
ఒక్క పరుగుకే బర్త్ డే బాయ్ అవుట్
మొహాలి: దక్షిణాఫ్రికా తో గురువారమిక్కడ ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియా తడబడింది. లంచ్ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ పరుగులేమీ చేయకుండానే మొదటి వికెట్ గా వెనుదిరిగాడు. పుజారాతో కలిసి మరో ఓపెనర్ మురళీ విజయ్ స్కోరు బోర్డును 60 పరుగులు దాటించాడు. 63 పరుగుల వద్ద పుజారా(31) రెండో వికెట్ గా అవుటయ్యాడు.
తర్వాత బరిలోకి దిగిన బర్త్ డే బాయ్ విరాట్ కోహ్లి ఇలా వచ్చి అలా వెళ్లాడు. 4 బంతులు ఆడిన కోహ్లి ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్, రబడా, ఎలగార్ తలో వికెట్ తీశారు. టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లి నేడు 27వ బర్త్ డే జరుపుకుంటున్నాడు.