నరేంద్ర మోడీ ర్యాలీకి సిద్ధు డుమ్మా | Navjot Sidhu skips Narendra Modi rally | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీ ర్యాలీకి సిద్ధు డుమ్మా

Published Sun, Feb 23 2014 3:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

నరేంద్ర మోడీ ర్యాలీకి సిద్ధు డుమ్మా - Sakshi

నరేంద్ర మోడీ ర్యాలీకి సిద్ధు డుమ్మా

జాగ్రోన్ (పంజాబ్): టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ నవ్జ్యోత్ సింగ్ సిద్ధు.. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ర్యాలీకి డుమ్మా కొట్టారు. ఆదివారమిక్కడ జరిగిన ర్యాలీలో బీజేపీ నేతలతో పాటు మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ నాయకులు పాల్గొన్నారు. అయితే పంజాబ్ నుంచి (అమృత్సర్) బీజేపీ తరపున ఎంపికైన ఏకైక ఎంపీ సిద్ధు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది.

గతంలో గుజరాత్ సహా పలు ఎన్నికల్లో బీజేపీ తరపున సిద్ధు ప్రచారం చేశారు. అనంతరం పంజాబ్ రాష్ట్ర శాఖ బీజేపీ నేతలతో పాటు మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ నాయకులతో సంబంధాలు దెబ్బతిన్నాయి. సిధ్దు వారిపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మోడీ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా తనకు ఆహ్వానం అందలేదని సిద్ధు శుక్రవారం చెప్పడం గమనార్హం. తనను ఆహ్వానించకుంటే ర్యాలీకి వెళ్లబోనని చెప్పిన సిద్ధు దూరంగానే ఉండిపోయారు. వేదికపై బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ బీజేపీ, అకాలీదళ్ నేతలను ప్రశంసించినా.. సిద్ధు పేరు ప్రస్తావించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement