
షార్ట్ వీడియో ఫ్లాట్ ఫామ్ టిక్ టాక్ పోటీగా వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా డ్యూయల్ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది.
ఇన్‌స్టాగ్రామ్ డ్యూయెల్ ఫీచర్‌ని ప్రకటించింది. దీంతో యూజర్ ఒకే సమయంలో ఫోన్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలను ఉపయోగించి ‘రీల్స్’ను రికార్డ్ చేయవచ్చు.‘డ్యూయల్ ఫీచర్’ని ఇలా ఉపయోగించాలి...
♦ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి.
♦ స్క్రీన్ టాప్‌రైట్‌లో ఉన్న ప్లస్ ఐకాన్ నొక్కాలి.
♦ ‘రీల్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
♦ లెఫ్ట్‌సైడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
♦ డ్యూయల్ లేబుల్‌తో ఉన్న కెమెరా ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
♦ ‘రికార్డ్’ ఐకాన్ నొక్కాలి. రికార్డింగ్ తరువాత ఎఫెక్ట్స్, మ్యూజిక్ యాడ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment