్నారు. కరోనా నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిచ్చేది లేదని బీసీసీఐ తొలుత ప్రకటించింది. అయితే, కోహ్లికి కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతివ్వాలని అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ తన అభిప్రాయాన్ని మార్చుకుంది.
ఇదిలా ఉంటే, బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అంగీకరించింది. ఈ విషయాన్ని కేసీఏ కార్యదర్శి సంతోష్ మీనన్ ధృవీకరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని ఆయన ప్రకటించారు. మార్చి 12 నుంచి 16 వరకు జరగనున్న బెంగళూరు టెస్టు.. డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరగనున్న విషయం తెలిసిందే.
చదవండి: కోహ్లి 100వ టెస్ట్ ప్రేక్షకులు లేకుండానే, ఆ మరుసటి మ్యాచ్‌కు మాత్రం..!
Comments
Please login to add a commentAdd a comment