యూజర్లకు ఫేస్‌బుక్ (మెటా) బంపరాఫర్ ప్రకటించింది. ఫేస్‌బుక్ ద్వారా 35వేల డాలర్ల సంపాదించే అవకాశాన్ని క్రియేటర్లకు కల్పిస్తున్నట్లు తెలిపింది.
మనదేశంలో టిక్ టాక్ బ్యాన్ తర్వాత్ షార్ట్ వీడియోలు జోరు ఊపందుకుంది. 2020 జూన్ నెలలో కేంద్రం టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు టిక్ టాక్ ను తలదన్నేలా ఫేస్‌బుక్ రీల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొలిసారి గతేడాది యూఎస్‌లో రీల్స్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ సదుపాయాన్ని 150 దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు సోషల్ నెట్ వర్క్ దిగ్గజం తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
రీల్స్ చేయండి..డబ్బులు సంపాదించండి.
కోవిడ్ కారణంగా క్రియేటర్‌లను ఆదుకునేలా ఫేస్‌బుక్‌లో డబ్బులు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల టిక్ టాక్ క్రియేటర్లు ఫేస్‌బుక్ రీల్స్‌లో మనీ ఎర్నింగ్స్ పై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ ప్రతినిధులు ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ వ్యూస్, లైక్స్‌తో పాటు ఇతర అంశాల్ని పరిగణలోకి తీసుకొని అర్హులైన క్రియేటర్లు నెలకు 35వేల డాలర్ల వరకు చెల్లించేందుకు రీల్స్ ప్లే బోనస్ ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దీంతో పాటు క్రియేటర్‌లు డబ్బులు సంపాదించేందుకు ఇతర అవకాశాల్ని క్రియేట్ చేస్తున్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment