
గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో రెట్టింపు హుషారుగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. రావల్పిండి వేదికగా పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో తనలోని డ్యాన్సింగ్ టాలెంట్‌ను మరోసారి బయటపెట్టాడు. ఇదే టెస్ట్ సందర్భంగా పుష్ప సినిమాలోని 'తగ్గేదేలే' డైలాగ్‌ను ఇమిటేట్ చేసిన అతను.. టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు మైదానంలో భాంగ్రా నృత్యం (పంజాబీ డ్యాన్స్) చేసి అందరినీ ఎంటర్‌టైన్ చేశాడు. 30 సెకెన్లకు పైగా అదిరేటి స్టెప్పులేసిన వార్నర్.. మైదానంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరలవుతోంది.
The crowd and the camera love @davidwarner31 🕺🏼#BoysReadyHain I #PAKvAUS pic.twitter.com/UWQYAjTLsk
— Pakistan Cricket (@TheRealPCB) March 8, 2022
కాగా, వార్నర్‌కు ఇలా డ్యాన్సులేయడం, తెలుగు సినిమాల్లోని డైలాగ్‌లను ఇమిటేట్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో అతను తెలుగు హీరోల ముఖాలను తన ముఖంతో మార్ఫింగ్ చేసి పాపులర్ డైలాగులను అప్పజెప్పాడు. అతనితో పాటు అతని భార్య, పిల్లలు కూడా పోటీపడి మరీ డ్యాన్స్‌లు చేసి, అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు.
ఇదిలా ఉంటే, 35 ఏళ్ల డేవిడ్ వార్నర్‌ను ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. డీసీ వార్నర్‌ను రూ. 6.25 కోట్లకు సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్.. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 150 మ్యాచ్‌లు ఆడి 41 సగటుతో 5449 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ?