అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును రోహిత్ సమం చేశాడు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో మూడు సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్ ధోనితో సమంగా నిలిచాడు.
ఇప్పటి వరకు రోహిత్ శర్మ 73 వన్డేల్లో 123 సిక్సర్లు బాదగా.. ధోని 116 ఇన్నింగ్స్‌లలో 123 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 3 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 42 పరుగులు సాధించాడు.
ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 85 బంతుల్లో కోహ్లి సెంచరీ సాధించాడు. అతడి సెంచరీ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. 147 పరుగులతో విరాట్ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
చదవండి: IND vs SL: ఆగని పరుగుల యంత్రం.. మరో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment