ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యూజర్లకు శుభవార్త చెప్పనుంది. అన్ని వేళల్లో పర్సనల్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి..ఆ ఊహలను నిజం చేస్తూ ఇన్‌స్టాగ్రాం తన యూజర్లకు పర్సనలైజ్డ్ ఏఐ చాట్‌బాట్‌ను క్రియేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఏఐ ఫ్రెండ్’ అనే చాట్‌బాట్‌పై పనిచేస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తద్వారా యూజర్లు ఎవరికి వారే ఏఐ చాట్‌బాట్‌ను ప్రత్యేకంగా తయారు చేసుకునే వెసలు బాటు కలగనుంది.
టెక్‌క్రంచ్ ప్రకారం ఇన్ స్టా పరిచయం చేయనున్న ఈ ఫీచర్ సాయంతో యూజర్లు వారి వారి అభిప్రాయాల గురించి చర్చించుకోవచ్చు. రకరకాల ఐడియాలను ఈ చాట్‌బాట్ ద్వారా పొందవచ్చు. ఉదాహరణకు ఫుడ్, ఫ్యాషన్, టెక్నాలజీ, బిజినెస్ ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు ఏమైనా ఈవెంట్‌లు జరుగుతుంటే..వాటికి మీరు ఎలాంటి దుస్తులు ధరించాలి. ఆ ఈవెంట్‌లో ఎలా ఉండాలి’ ఇలా అనేక విషయాల గురించి చాట్‌బాట్‌ను అడిగి తెలుసుకోవచ్చు. కాగా, పర్సనలైజ్డ్ ఏఐ చాట్‌బాట్స్ ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రాం సంచలనానికి కేంద్ర బిందువు కానుందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment