Breadcrumb
Live Updates
తొలిరోజు ముగిసిన ఆట.. టీమిండియాదే ఆధిపత్యం
టీమిండియా ఆధిపత్యం.. తొలి రోజు ముగిసిన ఆట
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు ఆట ముగిసింది.తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. జడేజా 45, అశ్విన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆటలో టీమిండియా అన్ని సెషన్లలోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 96, హనుమ విహారి 58, కోహ్లి 45 రాణించారు. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్డేనియా 2, లక్మల్, ఫెర్నాండో, లాహిరు కుమారా, డిసిల్వా తలా ఒక వికెట్ తీశారు.
సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో పంత్ ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 96 పరుగుల వద్ద లక్మల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 332 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా 35 పరుగులు, అశ్విన్(0) క్రీజులో ఉన్నారు.
క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడైన ఆటతీరు కనబరిచిన పంత్ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులతో పంత్ విరుచుకుపడ్డాడు. తొలి హాఫ్ సెంచరీకి 75 బంతులు తీసుకున్న పంత్.. సెంచరీ చేసే క్రమంలో 22 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. దీన్నిబట్టే పంత్ బ్యాటింగ్ ఎంత విధ్వంసరంగా సాగిందో.
రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ..
టీమిండియా బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా దూకుడుగా ఇన్నింగ్స్ ఆడుతుండడంతో టీమిండియా స్కోరు పరుగులు పెడుతుంది. అర్థసెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. గేర్ మార్చాడు. సిక్సర్లు, బౌండరీలతో స్కోరుబోర్డను పరుగులెత్తిస్తున్నాడు. మరోవైపు జడేజా కూడా 26 పరుగులతో ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 76 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. పంత్ 72, జడేజా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.
శ్రేయాస్ అయ్యర్(27) ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ డిసిల్వా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 62 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
60 ఓవర్లకు భారత్ స్కోర్: 224/4
శ్రేయస్ అయ్యర్(27),పంత్(24) నిలికడగా ఆడుతున్నారు. 60 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.
53 ఓవర్లుకు భారత్ స్కోర్: 199/4
53 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 4 వికెట్ల నస్టానికి 199 పరుగులు చేసింది. క్రీజులో పంత్(12),శ్రేయస్ అయ్యర్(14) పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. విహారి ఔట్
టీమిండియా నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 58 పరుగులు చేసిన విహారి.. ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 48 ఓవర్లకు భారత్ 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. క్రీజులో పంత్(10), శ్రేయస్ అయ్యర్(2) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. విరాట్ కోహ్లి ఔట్
టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కోహ్లి 47 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. లసిత్ ఎంబుల్దెనియా బౌలింగ్‌లో కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. అయితే కోహ్లి సెంచరీ సాధిస్తాడని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. క్రీజులో విహారితో పాటు, పంత్ ఉన్నాడు.
41 ఓవర్లు భారత్ స్కోర్: 162/2
41 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్లు నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో విహారి(54), కోహ్లి(40) పరుగులతో ఉన్నారు.
30 ఓవర్లకు టీమిండియా స్కోర్: 124/2
30 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్లు నష్టానికి 124 పరుగులు చేసింది. క్రీజులో విహారి(41),కోహ్లి(19) పరుగులతో ఉన్నారు.
లంచ్ విరామానికి టీమిండియా స్కోర్: 109/2
తొలి రోజు లంచ్ విరామానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 109 పరుగులు సాధించింది. క్రీజులో విహారి(30),కోహ్లి(15) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. అగర్వాల్ ఔట్
80 పరుగుల వద్ద టీమిండియా మయాంక్ అగర్వాల్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన అగర్వాల్.. లసిత్ ఎంబుల్దెనియా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో విహారి, కోహ్లి ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ (29) ఔట్
52 పరుగులు వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కుమార బౌలింగ్‌లో లక్మల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్లు ముగిసేపరికి వికెట్ నష్టానికి భారత్ 53 పరుగులు చేసింది. క్రీజులో ఆగర్వాల్(21),విహారి(1)
ఐదు ఓవర్లకు భారత్ స్కోర్: 23/0
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఐదు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(9), ఆగర్వాల్(13) పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..
మొహాలీ వేదికగా శ్రీలంకతో తొలి టెస్ట్‌కు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన టెస్ట్ కెరీర్లో 100వ మ్యాచ్ ఆడనున్నాడు. అదే విధంగా రోహిత్ తొలిసారి భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
తుది జట్లు
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, జయంత్ యాదవ్
శ్రీలంక: దిముత్ కరుణరత్నే(కెప్టెన్), లహిరు తిరిమన్నె, పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా, లహిరు కుమార
Related News By Category
Related News By Tags
-
విరాట్ కోహ్లి కోసం రంగంలోకి దిగిన వికాస్ కోహ్లి
లిస్ట్-ఏ ఫార్మాట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత 7 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్నాడు. మూడు మ్యాచ...
-
మరో మైలురాయిని తాకిన రోహిత్ శర్మ
టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ మరో మైలురాయిని తాకాడు. వడోదరలో న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 11) జరిగిన వన్డే మ్యాచ్‌లో 2 సిక్సర్లు బాదడంతో అంతర్జాతీయ క్రికెట్లో 650 సిక్సర్ల మైలురాయిని (539 ఇన్...
-
గెలుపు తలుపు తీసే క్రికెటర్లకు...
వడోదర: ప్రస్తుత టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) వినూత్నంగా ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసింది. ఏళ్ల తరబడి ‘టన్’లకొద్దీ పరుగులతో భారత క్ర...
-
విరాట్ విశ్వరూపం.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
భారత పురుషల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. ఆదివారం వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యా...
-
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో దుమ్ములేపిన విరాట్.. ఇప్పుడు కివీస్‌తో వన్డేల్లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. వడోదర వేదికగ...


