Punjab Assembly Election 2022 Congress Party Announces CM Candidate - Sakshi
Sakshi News home page

Punjab Assembly Election-Congress Party: పంజాబ్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

Published Sun, Feb 6 2022 5:53 PM | Last Updated on Sun, Feb 6 2022 6:40 PM

Punjab Assembly Election 2022 Congress Party Announces CM Candidate - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తుండటంతో పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు కాంగ్రెస్‌ పార్టీ తెరదించింది. ప్రస్తుత సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ వైపే మొగ్గుచూపింది. లుధియానాలో ఆదివారం జరిగిన వర్చువల్‌ ఎన్నికల ప్రచారంలో పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ ఈ మేరకు ప్రకటించారు. ‘సీఎం అభ్యర్థిని నిర్ణయించడం ఇబ్బందికర పరిస్థితే. అయితే, పేదల కష్టాన్ని ఓ పేద బిడ్డ మాత్రమే అర్థం చేసుకుంటారని పంజాబ్‌ ప్రజలు భావిస్తున్నారు. అందుకనే చన్నీనే పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.
(చదవండి: ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్‌కి.. ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అంటూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement