పెళ్లంటే, ఎన్నో పనులు, టెన్షన్లు, హడావిడీ.. ఇవన్నీ కొన్ని రోజుల కిత్రం వరకు.. ఇప్పుడు పెళ్లంటే ఓ సెలబ్రేషన్ ,హంగామా, ఎంజాయ్మెంట్స్. ఊరి నుంచి సిటీ వరకు ఎక్కడ పెళ్లి జరిగినా ఓ పండుగలా చేస్తున్నారు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టే క్షణాలను మధుర జ్ఞాపకంగా తీర్చి దిద్దుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లిలో డ్యాన్స్ చేయడం కామన్ అయిపోయింది. అయితే పంజాబ్‌లో ఫేమస్ అయిన భాంగ్రా డ్యాన్స్ వేయడం కొంచెం స్పెషల్. తాజాగా ఓ వధు భాంగ్రా డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో వధువు ఆయుషీ..వరుడితో కలిసి ఎంతో ఉత్సాహంగా భాంగ్రా డాన్స్ చేసింది. పెళ్లి దుస్తులు గోల్డ్ లెహంగాలో మెరిసిపోతూ.. అదిరిపోయే స్టెప్పులేసింది. డోలు చప్పుళ్లు, బీట్స్‌కి తగ్గట్టుగా డ్యాన్ చేసింది. కరెన్సీ నోటును చేతిలో పట్టుకొని చిందులేసింది. ఆ తర్వాత వరుడు కూడా ఆమెపై కరెన్సీ నోట్లను విసిరాడు. ‘సాధారణ వధువు కాదు. ఇంత కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు దీనిని 25 లక్షల మందికి పైగా చూడగా.. 1.68 లక్షల మందికి పైగా లైక్ చేశారు.
చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా దాడి: హృదయ విదారకం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ "మొత్తానికి వధువు తన సిగ్గును పక్కనపెట్టి డాన్స్ చెయ్యడానికి భయపడలేదు. ఇది నాకు కొత్త ఆనందాన్ని తీసుకొచ్చింది. అని కామెంట్ చేశారు. ‘ బరువైన వివాహ లెహంగా వేసుకొని డాన్స్ చెయ్యడం కష్టమే. అద్భుతం. రాక్ స్టార్ వధువు’ అంటూ నెజినట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment