kohli out
-
భారత్ తో తొలి టెస్టు:దక్షిణాఫ్రికా 28/2
మొహాలి: టీమిండియాతో జరుగుతున్న మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డియాన్ ఎల్గర్(13 బ్యాటింగ్), హషీమ్ ఆమ్లా(9 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు వేన్ జిల్(5), డు ప్లెసిస్(0) లు పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ లభించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 201 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(75) మినహా ఎవరూ హాఫ్ సెంచరీ మార్కును చేరలేదు. ఆదిలోనే శిఖర్ ధవన్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరగా, ఆ తరువాత చటేశ్వర పూజారా(31), కెప్టెన్ విరాట్ కోహ్లి(1), అజింక్యా రహానే(15), సాహా(0)లు వరుసగా విఫలమయ్యారు. కాగా, చివర్లో అజయ్ జడేజా(38), రవి చంద్రన్ అశ్విన్(20) కాసేపు దక్షిణాఫ్రికా బౌలర్లను ప్రతిఘటించారు. అయితే జట్టు స్కోరు 196 పరుగుల వద్ద జడేజా ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరడంతో మిగతా రెండు వికెట్లు ఐదు పరుగుల వ్యవధిలో నేలకూలాయి. టీమిండియా జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. -
తీరు మారని టీమిండియా
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ 20 సిరీస్, వన్డే సిరీస్ ల లో పేలవమైన ఆటను కొనసాగించి వరుస సిరీస్ లను కోల్పోయిన టీమిండియా.. టెస్టుల్లో కూడా అదే ఆట తీరును కొనసాగిస్తోంది. నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇక్కడ గురువారం ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకే ఆలౌటయ్యింది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(75) మినహా ఎవరూ హాఫ్ సెంచరీ మార్కును చేరలేదు. ఆదిలోనే శిఖర్ ధవన్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరగా, ఆ తరువాత చటేశ్వర పూజారా(31), కెప్టెన్ విరాట్ కోహ్లి(1), అజింక్యా రహానే(15), సాహా(0)లు వరుసగా విఫలమయ్యారు. కాగా, చివర్లో అజయ్ జడేజా(38), రవి చంద్రన్ అశ్విన్(20) కాసేపు దక్షిణాఫ్రికా బౌలర్లను ప్రతిఘటించారు. అయితే జట్టు స్కోరు 196 పరుగుల వద్ద జడేజా ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరడంతో మిగతా రెండు వికెట్లు ఐదు పరుగుల వ్యవధిలో నేలకూలాయి. టీమిండియా జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎల్గర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా, ఇమ్రాన్ తాహీర్, ఫిలిందర్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. -
టీమిండియా తడబాటు
మొహాలి:నాలుగు టెస్టు సిరీస్ లో భాగంగా ఇక్కడ దక్షిణాఫ్రికాతో గురువారం ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధవన్ పరుగులేమీ చేయకుండానే ఫిలిండర్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. అనంతరం ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను మరో ఓపెనర్ మురళీ విజయ్, చటేశ్వర పూజారాలు తీసుకున్నారు. కాగా, పూజారా(31) రెండో వికెట్ గా అవుట్ అయ్యాడు. అటు తరువాత రెండో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(1) నిరాశపరిచి మూడో వికెట్ గా పెవిలియన్ బాట పట్టాడు. దాంతో టీమిండియా 65 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లోకి వెళ్లింది. ఆ తరుణంలో మురళీ విజయ్ -అజింక్యా రహానేల జోడి కాసేపు దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ప్రతిఘటించింది.. అయితే రహానే(15) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై టీమిండియా వరుసగా ప్రధాన వికెట్లను చేజార్చుకుంది. సాహా(0) , మురళీ విజయ్ (75) లు స్వల్ప పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. దీంతో టీమిండియా 154 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం టీమిండియా టీ విరామ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రవీంద్ర జడేజా(26), అశ్విన్(4) క్రీజ్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డియాన్ ఎల్గర్ నాలుగు వికెట్లు సాధించగా,ఫిలిందర్, రబడా, హర్మర్ లకు తలో వికెట్ దక్కింది. -
ఒక్క పరుగుకే బర్త్ డే బాయ్ అవుట్
మొహాలి: దక్షిణాఫ్రికా తో గురువారమిక్కడ ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియా తడబడింది. లంచ్ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ పరుగులేమీ చేయకుండానే మొదటి వికెట్ గా వెనుదిరిగాడు. పుజారాతో కలిసి మరో ఓపెనర్ మురళీ విజయ్ స్కోరు బోర్డును 60 పరుగులు దాటించాడు. 63 పరుగుల వద్ద పుజారా(31) రెండో వికెట్ గా అవుటయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన బర్త్ డే బాయ్ విరాట్ కోహ్లి ఇలా వచ్చి అలా వెళ్లాడు. 4 బంతులు ఆడిన కోహ్లి ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్, రబడా, ఎలగార్ తలో వికెట్ తీశారు. టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లి నేడు 27వ బర్త్ డే జరుపుకుంటున్నాడు.