
టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
మొహాలి: దక్షిణాఫ్రికా తో గురువారమిక్కడ ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేయడానికి పిచ్ అనుకూలంగా ఉందని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. తాము బాగా బ్యాటింగ్ చేస్తే తనకు బర్త్ డే గిఫ్ట్ అవుతుందని అన్నాడు. టాస్ గెలవడంతోనే మ్యాచ్ తమ చేతుల్లోకి వచ్చినట్టు కాదని చెప్పాడు. భువనేశ్వర్, రోహిత్, కేఎల్ రాహుల్, స్టువర్ట్ బిన్నీ, ఇషాంత్ శర్మ మ్యాచ్ లో లేరని తెలిపాడు.
తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని సౌతాఫ్రికా కెప్టెన్ హషిమ్ ఆమ్లా అన్నాడు. ఈ మ్యాచ్ తో బౌలర్ రబడా టెస్టుల్లో అరంగ్రేటం చేస్తున్నాడని తెలిపాడు.
కాగా, నేడు విరాట్ కోహ్లి 27వ బర్త్ డే. ఈ మ్యాచ్ లో గెలిచి పుట్టినరోజు కానుక అందుకోవాలని కోహ్లి భావిస్తున్నాడు. ఇక టెస్టు కెప్టెన్ గా స్వదేశంలో ఇదే తొలి మ్యాచ్.