సూపర్‌ హిట్‌ సాంగ్‌కు డాన్స్‌ చేసిన వార్నర్‌ కూతుళ్లు | David Warner's Daughters Dance To Akshay Kumar's Hit Bala Song | Sakshi
Sakshi News home page

సూపర్‌ హిట్‌ సాంగ్‌కు డాన్స్‌ చేసిన వార్నర్‌ కూతుళ్లు

Published Thu, Jul 16 2020 9:59 AM | Last Updated on Thu, Jul 16 2020 11:14 AM

David Warner's Daughters Dance To Akshay Kumar's Hit Bala Song - Sakshi

డేవిడ్‌ వార్నర్‌ మంచి క్రికెటర్‌ గానే కాకుండా లాక్‌డౌన్‌లో టిక్‌టాక్‌లో మంచి మంచి డాన్స్‌ వీడియోలు చేసి ఫేమస్‌ అయ్యారు. నార్త్‌, సౌత్‌ అనే తేడా లేకుండా అన్ని రకాల ఇండియన్‌ సాంగ్స్‌కు తన ఫ్యామిలీతో కలిసి డాన్స్‌ చేసి ఆ వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసేవాడు వార్నర్‌. అయితే టిక్‌టాక్‌ బ్యాన్‌తో వార్నర్‌ సైలెంట్‌ అయిపోతాడేమో అనుకున్నారు అంతా. అయితే తాజాగా వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఆయన ఇద్దరు కూతుళ్లు అక్షయ్‌కుమార్‌ రీసెంట్‌ సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘బాల బాల’ కు డాన్స్‌ చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేశారు. ‘మీ కూతుళ్లు వాళ్ల స్టైల్‌లో బాల డాన్స్‌ చేయాలనుకుంటే’ అనే శీర్షికను వార్నర్‌ ఆ వీడియోకు జోడించాడు. ఈ వీడియోను చాలా మంది వార్నర్‌ అభిమానులు షేర్‌ చేస్తూ, లైక్‌ కొడుతున్నారు. 

చదవండి: టిక్‌టాక్‌ బ్యాన్‌: వార్నర్‌ను ట్రోల్‌ చేసిన అశ్విన్‌‌

ఇవే కాకుండా వార్నర్‌ షీలాకీ జవానీ సాంగ్‌కు, అలాగే అంతక ముందే వార్నర్‌ కూడా అక్షయ్‌ కుమార్‌  సాంగ్‌కు డాన్స్‌ చేసిన వీడియోలను అనేక సార్లు టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేశారు. ఇక దక్షిణ భారతదేశానికి చెందిన స్టార్స్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ సాంగ్స్‌కు, మహేష్‌బాబు మైండ్‌ బ్లాక్‌ సాంగ్స్‌కు కూడా తన భార్యతో కలిసి వార్నర్‌ డాన్స్‌  చేశాడు. 

చదవండి: వార్నర్‌ ‘మైండ్‌ బ్లాక్‌’ అదిరింది కానీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement