హైదరాబాద్ : టిక్ టాక్ ద్వారా వీడియోలు చేసి భారత్‌లో అభిమానుల్ని పెంచుకుంటున్నాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ క్రికెటర్ చేసిన బుట్టబొమ్మ సాంగ్ టిక్ టాక్ బాగా పాపులర్ కావడంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. మహేశ్‌బాబు ‘పోకిరి’డైలాగ్‌తో పాటు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్ బ్లాక్’ సాంగ్‌కు టిక్‌టాక్ చేసి అభిమానుల్ని అలరించారు. అలాగే ప్రభాస్ ‘బాహుబలి’ డైలాగ్‌కు టిక్‌టాక్ వీడియో చేసి అందరినీ అశ్చర్యపరిచాడు.
(చదవండి : మహేశ్ పాటకు చంపేశావ్ పో..)
తాజాగా వార్నర్ ఫ్యామిలి భారతీయ వివాహాలలో చాలా మందికి ఇష్టమైన భాంగ్రా నృత్యం చేసి అలరించింది. వార్నర్ భార్య, ఇద్దరు కుమార్తెలు కలిసి భాంగ్రా ఫంక్షన్ సాంగ్‌కు స్టెప్పులేశారు. పాటకు తగ్గట్టుగా స్టెప్పులేయనప్పటికీ.. వార్నర్ ‘బాంగ్రా’ డాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన వార్నర్ ఫ్యామిలీ ‘పంజాబీ’ పాటకు నృత్యం చేయడం భారతీయులను ఆకట్టకుంటుంది. ఇక వరుసగా టాలీవుడ్ పాటలకు, డైలాగ్స్‌కి టిక్‌టాక్ వీడియోలు చేయడంతో వార్నర్‌పై పలు హీరోల అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తమ అభిమాన హీరోలకు సంబంధించిన మరిన్ని పాటలకు, డైలాగ్‌లకు టిక్‌టాక్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. (చదవండి : వార్నర్ మరో టిక్‌టాక్.. ఈ సారి బాహుబలి)
Comments
Please login to add a commentAdd a comment