Photo: IPL Twitter
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ ఐపీఎల్‌లో 6వేల పరుగులు మార్క్‌ను అందుకున్నాడు. 165 ఇన్నింగ్స్‌లోనే వార్నర్ ఈ ఫీట్‌ను సాధించడం విశేషం.
ఈ నేపథ్యంలోనే కోహ్లి, ధావన్‌ల రికార్డును బద్దలు కొట్టి ఐపీఎల్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదే ఆరువేల పరుగుల మార్క్ అందుకోవడానికి కోహ్లి 188 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే.. శిఖర్ ధావన్ 199 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కానీ వార్నర్‌కు మాత్రం 165 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి.
ఇక ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో వార్నర్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో కోహ్లి 6727 పరుగులు(225 మ్యాచ్‌లు), శిఖర్ ధావన్ 6370 పరుగులు(208 మ్యాచ్‌లు) రెండో స్థానంలో నిలిచాడు.
ఇక ఐపీఎల్‌లో 4వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లలో వార్నర్ బ్యాటింగ్ యావరేజ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. వార్నర్ సగటు 42.28 కాగా.. స్ట్రైక్ రేట్ 140.08గా ఉంది. ఇక స్ట్రైక్‌రేట్ విషయంలో ఏబీ డివిలియర్స్(151.68), క్రిస్ గేల్(148.96) తర్వాత వార్నర్‌కు మాత్రమే 140 స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నాడు.
6️⃣0️⃣0️⃣0️⃣ runs & counting in #TATAIPL for the #DC skipper #TATAIPL #IPL2023 | @delhicapitals @davidwarner31 pic.twitter.com/m7aM1GFGwe
— JioCinema (@JioCinema) April 8, 2023
6000 runs for David Warner in IPL.
— Johns. (@CricCrazyJohns) April 8, 2023
One of the GOAT in this league. pic.twitter.com/UqtPFcsPA0
David Warner - the IPL GOAT. pic.twitter.com/1yEHi9lCUZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2023
Comments
Please login to add a commentAdd a comment