ఫైల్ ఫోటో
చండిగఢ్: పంజాబ్ నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చాలా ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో చన్నీ ఇటీవల పదవీ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో "భాంగ్రా" నృత్యంతో సందడి చేశారు. (Charanjit Channi:తొలి మీడియా సమావేశంలో భావోద్వేగం)
కపూర్తలాలోని ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మ్యూజియం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక ఈవెంట్‌లో వేదికపై ఉన్న కళాకారులతో జత కలిశారు. వారితో పాటు ఉత్సాహంగా స్టెప్పులేసి అక్కడున్న వారందరిలో జోష్ నింపారు.
కాగా సీఎంగా జలంధర్‌లో జిల్లాలో తన తొలి పర్యటన సందర్భంగా, 101పైగా ఎకరాల విస్తీర్ణంలో గురు రవిదాస్ చైర్ ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధవా , కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి పర్గత్ సింగ్‌తో ఇక్కడ పర్యటించారు డేరా సఖండ్ బల్లన్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం, రవిదాస్ చైర్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రానున్న పది సంవత్సరాల పాటు దీని నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చూస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
#WATCH | Punjab Chief Minister Charanjit Singh Channi breaks into Bhangra at an event in Kapurthala.
— ANI (@ANI) September 23, 2021
(Source: Information Public Relations Punjab) pic.twitter.com/4xg7iDKorW
Comments
Please login to add a commentAdd a comment