Viral Video: Shikhar Dhawan Bhangra Dance With Yuzvendra Chahal Wife Dhanashree Verma - Sakshi
Sakshi News home page

వైరల్‌: చహల్‌ భార్యతో గబ్బర్‌ చిందులు

Mar 31 2021 1:10 PM | Updated on Mar 31 2021 6:22 PM

Shikhar Dhawan Dance With Yuzvendra Chahal Wife Became Viral - Sakshi

ఢిల్లీ: టీమిండియా గబ్బర్‌ శిఖర్‌ ధావన్బాంగ్రా స్టెప్పులతో అదరగొట్టాడు. యజ్వేంద్ర చహల్‌ భార్య ధనశ్రీ వర్మతో కలిసి ధావన్‌ బాంగ్రా డ్యాన్స్‌తో ఇరగదీశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ముందుగా ధావన్‌ బాంగ్రా డ్యాన్స్‌ను అనుకరించగా.. అతన్ని అనుసరిస్తూ ధనశ్రీ డ్యాన్స్‌ చేసింది. అయితే ధావన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ సన్నాహకాల్లో బిజీగా ఉండడంతో తాజాగా రిలీజ్‌ చేసిన వీడియో పాతదని తెలిసింది. ఇంతకముందు కూడా వీరిద్దరు కలిసి డ్యాన్స్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఫామ్‌లోకి వచ్చిన ధావన్‌ ఐపీఎల్‌ 2021 సీజన్‌కు సిద్ధమయ్యాడు.ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ధావన్‌ నూతనోత్సాహంతో బరిలోకి దిగనున్నాడు.  కాగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేలు కలిపి 169 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి.
చదవండి:
క్వారంటైన్‌ కలిపింది ఆ ఇద్దరినీ...

ఢిల్లీ క్యాపిటల్స్‌ నూతన సారధిగా రిషబ్‌ పంత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement