Navjot Sidhu
-
నిమ్మకాయ, పచ్చిపసుపుతో సిద్ధు భార్య కేన్సర్ ఖతం: నిపుణుల హెచ్చరికలివే!
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల కీలక విషయాన్ని ప్రకటించిన సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 కేన్సర్‌ని విజయవంతంగా ఓడించిందని మీడియా సమావేశంలో ప్రకటించారు. కేవలం వైద్యులమీదే ఆధారపడకుండా కొన్ని ప్రత్యేక మైన చికిత్సా పద్దతులను అవలంబించామని క్రమశిక్షణ, కఠినమైన జీవనశైలి,ఆయుర్వేద పద్ధతులు, ఆహార నియమాలతో తీవ్రమైన స్టేజ్-4 కేన్సర్‌నుంచి బయటపడినట్టు వెల్లడించారు. ముఖ్యంగా నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి వాటి ద్వారా కేన్సర్ మహమ్మారిని జయించినట్టు ప్రకటించడం చర్చకు దారి తీసింది. మరి కేవలం స్ట్రిక్ట్ డైట్ మాత్రమే క్యాన్సర్ రికవరీకి సహాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?కొన్నాళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన నవజ్యోత్ కౌర్ చికిత్స తీసుకుంది. తగ్గిపోయిందని అనుకున్నారు. కానీ కుమారుడి పెళ్లి తర్వాత స్టేజ్-3 రూపంలో తీవ్రంగా మళ్లీ వచ్చింది. చికిత్స తీసుకున్నా ఫలితం లేదు సరికదా మరింత ముదిరింది. కేవలం 5 శాతం మాత్రమే చాన్స్ ఉందని, కోలుకోవడం కష్టం అని వైద్యులు తేల్చేశారు. కానీ కఠినమైన ఆహార నియమాలు, జీవన శైలి మార్పులతో ఆమె క్యాన్సర్‌ను ఓడించిందని, అయితే ఇది దగ్గర డబ్బు ఉన్నందున కాదు, క్రమశిక్షణ, ఆహార నియమాలను పాటించి 40 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు సిద్దూ. ఆమె ఇపుడు వైద్యపరంగా కేన్సర్‌ను ఓడించిందని సిద్దూ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉపవాసం ప్రాముఖ్యత, చక్కెర , కార్బోహైడ్రేట్లు లేని ఆహారం కేన్సర్‌ను దూరం చేస్తుందన్నారు. ఆమె తన రోజును నిమ్మరసంతో ప్రారంభించేదని, పచ్చి పసుపు తినేదని, ఆపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి లాంటి తీసుకునేదన్నారు. ఇంకా సిట్రస్ పండ్లు,గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్రూట్ , వాల్నట్స్ వంటి రసాలు ఆమె రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేవన్నారు.My wife is clinically cancer free today ….. pic.twitter.com/x06lExML82— Navjot Singh Sidhu (@sherryontopp) November 21, 2024అందరికీ వర్తించదు: నిపుణుల హెచ్చరిక కేన్సర్ చికిత్సలో పోషకాహార పాత్ర కీలకమైనదే, కానీ అది మాత్రమే రికవరీకి ఆహారం మాత్రమే సరిపోదని హెచ్చరిస్తున్నారు. వ్యాధినుంచి కోలుకోవడానికి ఆహారం గణనీయంగా తోడ్పడుతుంది. కానీ కీమోథెరపీ, రేడియేషన్ లేదా శస్త్రచికిత్స వంటి సాంప్రదాయ చికిత్సలకు ఎంతమాత్రం సరిపోదు. కేన్సర్ బహు ముఖమైంది. తీవ్రతను బట్టి, కేన్సర్ కణాలను నాశనం చేయడానికి పలు చికిత్సల కలయిక అవసరం అంటున్నారు వైద్య నిపుణులుఅలాగే ఉపవాసం కేన్సర్ రోగులకు ఉపవాసం అస్సలు పనికిరాదని, కేన్సర్ రోగులను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, లేదా ఉపవాసంలో ఉంచడం నేరమంటున్నారు మరికొందరు నిపుణులు. ఇది కోలుకోవడానికి అవసరమైన పోషకాహారాన్ని నిరోధిస్తుందన్నారు.తక్కువ-గ్లైసెమిక్ డైట్, న్యూట్రాస్యూటికల్స్ గ్లూకోజ్-ఆధారిత కేన్సర్లలో చికిత్సల సామర్థ్యాన్ని పెంచగలవని డాక్టర్ మల్హోత్రా ట్వీట్ చేశారు. అయితే అందరికీ ఇది వర్తించదన్నారు. కేన్సర్ రకం, దశ ఆధారంగా, జీవక్రియ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆహార ప్రణాళికలను రూపొందించుకోవాలి. ముఖ్యంగా రోగులు ఆంకాలజిస్టులు, డైటీషియన్ల సలహాలను తీసుకోవాలని డాక్టర్ మల్హోత్రా జోడించారు.కేన్సర్‌నుంచి బయటపడాలంటే.. తొలి దశలోనే గుర్తించడం,కేన్సర్ రకం, లక్షణాలతో పాటు అత్యాధునిక చికిత్స, రోగి విల్ పవర్, ఆహార నియమాలు, రోగి శారీరక, మానసిక స్థితి, కుటుంబ సభ్యుల సహకారం, మద్దతు ఇవన్నీ కీలకమైనవి. -
LSG VS CSK: గెలిచినప్పుడు ధోనిని పొగిడి, ఓడితే రుతురాజ్‌ను నిందిస్తారా..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సీఎస్కేతో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. స్టోయినిస్ అజేయమైన మెరుపు శతకంతో (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) లక్నోను విజయతీరాలకు చేర్చాడు. స్టోయినిస్‌కు పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. గెలిస్తే ధోని ఓడితే రుతురాజా..?మ్యాచ్ అనంతరం జరిగిన డిబేట్లో నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ, అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎస్కే ఓటమికి రుతురాజ్ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు అంటే.. గెలిచినప్పుడు ధోని పేరు చెప్పి ఓడినప్పుడు రుతురాజ్ నిందించడం సమంజసం కాదని సిద్దూ అభిప్రాయపడ్డాడు. Ambati Rayudu - Poor field placements in deaths overs by Ruturaj. We clearly saw lack of experience as captainN. Sidhu - If you credit Dhoni for CSK wins then blame him for the losses too. Dhoni is still the main think tank#LSGvsCSK #CSKvLSG #CSKvsLSG pic.twitter.com/R4VnEwWUKY— Richard Kettleborough (@RichKettle07) April 24, 2024 తొలుత రాయుడు మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో రుతురాజ్ ఫీల్డింగ్‌ను మొహరించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గా అతని అనుభవ రాహిత్యం స్పష్టంగా బయటపడింది. స్టోయినిస్ విధ్వంసకర మూడ్‌లో ఉన్నప్పుడు రుతురాజ్ సిల్లీ ఫీల్డ్ సెటప్ చేసి అతను మరింత రెచ్చిపోయేలా చేశాడని అన్నాడు.ఇందుకు సిద్దూ కౌంటరిస్తూ.. సీఎస్కే గెలిచినప్పుడు ధోనికి క్రెడిట్ ఇచ్చి, ఓడినప్పుడు రుతురాజ్‌ను నిందించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. గెలిచినప్పుడు ధోనిని పొగిడిన నోళ్లు ఓడినప్పుడు కూడా అతన్నే నిందించాలని అన్నాడు. సీఎస్కే కెప్టెన్సీని ధోనినే ఇంకా మోస్తున్నాడన్న విషయం బహిరంగ సత్యమని తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రుతురాజ్ మెరుపులకు శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం తోడు కావడంతో సీఎస్కే భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. తొలి ఓవర్లోనే డికాక్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే స్టోయినిస్.. పూరన్, హుడా సహకారంతో లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో లక్నో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. మస్తాఫిజుర్ బౌలింగ్‌లో ప్టోయినిస్ వరుసగా 6, 4, 4, 4 పరగులు సాధించాడు. ఫలితంగా లక్నో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. -
సిద్ధూ త్యాగం.. చన్నీ పాదాభివందనం
Punjab Assembly Elections 2022: పంజాబ్‌లో క్లిష్టమైన సమస్యగా భావించిన ముఖ్యమంత్రి ఎంపిక.. ప్రకటనను ఎట్టకేలకు పూర్తి చేసింది కాంగ్రెస్. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న నవజోత్ సింగ్ సిద్ధూను ఎలాగోలా పార్టీ చల్లబర్చింది. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌సింగ్ చన్నీనే.. సీఎం అభ్యర్థిగా ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అంతకు ముందు కొన్ని గంటలపాటు పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా.. అభ్యంతరం లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ సిద్ధూ ప్రకటించడంతో ఆసక్తికరంగా మారింది సీన్. ఈ తరుణంలో.. స్టేజ్‌పై సీఎం అభ్యర్థిగా చన్నీ పేరును ప్రకటించిన వెంటనే ఆసక్తికర దృశ్యం కనిపించింది. సిద్ధూ చన్నీ కుడి చెయ్యిని పైకి ఎత్తగా.. ఆక్షణంలోనే చన్నీ తన ఎడమ చేతితో సిద్ధూకి పాదాభివందనం చేశాడు. ‘సిద్ధూజీ.. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేయండి. మీ మోడల్ కచ్చితంగా అమలు అయ్యి తీరుతుంది’ అని చన్నీ ఆ వెంటనే వ్యాఖ్యానించడం విశేషం. లూథియానా: ఇక పంజాబ్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు పార్టీ నేత రాహుల్ గాంధీ పెద్ద షాక్ ఇచ్చారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ పేరును రాహుల్ ఆదివారం పంజాబ్‌లో వర్చువల్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించి.. ప్రసంగించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. పేదరికాన్ని, ఆకలిని అర్థం చేసుకున్నవారే కావాలని అంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. ‘‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. దాన్ని మీరు సులభతరం’’ చేశారు అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అనంతరం చన్నీ, సిద్ధూ, పార్టీ నేత సునీల్ జాఖర్‌ను రాహుల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మీడియా, టీవీ చర్చా కార్యక్రమాల్లో నాయకులు పుట్టుకురారని తెలిపారు. కొన్ని సంవత్సరాల పోరాటంతోనే వ్యక్తులు నాయకులుగా ఎదుగుతారని వివరించారు. గొప్ప నాయకులకు తమ పార్టీలో లోటు లేదన్నారు. ప్రజల కోసం నిలబడే నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారని పేర్కొన్నారు. చన్నీ, సిద్ధూల రక్తంలో పంజాబ్ ఉందన్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కాంగ్రెస్ నాయకత్వం పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. ప్రజల మనోభావాలను కూడా తెలుసుకుంది. ఇందుకోసం అటోమేటెడ్ కాల్ సిస్టమ్‌ను ఉపయోగించుకుంది. దళిత సిక్కు నాయకుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. వర్చువల్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఆయన ప్రధానమంత్రిగా కాదు, ఒక రాజులాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ రోడ్లపై ఎవరికైనా సాయం చేయడం ఎప్పుడైనా చూశారా? ఆయన ప్రజల మధ్య ఉండడం ఎప్పుడైనా గమనించారా? అని ప్రజలను ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పదవుల కోసం పాకులాడలేదు: సిద్ధూ తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్ సిద్ధూ అన్నారు. ఆయన లూథియానాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. గత 17 ఏళ్లుగా రాజకీయ జీవితం కొనసాగిస్తున్నానని, పదవులపై ఎప్పుడూ ఆశపడలేదని పేర్కొన్నారు. పంజాబ్ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మాత్రమే కోరుకున్నానని వివరించారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేశారని కొనియాడారు. మార్పునకు సమయం ఆసన్నమైందని వెల్లడించారు. పంజాబ్ అభివృద్ధి కంటే తనకు కావాల్సింది ఇంకేమీ లేదని వ్యాఖ్యానించారు. సీఎం అభ్యర్థి ప్రకటనపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిద్ధూ ట్వీట్ చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీజేపీ శ్రుతులకు అనుగుణంగా అమరీందర్ డ్యాన్స్ చేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్‌ను లూటీ చేసిన నాయకులు ఇప్పుడు డబల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ అధికారం రాహుల్‌కు ఎక్కడిది?: బీజేపీ చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అధికారం రాహుల్ గాంధీకి ఎక్కడుందని బీజేపీ నేత, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదివారం ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో రాహుల్‌కు ఎలాంటి హోదా లేదని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఏ అధికారంతో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని నిలదీశారు. పేరు చివర ‘గాంధీ’ అన్న ఒక్క అర్హత మాత్రమే రాహుల్‌కు ఉందని ఎద్దేవా చేశారు. -
చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ప్రజలకు తీపికబురు అందించింది. త్వరలోనే పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాహుల్ గాంధీ పంజాబ్‌లోని జలంధర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సభలో.. పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాల్గోన్నారు. కాగా, తాము.. సీఎం పదవి కోసం ఆశపడబోమని ఆ సభలో బహిరంగంగా హమీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అదే విధంగా ఒకరు నాయకత్వం వహిస్తే మరొకరు వారికి సహకారం అందిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ లేదా పంజాబ్ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ ప్రకటనతో చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య పోటీకి తెరపడినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు నాయకత్వం వహించలేరు.. ఒకరు మాత్రమే సరైన నాయకుడిగా ఉండగలరని ఆయన అన్నారు. సీఎం అభ్యర్థిని ఎవరు ఉండాలనే దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలనే అడుగుతామన్నారు. అయితే, చన్నీ, నవజ్యోత్ సింగ్ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తారని తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. క్రమశిక్షణ కల్గిన కాంగ్రెస్ సైనికుడిలా పనిచేస్తానని అన్నారు. తనను ‘షోపీస్’లా ట్రీట్ చేయోద్దని అన్నారు. ‘ మనమంతా పంజాబ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలో తేవడానికి ఐక్యంగా పోరాడదామన్నారు’. ఇదే వేదికపై ఉన్న చన్నీ కూడా.. సిద్ధూ దగ్గరకు వెళ్లి తమ ఐక్యతను చూపే ప్రయత్నం చేశారు. ఈ సభలో సీఎం చన్నీకూడా మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరును ప్రతిపాదించిన అభ్యంతరంలేదన్నారు.’ ఎవరి పేరు ప్రతిపాదించిన ప్రచారం కోసం పనిచేసే మొదటి వ్యక్తి తానేనని చన్నీ స్పష్టం చేశారు. ఆ తర్వాత చన్నీ.. అరవింద్ కేజ్రీవాల్‌పై ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఉందని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చురకలంటించారు. చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
మ్యాగజైన్ స్టోరీ 29 September 2021
-
పంజాబ్‌లో పవర్ రచ్చ,ముందు మీ 8 లక్షల బిల్లు చెల్లించండి సిద్ధూ...
చండీగడ్: ప్రస్తుతం విద్యుత్త్ కొరత సమస్యతో పంజాబ్ రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది. ఇక ఈ అంశంపై అమరీందర్ పాలన సరిగా లేదని అదే పార్టీకి చెందిన నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధూ ఇటీవల ఫైర్ అయిన సంగతి తెలిసిందే. విద్యుత్త్ సమస్యలపై అంతలా విరుచుకుపడ్డ సిద్ధూ తన ఇంటి కరెంట్ బకాయిలు చెల్లించడం మారిచారన్న విమర్శలు వస్తున్నాయి. అమృత్‌సర్‌లో ఉన్న సిద్ధూ ఇంటికి కరెంటు బిల్లు బాకీ ఉన్నట్లు తెలియడంతో ఈ అంశం ఇప్పుడు విపక్షాలకు అస్త్రంలా దొరికింది. ఈ కాంగ్రెస్ నేత మొత్తం రూ.8,67,540 కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్ పేమెంట్‌కు జూన్ 2 చివరి రోజు కాగా ఇంతవరకు ఆయన చెల్లించలేదు. దీని గురించి ఇప్పటి వరకు సిద్ధూ ఏమీ మాట్లాడలేదు. ఇదిలా ఉండగా ఆప్ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల కరెంటును ఉచితంగా అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడం విశేషం. 2019లో రాజీనామ చేసిన సమయంలో ఆ శాఖను సిద్దూకే కేటాయించే ప్రయత్నం చేశారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్సైట్ ప్రకారం.. అమృత్‌సర్‌లోని సిద్ధూ ఇంటికి రూ. 8,67,540 విద్యుత్త్ బకాయిలు ఉండగా ఇంకా చెల్లించలేదని తెలిపింది. అసలు ఈ కరెంట్ కథేంటంటే.. గత సంవత్సరం నుంచి సిద్దూ ఇంటి కరెంట్ బిల్లు విషయంలో 17 లక్షలకు పైగా బాకీ పడ్డాడు. కాగా అతను మార్చిలో 10 లక్షలు చెల్లించగా, ప్రస్తుతం అతని బకాయిలు దాదాపు 9 లక్షలకు చేరుకున్నాయని వారు తెలిపారు. Punjab | Congress' Navjot Singh Sidhu allegedly owes Rs 8.67 lakh in pending bill to state power utility I'm not aware of the issue. Sub Divisional Officers must have known. No special relaxation was given to him. We'll investigate the issue: Chief engineer, Power Dept, Amritsar pic.twitter.com/y8xdMmsfNb — ANI (@ANI) July 3, 2021 -
రోహ్తక్లో పంజాబ్ మంత్రి సిద్ధూకి షాక్
-
ఆ స్థానం నుంచే మా ఆయన పోటీ: సిద్ధు భార్య
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసే అవకాశముందని ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధు బుధవారం మీడియాకు తెలిపారు. 'మా ఆయన అమృత్ సర్ ఈస్ట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశముంది' అని ఆమె పేర్కొన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధు, ఆయన భార్య గత ఏడాది బీజేపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సిద్ధు భార్య కౌర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్ధు కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశముందని తెలుస్తోంది. 2012 ఎన్నికల్లో సిధ్దు పటియాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో అమృత్సర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. తనను పంజాబ్‌కు దూరం పెట్టాలనే కుట్రతో బీజేపీ వ్యవహరిస్తున్నదని, అందుకే ఆ పార్టీకి రాంరాం చెప్పినట్టు సిద్ధు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
బీజేపీ సభ్యత్వానికి సిద్ధూ రాజీనామా..!
-
బీజేపీ సభ్యత్వానికి సిద్ధూ రాజీనామా..!
న్యూఢిల్లీః గత రెండు నెలలుగా నలుగుతున్నవివాదానికి నేటితో తెర పడింది. బీజేపీ తరపున రాజ్యసభకు నామినేట్ అయిన నవజోత్ సింగ్ సిద్ధు ఎట్టకేలకు బీజేపీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. జూలైలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారంటూ వచ్చిన వార్తలకు స్వస్తి పలుకుతూ.. వారం క్రితం సొంతగా ఆవాజ్-ఇ-పంజాబ్ పార్టీ స్థాపించనున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. రాజకీయ నాయకుడుగా మారిన క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు బుధవారం ఢిల్లీలో తన బీజేపీ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేసినట్లు ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధు ఛత్తీస్ గఢ్ లో వెల్లడించారు. పంజాబ్ అసెంబ్లీ సభ్యురాలుగా కొనసాగుతున్న ఆమె.. సిద్ధు పార్టీ స్థాపన అనంతరం తానూ బీజేపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. 52 ఏళ్ళ నవజోత్ సింగ్ సిద్ధు గతవారం తాను కొత్త పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించిన సందర్భంలో.. ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేశారు. అన్నదానికల్లా తల ఊపేవారికే కేజ్రీవాల్ తన పార్టీలో చోటిస్తారన్నారు. అంతేకాక తనను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లో పోటీ చేయద్దని ఆయన కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం స్థాపించనున్న తన కొత్త పార్టీకి పంజాబ్ లో సిద్ధూనే ముఖ్యమంత్రి అభ్యర్థి కానుండటంతోపాటు.. తనతో కలసి నడిచేవారికి ఆహ్వానం కూడా పలుకుతున్నారు. ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీనే కాక, కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ అమరిందర్ సింగ్ కూడా తమ పార్టీలోకి రమ్మంటూ అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. 12 ఏళ్ళపాటు బీజేపీలో కొనసాగిన సిద్ధూ.. జూలై నెల్లో రాజ్యసభ నామినేటెడ్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతోపాటు బీజేపీకి నోటీసులు అందించారు. 2014 పార్లమెంటరీ ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అభ్యంతరం తెలిపిన అనంతరం.. సిద్ధూ పార్టీలో అన్యమనస్కంగానే కొనసాగుతున్నారు. అయితే బీజేపీ సభ్యులు మాత్రం సిద్ధూ నిర్ణయం పార్టీకి వెన్నుపోటు చర్యగా అభివర్ణిస్తున్నారు. -
సిద్ధుకు మరో ఆఫర్
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధుకు మాంచి డిమాండ్ ఏర్పడింది. బీజేపీకి గుడ్ బై చెప్పిన సిద్ధుకు మరో ఆఫర్ వచ్చింది. ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేక డైలమాలో ఉన్న సిద్ధుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. సిద్ధు డీఎన్ఏలో కాంగ్రెస్ ఉందని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అమరీందర్ సింగ్ అన్నారు. సిద్ధు తండ్రి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని, సిద్ధు చిన్నప్పటి నుంచి తనకు తెలుసని, అతని కోసం కాంగ్రెస్ తలుపులు ఓపెన్‌గా ఉన్నాయని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇదివరకే సిద్ధును పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధు పేరును ప్రకటించవచ్చని వార్తలు వచ్చాయి. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సిద్ధు ఇటీవల కలిసి చర్చించాడు. కాగా ఆప్‌లో చేరే విషయంలో అతను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌లో చేరే విషయాన్ని కూడా సిద్ధు పరిశీలిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. సిద్ధు రెండు సార్లు ఎంపీగా గెలవగా, ఆయన భార్య బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. పంజాబ్ ఎన్నికల్లో తన భార్యకు టికెట్ ఇవ్వడంతో పాటు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంట్లో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామని, సిద్ధుకు స్థాయికి తగినట్టుగా ప్రాధాన్యం ఇస్తామని అమరీందర్ సింగ్ చెప్పారు. ఇంతకీ సిద్ధు ఏ పార్టీలో చేరుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. -
ఎంపీ పదవికి సిద్ధూ రాజీనామా
-
ఎంపీ పదవికి సిద్ధూ రాజీనామా
న్యూఢిల్లీ:ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన మాజీ క్రికెటర్ సిద్ధూ ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీలో చేరే యోచనలో ఉన్న కారణంగానే సిద్ధూ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గత రెండు నెలల క్రితం సిద్ధూను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. 2017లో పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ సిద్ధమవుతున్న కారణంగానే సిద్ధూ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఆప్ తరపున ప్రధాన ప్రచార బాధ్యతలన సిద్ధూకు అప్పగించే అవకాశం ఉంది. ఆప్ పార్టీ తరపున పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ బరిలోకి నిలిచే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రస్తుతం బీజేపీ శాసన సభ్యురాలిగా ఉన్న అతని భార్య నవజ్యోత్ కౌర్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో రెండుసార్లు అమృతసర్ నియోజక వర్గం నుంచి సిద్ధూ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకూ అమృతసర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిద్ధూ ఎంపికయ్యారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి అరుణ్ జైట్లీ పోటీ చేయడంతో ఆ స్థానాన్ని సిద్దూ వదులుకోవాల్సి వచ్చింది. -
అమృతసర్ ను కేటాయిస్తేనే పోటీ చేస్తా:నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: బిజెపి ఎంపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పార్టీ పెద్దలపై నిరసన గళం వినిపించాడు. తనకు అమృతసర్ ను కేటాయిస్తేనే ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగుతానని స్పష్టం చేశాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్ధూ.. తనకు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అమృతసర్ ను కేటాయించాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. కాని పక్షంలో వేరే ఏ స్థానం నుంచి కూడా పోటీ చేయాలని భావించడం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అమృతసర్ ను అరుణ్ జైట్లీకి కేటాయించడంతో సిద్ధూ తన అసహనాన్ని వెళ్లగక్కారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేయడం ఏమీ ఇబ్బంది లేకపోయినా, తనకు మాత్రం అడ్డుతగులుతున్నారని వ్యాఖ్యానించారు. 'నేను ఇక్కడి నుంచే ఎప్పుడూ పోటీ చేస్తానని ప్రజలకు మాట ఇచ్చానని సంగతిని వివరించారు. ఇక్కడి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గతంలో హామీ ఇచ్చానన్నారు. అమృతసర్ ను వదులుకుంటే ఇక ఎక్కడ సీటు ఇచ్చినా పోటీ దిగే ప్రసక్తే లేదని తెలిపారు. నేను వేరే చోట ఇమ్మని కూడా బీజేపీ పెద్దలను కోరలేదని' సిద్దూ ఆవేదన వ్యక్తం చేశారు. -
నరేంద్ర మోడీ ర్యాలీకి సిద్ధు డుమ్మా
జాగ్రోన్ (పంజాబ్): టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు.. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ర్యాలీకి డుమ్మా కొట్టారు. ఆదివారమిక్కడ జరిగిన ర్యాలీలో బీజేపీ నేతలతో పాటు మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ నాయకులు పాల్గొన్నారు. అయితే పంజాబ్ నుంచి (అమృత్సర్) బీజేపీ తరపున ఎంపికైన ఏకైక ఎంపీ సిద్ధు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో గుజరాత్ సహా పలు ఎన్నికల్లో బీజేపీ తరపున సిద్ధు ప్రచారం చేశారు. అనంతరం పంజాబ్ రాష్ట్ర శాఖ బీజేపీ నేతలతో పాటు మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ నాయకులతో సంబంధాలు దెబ్బతిన్నాయి. సిధ్దు వారిపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మోడీ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా తనకు ఆహ్వానం అందలేదని సిద్ధు శుక్రవారం చెప్పడం గమనార్హం. తనను ఆహ్వానించకుంటే ర్యాలీకి వెళ్లబోనని చెప్పిన సిద్ధు దూరంగానే ఉండిపోయారు. వేదికపై బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ, అకాలీదళ్ నేతలను ప్రశంసించినా.. సిద్ధు పేరు ప్రస్తావించలేదు.