'ఆ టైటిల్ కంటే.. ఇదే బెస్ట్! | This win more satisfying than 2012: Narine | Sakshi
Sakshi News home page

'ఆ టైటిల్ కంటే.. ఇదే బెస్ట్!

Published Mon, Jun 2 2014 12:39 PM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

'ఆ టైటిల్ కంటే.. ఇదే బెస్ట్!

'ఆ టైటిల్ కంటే.. ఇదే బెస్ట్!

బెంగళూర్:గతంలో గెలిచిన ఐపీఎల్ టైటిల్ కంటే..   ప్రస్తుతం గెలిచిన ఈ టైటిలే ఎక్కువ ఆనందాన్నిచ్చిందని ఆ జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్ అభిప్రాయపడ్డాడు.  2012 లో కోల్ కతా టైటిల్ ను గెలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూనే తనకు అధిక సంతృప్తినిచ్చింది మాత్రం నిన్న గెలిచిన టైటిలేనని తెలిపాడు. తమ టీం సభ్యుల పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్నాడు.  పంజాబ్ విసిరిన 200 స్కోరును ఛేజ్ చేయడం సాధారణ విషయం కాదన్నాడు.  జూన్ 8 నుంచి వెస్టిండీస్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్ కు ముందు నిర్వహించే శిక్షణా క్యాంపుకు కూడా కాదనుకుని ఐపీఎల్ ఫైనల్లో ఆడిన నరైన్..  టోర్నీలో  అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా గుర్తింపు పొందాడు.

 

ఈ సీజన్ లో 21 వికెట్లు తీసి ఆకట్టుకున్న నరైన్..కోల్ కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీని పేలవమైన ఆటతో ఆరంభించిన కోల్ కతా.. అసలు ప్లే ఆఫ్ కు వెళ్లడమే కష్టమని అంతా భావించారు. కాగా, భారత్ లో జరిగిన వరుస తొమ్మిది మ్యాచ్ ల్లో అనూహ్యం విజయం సాధించి  ఏకంగా టైటిల్ ను చేజిక్కించుకుని అందరికీ షాకిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement