
దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు సంబంధించి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ఎంపిక చేయలేదు. ఫామ్‌లో ఉన్న ధావన్‌ను పరిగణలోకి తీసుకోకపోవడంపై అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. స్థిరత్వ ప్రదర్శన ఉంటే సరిపోదని.. ఆటలో వేగం ఉండాలనే కారణంతో ధావన్ స్థానంలో మూడో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు చెప్పుకొచ్చారు.
చదవండి: T20 World Cup 2021: శిఖర్ ధావన్‌ను అందుకే ఎంపిక చేయలేదా!
ఈ విషయం పక్కనపెడితే శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీల్లో పాల్గొనేందుకు ధావన్ ఇప్పటికే యూఏఈకి చేరుకున్నాడు. తాజాగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్యాడ్స్ కట్టుకోవడం దగ్గర్నుంచి బ్యాటింగ్ చేసేవరకు ప్రతీది వీడియోలో పొందుపరిచాడు. వీడియో కింద 'సూర్మా' అని క్యాప్షన్ జత చేశాడు. సూర్మా అంటే పంజాబీ భాషలో ''డేరింగ్ అండ్ డాషింగ్'' అని అర్థం.
ఇక శిఖర్ ధావన్ ఐపీఎల్ 14వ సీజన్‌లో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌లాడిన ధావన్ 134.27 స్ట్రైక్ రేట్‌తో 380 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రదర్శనతో దుమ్మురేపి టేబుల్ టాపర్‌గా నిలిచింది. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
చదవండి: T20 World Cup: వారిద్దరికి దక్కని చోటు.. గావస్కర్ టీ 20 ప్రపంచకప్ జట్టు ఇదే!
Shane Warne: టీమిండియా అద్భుతం; ఆటతీరుతో నా టోపీని ఎత్తుకెళ్లారు