వికెట్లే.. వికెట్లు
మొహాలీ: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ పరుగులకన్నా వికెట్ల వరద పారుతోంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా వరుసగా వికెట్లు సమర్పించుకోగా ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా పరిస్థితి అలాగే తయారైంది. పది పరుగులకే మూడు వికెట్లు సమర్పించుకున్న దక్షిణాఫ్రికా అతర్వాత తడబడుతూ బ్యాటింగ్ చేస్తూ 50 పరుగులు చేరుకునే సరికి ఐదు వికెట్లు కోల్పోయింది.
సౌతాఫ్రికా విజయాన్ని అందుకోవాలంటే మరో 160కిపైగా పరుగులు చేయాల్సి ఉంది. కానీ, బౌలర్లు ఈసారి విరుచుపడతుండటంతో బ్యాట్స్ మెన్ బ్యాట్ ఝలిపించడంలో విఫలమవుతున్నాడు. దీంతో మరో 20పరుగుల్లోపు 2వికెట్లు తీసుకుంటే భారత్కు తొలి టెస్టులో విజయం దక్కినట్లేనని భావించవచ్చు. ఇప్పటి వరకు జడేజా 2 వికెట్లు తీసుకోగా అశ్విన్, మిశ్రా, ఆరాన్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.