'అసహనం'పై దేశ వ్యాప్తంగా రచయితలు, కళాకారులు, సినిమా స్టార్లు నిరసన వ్యక్తం చేస్తుండటంతో.. ఇప్పటి వరకూ కేంద్ర మంత్రుల ద్వారా సమాధానం చెబతూ వస్తున్నబీజేపీ తాజాగా.. కౌంటర్ ఎటాక్ పదును పెంచాలని భావిస్తోంది.
విపక్షాలకు గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించింది. మంగళవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నుంచి రాష్ట్ర పతి భవన్ వరకూ నిర్వహించిన ర్యాలీకి కౌంటర్ గా.. ప్రముఖ నటుడు అనుపం ఖేర్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈనెల 7న కళాకారులు, నటులతో ఈ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు.
కాగా.. మోదీ సర్కారు తీరు దేశంలో సామాజిక, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని విమర్శించిన కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ.. ర్యాలీ అనంతరం రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం సమర్పించిన సంగతి తెలిసిందే.
అనుపంతో కౌంటర్ ప్లాన్ చేస్తున్న బీజేపీ
Published Wed, Nov 4 2015 1:58 PM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
Advertisement
Advertisement