
టపటపా వికెట్లు సమర్పిస్తున్నారు..
మొహాలి: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ టెన్షన్ పుట్టిస్తోంది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీం ఇండియా కాస్త నిలకడగా ఆడినట్లు కనపించినా శనివారం ఆట మొదలైన తర్వాత కాసేపటికే వరుసగా మూడు వికెట్లు సమర్పించుకుంది.
తొలుత విరాట్ కోహ్లీ పెవిలియన్ బాట పట్టగా.. ఇమ్రా తాహిర్ ఆమ్లా వేసిన బంతికి పుజారా క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో అతడు సెంచరీ చేసే అవకాశం కోల్పోయి 77పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఆ వెంటనే, కోహ్లీ అవుటయిన అనంతరం బ్యాటింగ్కు దిగిన రహానే కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి బీహామర్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం సాహ, జడేజాలు క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 62 ఓవర్లలో టీమిండియా 171/5పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది.