Bhangra dance
-
ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా స్టెప్పులు వేయడం ఇల్లా!
ఆఫీసులో ఉద్యోగులు ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు...‘ఆఫీసు వర్క్ చేస్తారు’ అని మాత్రమే ఊరుకోనక్కర్లేదు. ‘భాంగ్రా డ్యాన్స్ కూడా చేస్తారు’ అని భేషుగ్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇదిప్పుడు ఒక ట్రెండ్‌గా మారనుంది. విషయంలోకి వస్తే... డల్ వర్క్‌డేకు ఒక కార్పొరేట్ కంపెనీ ఫన్ ట్విస్ట్ ఇచ్చింది.‘పనిచేసింది చాలు. ఇప్పుడిక భాంగ్రా నేర్చుకోండి’ అంటూ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్, డ్యాన్సర్ సాహిల్శర్మను ఆఫీసుకు తీసుకువచ్చింది. ‘లెట్స్ డ్యాన్స్’ అంటూ శర్మ భాంగ్రా స్టెప్పులు స్టార్ట్ చేయడంతో ఉద్యోగులు ఎవరి డెస్క్‌ల దగ్గర వారు అతడిని అనుసరించి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. ‘ఐ వాంట్ యాన్ ఆఫీస్ లైక్ దిస్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో 2.9 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ‘గుడ్ ఐడియా. 9 టు 5 జాబ్ వల్ల ఉద్యోగులు ఫిజికల్ యాక్టివిటీకి దూరం అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల వ్యాయామం చేసినట్లుగా ఉంటుంది. హుషారు వస్తుంది’ అని ఒక యూజర్ స్పందించాడు. View this post on Instagram A post shared by Sahil sharma (@sahil_sharma0007) (చదవండి: సిరియా భూకంప శిథిలాల్లో బొడ్డుతాడుతో దొరికిన మిరాకిల్ బేబి ఎక్కడుందో తెలుసా!) -
PAK Vs AUS: వార్నర్ ఏమాత్రం తగ్గట్లేదుగా.. ఈసారి భల్లే భల్లే డ్యాన్స్‌తో..!
గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో రెట్టింపు హుషారుగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. రావల్పిండి వేదికగా పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో తనలోని డ్యాన్సింగ్ టాలెంట్‌ను మరోసారి బయటపెట్టాడు. ఇదే టెస్ట్ సందర్భంగా పుష్ప సినిమాలోని 'తగ్గేదేలే' డైలాగ్‌ను ఇమిటేట్ చేసిన అతను.. టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు మైదానంలో భాంగ్రా నృత్యం (పంజాబీ డ్యాన్స్) చేసి అందరినీ ఎంటర్టైన్ చేశాడు. 30 సెకెన్లకు పైగా అదిరేటి స్టెప్పులేసిన వార్నర్.. మైదానంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరలవుతోంది. The crowd and the camera love @davidwarner31 🕺🏼#BoysReadyHain I #PAKvAUS pic.twitter.com/UWQYAjTLsk — Pakistan Cricket (@TheRealPCB) March 8, 2022 కాగా, వార్నర్‌కు ఇలా డ్యాన్సులేయడం, తెలుగు సినిమాల్లోని డైలాగ్‌లను ఇమిటేట్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో అతను తెలుగు హీరోల ముఖాలను తన ముఖంతో మార్ఫింగ్ చేసి పాపులర్ డైలాగులను అప్పజెప్పాడు. అతనితో పాటు అతని భార్య, పిల్లలు కూడా పోటీపడి మరీ డ్యాన్స్‌లు చేసి, అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇదిలా ఉంటే, 35 ఏళ్ల డేవిడ్ వార్నర్‌ను ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. డీసీ వార్నర్‌ను రూ. 6.25 కోట్లకు సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్.. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 150 మ్యాచ్‌లు ఆడి 41 సగటుతో 5449 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ? -
తగ్గేదేలే!.. భాంగ్రా డ్సాన్స్‌తో దుమ్ములేపిన వధువు.. వైరల్ వీడియో
పెళ్లంటే, ఎన్నో పనులు, టెన్షన్లు, హడావిడీ.. ఇవన్నీ కొన్ని రోజుల కిత్రం వరకు.. ఇప్పుడు పెళ్లంటే ఓ సెలబ్రేషన్ ,హంగామా, ఎంజాయ్మెంట్స్. ఊరి నుంచి సిటీ వరకు ఎక్కడ పెళ్లి జరిగినా ఓ పండుగలా చేస్తున్నారు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టే క్షణాలను మధుర జ్ఞాపకంగా తీర్చి దిద్దుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లిలో డ్యాన్స్ చేయడం కామన్ అయిపోయింది. అయితే పంజాబ్‌లో ఫేమస్ అయిన భాంగ్రా డ్యాన్స్ వేయడం కొంచెం స్పెషల్. తాజాగా ఓ వధు భాంగ్రా డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో వధువు ఆయుషీ..వరుడితో కలిసి ఎంతో ఉత్సాహంగా భాంగ్రా డాన్స్ చేసింది. పెళ్లి దుస్తులు గోల్డ్ లెహంగాలో మెరిసిపోతూ.. అదిరిపోయే స్టెప్పులేసింది. డోలు చప్పుళ్లు, బీట్స్‌కి తగ్గట్టుగా డ్యాన్ చేసింది. కరెన్సీ నోటును చేతిలో పట్టుకొని చిందులేసింది. ఆ తర్వాత వరుడు కూడా ఆమెపై కరెన్సీ నోట్లను విసిరాడు. ‘సాధారణ వధువు కాదు. ఇంత కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు దీనిని 25 లక్షల మందికి పైగా చూడగా.. 1.68 లక్షల మందికి పైగా లైక్ చేశారు. చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా దాడి: హృదయ విదారకం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో View this post on Instagram A post shared by Inderpreet | MAKEUP ARTIST💄 (@ipglitz) దీనిపై నెటిజన్లు స్పందిస్తూ "మొత్తానికి వధువు తన సిగ్గును పక్కనపెట్టి డాన్స్ చెయ్యడానికి భయపడలేదు. ఇది నాకు కొత్త ఆనందాన్ని తీసుకొచ్చింది. అని కామెంట్ చేశారు. ‘ బరువైన వివాహ లెహంగా వేసుకొని డాన్స్ చెయ్యడం కష్టమే. అద్భుతం. రాక్ స్టార్ వధువు’ అంటూ నెజినట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
భాంగ్రా నృత్యంతో పంజాబ్ సీఎం హల్చల్
చండిగఢ్: పంజాబ్ నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చాలా ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో చన్నీ ఇటీవల పదవీ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో "భాంగ్రా" నృత్యంతో సందడి చేశారు. (Charanjit Channi:తొలి మీడియా సమావేశంలో భావోద్వేగం) కపూర్తలాలోని ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మ్యూజియం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక ఈవెంట్లో వేదికపై ఉన్న కళాకారులతో జత కలిశారు. వారితో పాటు ఉత్సాహంగా స్టెప్పులేసి అక్కడున్న వారందరిలో జోష్ నింపారు. కాగా సీఎంగా జలంధర్‌లో జిల్లాలో తన తొలి పర్యటన సందర్భంగా, 101పైగా ఎకరాల విస్తీర్ణంలో గురు రవిదాస్ చైర్ ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధవా , కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి పర్గత్ సింగ్‌తో ఇక్కడ పర్యటించారు డేరా సఖండ్ బల్లన్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం, రవిదాస్ చైర్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రానున్న పది సంవత్సరాల పాటు దీని నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చూస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. #WATCH | Punjab Chief Minister Charanjit Singh Channi breaks into Bhangra at an event in Kapurthala. (Source: Information Public Relations Punjab) pic.twitter.com/4xg7iDKorW — ANI (@ANI) September 23, 2021 -
వైరల్: చహల్ భార్యతో గబ్బర్ చిందులు
ఢిల్లీ: టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ బాంగ్రా స్టెప్పులతో అదరగొట్టాడు. యజ్వేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మతో కలిసి ధావన్ బాంగ్రా డ్యాన్స్‌తో ఇరగదీశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ముందుగా ధావన్ బాంగ్రా డ్యాన్స్‌ను అనుకరించగా.. అతన్ని అనుసరిస్తూ ధనశ్రీ డ్యాన్స్ చేసింది. అయితే ధావన్ ప్రస్తుతం ఐపీఎల్ సన్నాహకాల్లో బిజీగా ఉండడంతో తాజాగా రిలీజ్ చేసిన వీడియో పాతదని తెలిసింది. ఇంతకముందు కూడా వీరిద్దరు కలిసి డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఫామ్‌లోకి వచ్చిన ధావన్ ఐపీఎల్ 2021 సీజన్‌కు సిద్ధమయ్యాడు.ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ధావన్ నూతనోత్సాహంతో బరిలోకి దిగనున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేలు కలిపి 169 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. చదవండి: క్వారంటైన్ కలిపింది ఆ ఇద్దరినీ... ఢిల్లీ క్యాపిటల్స్ నూతన సారధిగా రిషబ్ పంత్ View this post on Instagram A post shared by Dhanashree Verma Chahal (@dhanashree9) -
రాజీవ్ గుప్తాకు యూకే ప్రధాని ప్రశంస
లండన్: లాక్డౌన్ కాలంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఫ్రీ ఆన్లైన్ భాంగ్రాసైజ్ సెషన్లతో యూకే వాసులకు సాయం చేస్తోన్న భారత సంతతి డ్యాన్సర్ రాజీవ్ గుప్తాపై ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో గత నెలలో రాజీవ్ గుప్తాకు ‘పాయింట్ ఆఫ్ లైట్ ’అనే గౌరవం కూడా లభించింది. సమాజంలో మార్పు కోసం కృషి చేస్తోన్న వాలంటీర్లను యూకేలో ప్రతివారం ‘పాయింట్ ఆఫ్ లైట్’ పేరుతో గౌరవిస్తారు. ఈ సందర్భంగా జాన్సన్ రాజీవ్ గుప్తాను ప్రశంసిస్తూ ఓ లేఖ రాశారు. ‘గత కొన్ని నెలలుగా మీ భాంగ్రా క్లాసులు.. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఇళ్లకే పరిమితమైన ప్రజల్లో శక్తిని నింపుతున్నాయి. ప్రజలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి మీ తరగతలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో మీరు చాలా మందికి ‘పాయింట్ ఆఫ్ లైట్’గా నిలిచారు. మిమ్మల్ని ఈ విధంగా గుర్తించగలగినందుకు నేను సంతోషిస్తున్నాను’ అని జాన్సన్ లేఖలో పేర్కొన్నారు. (‘మేడ్ ఇన్ ఇండియా’ సైకిల్‌పై బ్రిటన్ ప్రధాని) ఈ సందర్భంగా రాజీవ్ గుప్తా మాట్లాడుతూ.. ‘మనం ఉల్లాసంగా, సానుకూలంగా, శక్తివంతగా ఉండటానికి భాంగ్రా డ్యాన్స్ సాయం చేస్తుందని నేను నమ్ముతాను. నా భాంగ్రా సైజ్ సెషన్లతో లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఈ విధంగా సాయం చేయగల్గుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ప్రయత్నం ఇంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’ అన్నారు. రాజీవ్ గుప్తా గత 15 సంవత్సరాలుగా భాంగ్రా డ్యాన్స్ నేర్పిస్తున్నారు. మాంచెస్టర్, బర్మింగ్‌హామ్‌లో రెగ్యులర్ డ్యాన్స్ ఫిట్నెస్ తరగతులను నిర్వహిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే లండన్ 2012 ఒలంపిక్స్ ప్రారంభోత్సవంలో రాజీవ్ గుప్తా ప్రదర్శన ఇచ్చారు. అంతేకాక బీబీసీ ప్రసిద్ధ ‘స్ట్రిక్ట్లీ కమ్ డాన్సింగ్’ ప్రదర్శనలో భాంగ్రా గురించి ప్రొఫెషనల్ డ్యాన్సర్లకు శిక్షణ ఇచ్చారు. -
వార్నర్ ‘ఫ్యామిలీ బాంగ్రా’ ధమాకా
హైదరాబాద్ : టిక్ టాక్ ద్వారా వీడియోలు చేసి భారత్‌లో అభిమానుల్ని పెంచుకుంటున్నాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ క్రికెటర్ చేసిన బుట్టబొమ్మ సాంగ్ టిక్ టాక్ బాగా పాపులర్ కావడంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. మహేశ్‌బాబు ‘పోకిరి’డైలాగ్‌తో పాటు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్ బ్లాక్’ సాంగ్‌కు టిక్‌టాక్ చేసి అభిమానుల్ని అలరించారు. అలాగే ప్రభాస్ ‘బాహుబలి’ డైలాగ్‌కు టిక్‌టాక్ వీడియో చేసి అందరినీ అశ్చర్యపరిచాడు. (చదవండి : మహేశ్ పాటకు చంపేశావ్ పో..) తాజాగా వార్నర్ ఫ్యామిలి భారతీయ వివాహాలలో చాలా మందికి ఇష్టమైన భాంగ్రా నృత్యం చేసి అలరించింది. వార్నర్ భార్య, ఇద్దరు కుమార్తెలు కలిసి భాంగ్రా ఫంక్షన్ సాంగ్‌కు స్టెప్పులేశారు. పాటకు తగ్గట్టుగా స్టెప్పులేయనప్పటికీ.. వార్నర్ ‘బాంగ్రా’ డాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన వార్నర్ ఫ్యామిలీ ‘పంజాబీ’ పాటకు నృత్యం చేయడం భారతీయులను ఆకట్టకుంటుంది. ఇక వరుసగా టాలీవుడ్ పాటలకు, డైలాగ్స్‌కి టిక్‌టాక్ వీడియోలు చేయడంతో వార్నర్‌పై పలు హీరోల అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తమ అభిమాన హీరోలకు సంబంధించిన మరిన్ని పాటలకు, డైలాగ్‌లకు టిక్‌టాక్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. (చదవండి : వార్నర్ మరో టిక్‌టాక్.. ఈ సారి బాహుబలి) -
బాంగ్రా డ్యాన్స్‌కు మెలానియా ట్రంప్ ఫిదా
న్యూఢిల్లీ : రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి వచ్చిన ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం రాత్రి తిరిగి అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో తన డ్రెస్సింగ్, హావభావాలు, మాట్లాడే తీరుతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న మెలానియా వెళ్తూ వెళ్తూ ఎన్నో మధుర స్మృతులను తన వెంట తీసుకెళ్లారు. పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీలోని నానక్పూర్‌లో ఉన్న సర్వోదయా ప్రభుత్వ పాఠశాలను అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సందర్శించారు. పాఠశాలలో అమలు చేస్తున్న హ్యాపినెస్ విద్యా విధానాన్ని మెలానియా స్వయంగా పరిశీలించారు. క్లాస్‌రూంలో చిన్నారులతో ముచ్చటించిన మెలానియా.. విద్యార్థులు వేసిన సూర్య నమస్కారాలు ఆసక్తిగా తిలకించారు. తరగతి గదిలో టీచర్‌గానూ మారిన మెలానియా చిన్నారులతో ముచ్చటించారు. (అందరి చూపులు ఆమె వైపే..!) ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల డ్యాన్స్‌ను చూస్తూ ఉత్సాహంగా గడిపారు. తర్వాత పాఠశాల ఆవరణలో స్టేజ్‌పైన కొంతమంది విద్యార్థినులు పంజాబీ పాటకు నృత్యం చేస్తుండగా మెలానియా విద్యార్థుల పక్కన కూర్చొని చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేయడం ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఒక పిల్లాడు యూఎస్ జెండాను తన చేతిలో పట్టుకొని బాంగ్రా డ్యాన్స్ చేయడం మెలానియాను విశేషంగా ఆకర్షించింది. మెలానియా ఒక గంట పాటు సర్వోదయా స్కూల్ విద్యార్థులతో ఆనందంగా గడిపారు. కాగా మెలానియా పిల్లలతో గడిపిన ఆనంద క్షణాలను ఏఎన్ఐ సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 'హ్యాపినెస్ విద్యా విధానాన్ని' అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేకపోవడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు. (ట్రంప్ పర్యటన : మిడి డ్రెస్‌లో ఇవాంకా) #WATCH Delhi: First Lady of the United States, Melania Trump watches a dance performance by students at Sarvodaya Co-Ed Senior Secondary School in Nanakpura. pic.twitter.com/dBCuTzvymF — ANI (@ANI) February 25, 2020 -
అశ్విన్ అదరగొట్టాడు చూడండి
మొహాలి: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ డాన్స్ ఇరగతీశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత భాంగ్రా నృత్యంతో సందడి చేశాడు. ఐఎస్ బింద్రా స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 12 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు. మ్యాచ్ గెలిచిన ఆనందంలో పంజాబ్ ఆటగాళ్లు మైదానంలో నటుడు సోనూ సూద్‌తో కలిసి సందడి చేశారు. డ్రమ్స్ వాయిస్తూ డాన్స్‌లు చేశారు. వీరితో పాటు అశ్విన్ కూడా పాదం కలిపాడు. ఈ వీడియోను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఆటతోనే కాదు డాన్స్‌తోనూ అభిమానులను అశ్విన్ అలరిస్తున్నాడు. (చదవండి: పంజాబ్ ప్రతాపం) View this post on Instagram Bhangra ta sajda jado nachche sadda skipper!🕺 . . . #SaddaPunjab #KXIPvRR #VIVOIPL @rashwin99 A post shared by Kings XI Punjab (@kxipofficial) on Apr 16, 2019 at 12:18pm PDT -
పాక్‌పై గెలుపు; భాంగ్రా స్టెప్పులేసిన కివీస్ ఆటగాళ్లు
‘ఓయ్ హోయ్’ ట్రోఫీలో భాగంగా అబుదాబి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ స్ఫూర్తిదాయక విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఏడు నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కోల్పోయినా... చివర్లో ప్రత్యర్థి జట్టును కట్టడిచేసి కేవలం నాలుగు పరుగుల తేడాతో గెలుపు బావుటా ఎగురవేసింది. అయితే ఈ థ్రిల్లింగ్ విక్టరీని కివీస్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకున్న తీరు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. డ్రెస్సింగ్ రూంలో భాంగ్రా స్టైల్లో వీరు వేసిన స్టెప్పులకు భారత అభిమానులు ఫిదా అవుతున్నారు. టీమిండియా క్రికెటర్లు భజ్జీ, యూవీలను ట్యాగ్ చేస్తూ.. ‘న్యూజిలాండ్ డ్రెస్సింగ్ రూంలో పంజాబీ పాటలు.. వహ్వా’ అంటూ మురిసిపోతున్నారు. కాగా ఈ వీడియోను పాకిస్తాన్‌కు చెందిన ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడం విశేషం. New Zealand players celebrating the win in Abu Dhabi with a bit of bhangra #PAKvNZ pic.twitter.com/UJNN0FRnH7 — Saj Sadiq (@Saj_PakPassion) November 19, 2018 -
భాంగ్రా డ్యాన్స్‌తో ఇరగదీసిన ప్రధాని
ఇటీవల ఎన్నికల్లో కెనడా వాసుల హృదయాలను, ఓట్లను కొల్లగొట్టిన ఆ దేశ యువ ప్రధాని జస్టిన్ ట్రూడ్యూ.. ఓ వీడియోతో భారతీయుల మనస్సుల్లోనూ చోటు సంపాదించారు. ఓ ప్రవాస భారతీయ కార్యక్రమంలో హుషారెత్తించే భాంగ్రా డ్యాన్స్‌తో ఆయన అదరగొట్టారు. కుర్తా-పైజామా ధరించి.. తోటి డ్యాన్సర్లతో పోటీపడుతూ ఆయన వేసిన బాలీవుడ్ స్టెప్పులు ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. మూడేళ్ల కిందట భారత 66వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కెనడాలోని మాంట్రియల్ నగరంలో జరిగిన ఇండియా-కెనడా అసోసియేషన్ సదస్సులో పాల్గొన్న యువ నాయకుడు జస్టిన్ ట్రూడ్యూ.. బాలీవుడ్ పాటకు హుషారుగా పాదం కదిపారు. మైకాసింగ్ పాడిన 'దిల్ బోలే హడిప్ప' పాటకు భారతీయులు వేదికపై నాట్యం చేస్తుండగా.. ఆయన కూడా వారితో జతకలిసి.. పోటీపడి బాలీవుడ్ స్టెప్పులు వేశారు. కుర్తా-పైజామా ధరించి భారతీయ ఆహార్యంలో ఆయన చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు ఆన్లైన్ లో బాగా ఆకట్టుకుంటున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన 43 ఏళ్ల జస్టిన్ ట్రూడ్యూ.. కెనాడా ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. -
భాంగ్రా డ్యాన్స్‌తో ఇరగదీసిన ప్రధాని