మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించడానికి నాలుగు వికెట్లు దూరంలో నిలిచింది. 218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పయనిస్తోంది. 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. విలాస్(7)ఆరో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు డీన్ ఎల్గర్(16), ఫిలిండర్(1), డు ప్లెసిస్(1), హషీమ్ ఆమ్లా(0), ఏబీ డివిలియర్స్(16) పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు, అశ్విన్ , ఆరోన్, అమిత్ మిశ్రాలకు తలో వికెట్ లభించింది.