![Employees Learn Bhangra In Office Netizens Say It Is Real Stress Buster - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/6/office_0.jpg.webp?itok=5TLkMY9e)
ఆఫీసులో ఉద్యోగులు ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు...‘ఆఫీసు వర్క్ చేస్తారు’ అని మాత్రమే ఊరుకోనక్కర్లేదు. ‘భాంగ్రా డ్యాన్స్ కూడా చేస్తారు’ అని భేషుగ్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇదిప్పుడు ఒక ట్రెండ్‌గా మారనుంది. విషయంలోకి వస్తే... డల్ వర్క్‌డేకు ఒక కార్పొరేట్ కంపెనీ ఫన్ ట్విస్ట్ ఇచ్చింది.‘పనిచేసింది చాలు. ఇప్పుడిక భాంగ్రా నేర్చుకోండి’ అంటూ ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్, డ్యాన్సర్ సాహిల్‌శర్మను ఆఫీసుకు తీసుకువచ్చింది.
‘లెట్స్ డ్యాన్స్’ అంటూ శర్మ భాంగ్రా స్టెప్పులు స్టార్ట్ చేయడంతో ఉద్యోగులు ఎవరి డెస్క్‌ల దగ్గర వారు అతడిని అనుసరించి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. ‘ఐ వాంట్ యాన్ ఆఫీస్ లైక్ దిస్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో 2.9 మిలియన్‌ల వ్యూస్ సొంతం చేసుకుంది. ‘గుడ్ ఐడియా. 9 టు 5 జాబ్ వల్ల ఉద్యోగులు ఫిజికల్ యాక్టివిటీకి దూరం అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల వ్యాయామం చేసినట్లుగా ఉంటుంది. హుషారు వస్తుంది’ అని ఒక యూజర్ స్పందించాడు.
(చదవండి: సిరియా భూకంప శిథిలాల్లో బొడ్డుతాడుతో దొరికిన మిరాకిల్ బేబి ఎక్కడుందో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment