చన్నీ వర్సెస్​ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్​ గాంధీ కీలక వ్యాఖ్యలు | Navjot Sidhu VS Chief Minister Channi Rahul Gandhi Tweaks Party Rule | Sakshi
Sakshi News home page

చన్నీ వర్సెస్​ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్​ గాంధీ కీలక వ్యాఖ్యలు

Published Thu, Jan 27 2022 8:25 PM | Last Updated on Thu, Jan 27 2022 9:28 PM

Navjot Sidhu VS Chief Minister Channi  Rahul Gandhi Tweaks Party Rule - Sakshi

చండీగఢ్‌: కాంగ్రెస్ పార్టీ పంజాబ్​ ప్రజలకు తీపికబురు అందించింది.  త్వరలోనే​ పంజాబ్​ సీఎం అభ్యర్థిని  ప్రకటించనున్నట్లు కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ రాహుల్​ గాంధీ తెలిపారు.  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాహుల్​ గాంధీ పంజాబ్​లోని జలంధర్ లో​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సభలో.. పంజాబ్​ సీఎం చరణ్​ జిత్​ సింగ్​ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నవజ్యోత్​ సింగ్ సిద్ధూ పాల్గోన్నారు. కాగా, తాము..​ సీఎం పదవి కోసం ఆశపడబోమని ఆ సభలో బహిరంగంగా హమీ ఇచ్చారు. కాంగ్రెస్​ అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. 

అదే విధంగా ఒకరు నాయకత్వం వహిస్తే మరొకరు వారికి సహకారం అందిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్​ గాంధీ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్​ పార్టీ లేదా పంజాబ్​ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ ప్రకటనతో చన్నీ వర్సెస్​ సిద్ధూల మధ్య పోటీకి తెరపడినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు నాయకత్వం వహించలేరు.. ఒకరు మాత్రమే సరైన నాయకుడిగా ఉండగలరని ఆయన అన్నారు.

సీఎం అభ్యర్థిని ఎవరు ఉండాలనే దాన్ని కాంగ్రెస్​ కార్యకర్తలనే అడుగుతామన్నారు. అయితే, చన్నీ, నవజ్యోత్​ సింగ్​ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తారని తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. క్రమశిక్షణ కల్గిన కాంగ్రెస్​ సైనికుడిలా పనిచేస్తానని అన్నారు. తనను ‘షోపీస్’​లా ట్రీట్​ చేయోద్దని అన్నారు. ‘ మనమంతా పంజాబ్​లో కాంగ్రెస్​ను అధికారంలో తేవడానికి ఐక్యంగా పోరాడదామన్నారు’.

ఇదే వేదికపై ఉన్న చన్నీ కూడా..  సిద్ధూ దగ్గరకు వెళ్లి తమ ఐక్యతను చూపే ప్రయత్నం చేశారు. ఈ సభలో సీఎం చన్నీకూడా మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరును ప్రతిపాదించిన అభ్యంతరంలేదన్నారు.’ ఎవరి పేరు ప్రతిపాదించిన ప్రచారం కోసం పనిచేసే మొదటి వ్యక్తి తానేనని చన్నీ స్పష్టం చేశారు. ఆ తర్వాత చన్నీ..  అరవింద్​ కేజ్రీవాల్​పై ఫైర్​ అయ్యారు. అరవింద్​ కేజ్రీవాల్​ పంజాబ్​ కాంగ్రెస్​లో అంతర్గత పోరు ఉందని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చురకలంటించారు. 

చదవండి: ఉత్తరాఖండ్​లో కాంగ్రెస్​కు షాక్​.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement