'ఇక్కడ సిక్స్ల మోత మోగాలి' | pm modi announce eighty thousand crores package to kashmir | Sakshi
Sakshi News home page

'ఇక్కడ సిక్స్ల మోత మోగాలి'

Published Sat, Nov 7 2015 1:13 PM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

'ఇక్కడ సిక్స్ల మోత మోగాలి' - Sakshi

'ఇక్కడ సిక్స్ల మోత మోగాలి'

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు వేదిక కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ స్టేడియంలో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్లు తప్పక పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన మాట్లాడుతున్న సభా ప్రాంగణం షేర్ ఈ కశ్మీరీ క్రికెట్ స్టేడియాన్ని ఉద్దేశించి చెప్పారు. అంతేకాక, సచిన్, సెహ్వాగ్ల కొట్టే సిక్స్ల మాదిరిగా ఇక్కడికి వచ్చిన అంతర్జాతీయ బ్యాట్స్మెన్లు తమ బ్యాట్లతో సిక్స్ల మోతమోగించాలని, అలాంటివాటికి కశ్మీర్ వేదిక కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా మోదీ జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి వరాలు ప్రకటించారు. రూ.80 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించి ఈ ప్యాకేజీతో జమ్మూకశ్మీర్ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇక్కడి యువత జీవితాలు బాగుపడతాయని అన్నారు. శ్రీనగర్ లో బీజేపీ-పీడీపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  షేర్ ఈ కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement