![A Man Messaged His Boss That He Could Not Come Into Work As His Girlfriend Did Not Wash His Socks - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/29/Leave.jpg.webp?itok=J-aTGXiN)
మనం చాలా సార్లు ఏదైనా పని ఉంటే ఆఫీస్‌లో బాస్‌ని సెలవు అడగాలంటే చాలా ఇబ్బంది పడతాం. మరీ తప్పదు చాలా అత్యవసరం అనుకుంటే తప్ప అడగలేని సందర్భాలు ఉంటాయి.. కానీ కొంతమంది మాత్రం చీటికి మాటికి భలే సెలవులు అడుగుతారు. పైగా వాళ్లు చెప్పే కారణాలు చూస్తే నమ్మబుద్ధి కూడా కాదు. ఒక్కొసారి ఆ కారణాలు వింటుంటే నవ్వు వస్తుంది. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటుచేసుకంది. విషయమేమిటంటే ఒక ఉద్యోగి అతని బాస్ కెన్‌కి ఒక మెసేజ్ పెడతాడు.
(చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?)
ఆ ఉద్యోగి మెసేజ్‌సారాంశం ఏమిటంటే " సార్ నేను ఆఫీస్‌కి రాలేను నా సాక్స్ బాగా మురికిగా ఉన్నాయి. నా గర్ల్ ఫ్రెండ్ సాక్స్ ఉతకలేదు. పైగా నేను సాక్స్ లేకుండా రాలేను అలాగే నా షూస్‌లో రంధ్రాలు కూడా ఉన్నాయి అందువల్ల నేను ఆఫీస్‌కి వచ్చి పనిచేయలేను" అంటూ మెసేజ్ పెడతాడు. దీంతో సదరు బాసు కెన్ ఆ మెసేజ్‌ని చూసి అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. పైగా అతను ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు.
ఆ తర్వాత కాసేపటి కెన్ తిరిగి ఆ ఉద్యోగికి పంపించిన మెసేజ్‌లో " మీరు నవ్వుతున్నారు కదా, సాక్స్ లేకపోడమేమిటి.. ఏంటి కామెడినా. సరే రేపు కలుద్దాం. మరోకరైతే గనుక ఇక రేపటి నుంచి ఆఫీస్‌కి రావల్సిన అవసరం లేదని చెప్పేవాడిని" అని పెట్టాడు. పైగా కెన్ ఈ మెసేజ్‌లను స్క్రీన్ షార్ట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు బాస్ మీరు సాక్స్‌లు ఇస్తానని చెప్పాల్సింది అని ఒకరు, అతను సాకు అనే పుస్తకంలోంచి ఈ సాకున కనుగొన్నాడంటూ సదరు వ్యక్తిని విమర్శిస్తూ ఘాటుగా ట్వీట్ చేశారు.
(చదవండి: భారత్‌కు అద్భుత కళాఖండాలు అప్పగింత)
Comments
Please login to add a commentAdd a comment