చెన్నై: టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ మంచి జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఆసీస్ సిరీస్ నుంచి మంచి ఫామ్ కనబరుస్తున్న పంత్ అదే దూకుడును ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ కంటిన్యూ చేశాడు. తాజాగా శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరమవడంతో మేనేజ్‌మెంట్ పంత్‌కు బాధ్యతలు అప్పగించింది. గతేడాది ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయ్యర్ సారధ్యంలో ఆరంభం నుంచి అదరగొట్టిన ఢిల్లీ ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో చతికిలపడింది.
తాజాగా ఈ సీజన్‌లో ఢిల్లీకి పంత్ కెప్టెన్‌గా వ్యవహరించడం.. ఆ జట్టును మరింత దూకుడుగా మార్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ప్రాక్టీస్ వీడియోనూ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఢిల్లీ షేర్ చేసిన వీడియోలో.. మొదట పంత్ తన సహచరులతో షేక్‌హ్యాండ్ చేసి మైదానంలోకి దిగాడు. అనంతరం తనకే సొంతమైన ఆర్థడాక్స్ షాట్లతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ ఆగయా.. పంత్ ఆన్ ఫైర్.. మ్యాన్ ఆన్ మిషన్... ప్రత్యర్థులకు ఇక చుక్కలే.. ఐపీఎల్ 2021.. అంటూ క్యాప్షన్ జత చేసింది. పంత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పంత్ ఐపీఎల్‌లో 68 మ్యాచ్‌లాడి 2079 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న చెన్నై వేదికగా సీఎస్‌కేతో ఆడనుంది.
చదవండి: పంత్ దూకుడు ఢిల్లీకి లాభిస్తుందా?
'గిల్ కరెక్ట్‌గానే ఉన్నాడు.. మీరు చెప్పాల్సిన పని లేదు'
Comments
Please login to add a commentAdd a comment